Telugu govt jobs   »   Article   »   Telangana to be Represented as TG...

Telangana to be Represented as TG instead TS | తెలంగాణ ని TS కి బదులుగా TG గా మార్చనున్నారు

తెలంగాణలో ఫిబ్రవరి 4వ తేదీనాడు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సంక్షిప్తీకరణను ను ప్రస్తుతం ఉన్న TS స్థానంలో TGగా మారుస్తునట్టు ప్రకటించారు.

2014లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అప్పటి TRS పార్టీ TSను రాష్ట్ర సంక్షిప్తీకరణగా ఎంపిక చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అన్నీ అధికారిక కార్యకలాపాల కోసం TS ను ఉపయోగిస్తున్నారు మరియు రాష్ట్రం లోని వాహన రిజిస్ట్రేషన్ కి కూడా TS ని వినియోగిస్తున్నారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో వినియోగం లో ఉన్న TS స్థానం లో TG ని వినియోగించాలి అని క్యాబినెట్ తీర్మానించింది.

క్యాబినెట్ సమావేశాల తర్వాత మంత్రి డి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో తెలంగాణకు TGగానే ఆమోదించింది అని కానీ గత ప్రభుత్వం గెజిట్‌ను కాదని TSగా పేరు మార్చినట్లు తెలిపారు. ఇకనుంచి TGని అన్నీ అధికారిక కార్యకలాపాలకు వినియోగించనున్నారు. అందెశ్రీ రచించిన ‘జై జై హో తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా స్వీకరించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజలతో సంప్రదించి కొత్త రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తామని తెలిపారు.

 ఇతర క్యాబినెట్ ఆమోదాలు:

  • రూ.500కి గ్యాస్ సిలిండర్ మరియు గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
  • రాజేంద్రనగర్ జిల్లాలో కొత్త హైకోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించడం
  • 65 ప్రభుత్వ ఐటీఐలను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా మెరుగుపరచడం
  • త్వరలోనే కుల గణన చేపట్టాలని నిర్ణయించారు
  • కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి (KADA)ను ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!