Telangana State won 13 Panchayat Raj Awards
Telangana bagged 13 awards out of a total of 46 National Gram Panchayat Awards including Greenery and Cleanliness. 11 Grama panchayats, one Mandal parishad, and one Zilla parishad received these awards. Chief Minister K. Chandrasekhara Rao expressed happiness over this. In celebration of the National Panchayat Raj Day, the ‘National Conference on Promotion of Panchayats Awards Ceremony’ was held at Vigyana Bhavan in Delhi. President Draupadi Murmu was the chief guest.
పచ్చదనం, పరిశుభ్రతతో సహా మొత్తం 46 జాతీయ గ్రామ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ 13 అవార్డులను కైవసం చేసుకుంది. 11 గ్రామ పంచాయతీలు, ఒక మండల పరిషత్, ఒక జిల్లా పరిషత్ ఈ అవార్డులను అందుకున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ప్రమోషన్ ఆఫ్ పంచాయతీస్ అవార్డుల ప్రదానోత్సవం’ జరిగింది. అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
APPSC/TSPSC Sure shot Selection Group
ఈ సందర్బంగా కేంద్రం తొమ్మిది కేటగిరిల్లో మొత్తం 46 జాతీయ అవార్డులను ప్రకటించగా, 13 అవార్డులను తెలంగాణ సొంతం చేసుకుంది. తెలంగాణ ఎనిమిది దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ అవార్డులు (DDUPSVP) మరియు ఐదు నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ పంచాయతీ సతత్ వికాస్ అవార్డులు (NDSPSVP) పొందింది. ఈ అవార్డులను రాష్ట్రపతి ముర్ము, కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్‌ల చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు అందుకున్నారు.
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏప్రిల్ 17,2023 న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ గ్రామ పంచాయతీలకు ఈ అవార్డులను అందజేశారు. ఇక దేశవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా, అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే ఈ అవార్డులు పొందాయి. ఇందులో తెలంగాణ 13 అవార్డులను గెలుచుకుంది. అంటే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 30 శాతం తెలంగాణకు దక్కడం విశేషం.
Awards received by Telangana Panchayat Department | తెలంగాణ పంచాయతీ శాఖ పొందిన అవార్డులు
- గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ-నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ సర్టిఫికెట్): సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎర్రవెల్లి.
- గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె.
- కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా
- ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీ: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్.ఎం.డి
- ఉత్తమ జిల్లా పంచాయతీలు: ములుగు జిల్లా
- ఆరోగ్యవంతమైన పంచాయతీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్
- స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాలు గల పంచాయతీ: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం గంభీర్ రావుపేట
- పేదరికరహిత, జీవనోపాధి పెంచిన పంచాయతీ: గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం
- సుపరిపాలనగల పంచాయతీ: వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం చీమల్దారి
- క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ: పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్పూర్
- స్నేహపూర్వక మహిళా పంచాయతీ: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరు
- సామాజిక భద్రతగల పంచాయతీ: మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్పల్లి
- తాగునీరు సమృద్ధిగా ఉన్న పంచాయతీ: జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |