Telugu govt jobs   »   Study Material   »   Telangana State Symbols
Top Performing

Telangana State Symbols : List of Symbols – Animal,Flower,Tree,Bird | తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలు

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలు

తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు, అలవాట్లకు అద్దంపడుతూ, చరిత్ర, పౌరాణిక నేపథ్యం ఉన్న వాటిని ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్ర జంతువుగా జింక , రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడును రాష్ట్ర అధికారిక చిహ్నాలుగా ప్రభుత్వం ఖరారు చేసింది.

Know your State Quiz: Telangana State Symbols Quiz

రాష్ట్ర పక్షి : పాలపిట్ట

Telangana State Symbols : List of Symbols - Animal, Flower, Tree, Bird_3.1

  • శాస్త్రీయనామం: కొరాషియస్ బెంగాలెన్సిస్
  • పాలపిట్ట తెలంగాణ రాష్ట్రము యొక్క రాష్ట్రపక్షి.
  • దీని శాస్త్రీయ నామము Coracias benghalensis . ఇది “బ్లూ-బర్డ్”గా కూడా పిలువబడుతుంది. ఇది రోలర్ కుటుంబమునకు చెందిన పక్షి.
  • ఇవి ముఖ్యముగా భారత దేశములో, ఇరాక్, థాయిలాండ్ దేశాలలోనూ కనబడతాయి.
  • పాలపిట్టకు తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉందని, ప్రతి ఏటా దసరా పండుగ రోజు ఈ పక్షిని దర్శించుకోవడం ఓ పుణ్య కార్యక్రమంగా ప్రజలు భావిస్తారని పేర్కొన్నారు.
  • పాలపిట్టను దర్శించుకోవడం శుభసూచకంగా ప్రజలు భావిస్తారని, లంకపై దండయాత్ర చేసే ముందు శ్రీరాముడు ఈ పక్షిని దర్శించుకున్నారని, అందుకే ఆయన ను విజయం వరించిందని పౌరాణిక గాథలు చెబుతున్నాయని వివరించారు.
  • రాష్ట్రం కూడా విజయపథంలో నడవాలని రాష్ట్ర పక్షిగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రభుత్వం ఖరారు చేసింది.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

రాష్ట్ర జంతువు: జింక

Telangana State Symbols : List of Symbols - Animal, Flower, Tree, Bird_5.1

శాస్త్రీయనామం: ఆక్సిస్ ఆక్సిస్

  • తెలంగాణ ప్రజల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందని జింకను తెలంగాణ రాష్ట్ర జంతువుగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ జంతువు యొక్క శాస్త్రీయ నామం ఆక్సిస్ ఆక్సిస్
  • తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ జింకలు ఉన్నాయి. చిన్నచిన్న అడవుల్లోనూ అవి మనుగడ సాగిస్తాయి. అడవి జంతువుల్లో అత్యంత సున్నితమైన, అమాయకమైనదిగా జింకకు పేరుంది.

రాష్ట్ర వృక్షం: జమ్మిచెట్టు

Telangana State Symbols : List of Symbols - Animal, Flower, Tree, Bird_6.1

  • శాస్త్రీయనామం: ప్రోసోఫిస్‌సినరేరియా (Prosopis Cineraria)
  • జమ్మిచెట్టు తెలంగాణ ప్రజల జీవితంలో అంతర్భాగమని పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై ఉంచారని, తర్వాత వాటితోనే కౌరవులను ఓడించారన్నారు.
  • విజయానికి సూచిక అయిన జమ్మిచెట్టు ఆశీర్వాదం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టుగా ప్రభుత్వం ఖరారు చేసింది.
  • శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు ఫాబేసి కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు.
  • ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం.

రాష్ట్ర పుష్పం: తంగేడు

Telangana State Symbols : List of Symbols - Animal, Flower, Tree, Bird_7.1

  • శాస్త్రీయనామం: కేసియా అరిక్యులేటా
  • తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగలో వాడే తంగేడు పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు.
  • అడవిలో సహజ సిద్ధంగా పెరిగే తంగేడు పూవు ప్రకృతికే అందాన్ని తెస్తుందని, ఈ పూలను సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా కూడా తెలంగాణ అడపడుచులు భావిస్తారని అందుకే తెలంగాణ రాష్ట్రానికి తంగేడు పూవును అధికారిక పుష్పంగా ప్రభుత్వం ఖరారు చేసింది.
  • తంగేడు ఒక విధమైన ఔషధ మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం కేషియా ఆరిక్యులేటా.
  • బంజరు భూముల్లో, ముఖ్యంగా చిట్టడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. మొక్క చాలా అందంగా వుండి, బంగారు రంగులో వుండే పూలు గుత్తులుగా, కొమ్మల చివర పెరుగుతూ, తొలకరి వానల అనంతరం దర్శనమిస్తాయి.
  • వీటిని గొబ్బిపూలు అని కూడా అంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చే మాసంలో, ముగ్గులపై అలంకరించడం, పేడ ముద్దలపై గుచ్చి, గొబ్బెమ్మలుగా పెట్టడం చేస్తూ వుంటారు. ఈ రకమైన ఆచారం వీటికి దైవత్వం ఆపాదించడానికి విధించినదేనని, ఆ మొక్కలోని ఔషధ ప్రాముఖ్యం తెలియజేయడానికే మన పూర్వీకులు ఈ విధమైన ఆచారాలను పాటించారని తెలుస్తుంది.తంగేడు పూలనుబతుకమ్మను పేర్చడంలో ఉపయోగిస్తారు.

రాష్ట్ర ఫలం : మామిడికాయ

Telangana State Fruit - Mango

  • శాస్త్రీయనామం: మాంగిఫెరా ఇండికా  (Mangifera indica)
  • మామిడి  అనేది వేసవి కాలంలో లభించే తెలంగాణాలో అత్యంత ప్రజాదరణ పొందిన పండు. ఇది భారతదేశ జాతీయ పండు కూడా.
  • మామిడి అనేది ఉష్ణమండల చెట్టు మాంగిఫెరా ఇండికా ద్వారా ఉత్పత్తి చేయబడిన తినదగిన రాతి పండు.
  • ఇది వాయువ్య మయన్మార్, బంగ్లాదేశ్ మరియు ఈశాన్య భారతదేశం మధ్య ప్రాంతం నుండి ఉద్భవించిందని పేర్కొన్నారు. ఇది ఉత్తర తెలంగాణా లో అత్యధికంగా లభించే పండు.

Also read: Bathukamma Telangana State Festival

తెలంగాణ రాష్ట్ర చిహ్నం 

Emblem of Telangana
Emblem of Telangana
  • కాకతీయ కళాతోరణం కింద చార్మినార్, కాకతీయ కళాతోరణంపై సింహతలాటం, చుట్టూ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూభాషల్లో తెలంగాణ ప్రభుత్వం, సత్యమేవజయతే ఉన్నాయి.
  • తెలంగాణ అధికారిక చిహ్నం వృత్తాకారంలో ఉంటుంది, ఈ చిహ్నం బయటి వృత్తం గోధుమ, అంతరవృత్తం చిలకపచ్చ రంగులో ఉంటాయి.
  • వాటి మధ్యలో పైభాగంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఆంగ్లంలో, దాని కింద తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది.
  • మధ్య వృత్తంలో కాకతీయ కళా తోరణం, దాని మధ్యలో చార్మినార్ గుర్తు, దానిపై మూడు సింహాల చిహ్నం ఉంటాయి.
  • బాహ్య వలయం దిగువన “సత్యమేవ జయతే” అని ఉంటుంది. నాలుగున్నరకోట్ల ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ, పచ్చని తెలంగాణ నూటికినూరుపాళ్లు ప్రతిబింబించేలా ఈ లోగోను ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ రూపొందించారు.

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలు

తెలంగాణ  రాష్ట్ర అధికారిక మాసపత్రిక తెలంగాణ
తెలంగాణ  రాష్ట్ర అధికారిక చానల్ యాదగిరి
తెలంగాణ  రాష్ట్ర అధికారిక పండుగలు బతుకమ్మ, బోనాలు
తెలంగాణ  రాష్ట్ర అధికారిక ఫలము మామిడికాయ
తెలంగాణ ప్రజల ప్రధాన ఆహారం గటుక (జొన్న సంకటి), (వరి అన్నం).
తెలంగాణ రాష్ట్ర అధికారిక క్రీడా కబడ్డీ
తెలంగాణ రాష్ట్ర అధికారిక నది  గోదావరి
తెలంగాణ రాష్ట్ర చేప కొర్రమీను (Murrel)
TEST PRIME - Including All Andhra pradesh Exams

Sharing is caring!

Telangana State Symbols : List of Symbols - Animal, Flower, Tree, Bird_11.1

FAQs

What is State Fruit of Telangana?

“Mango” is the state fruit of Telangana and the scientific name of this fruit is ” Mangifera indica''

what is the scientific name of Jammi Chettu?

The scientific name of Jammi Chettu is ''Prosopis Cineraria''

what is State animal of Telangana?

The telangana State animal is Deer (Jinka)