మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) ద్వారా ప్రస్తుత ధరల ప్రకారం తలసరి నికర రాష్ట్రీయోత్పత్తి వృద్ధి రేటు పరంగా తెలంగాణ ఒక కోటి జనాభాతో భారతదేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా నిలిచింది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలను ధాటి ముందంజలో ఉన్నది.
MoSPI ప్రకారం:
- తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP) 2011-12లో రూ. 359434 కోట్ల నుండి 2021-22 నాటికి రూ. 1,154,860 కోట్లకు పెరిగింది. ఇది 2011-12 నుండి 31.12 శాతం GSDP వృద్ధిని నమోదు చేసింది. దేశంలో ఇతర రాష్ట్రాలకంటే ఇది అత్యధిక వృద్ధి రేటు.
- GSDPలో వృద్ధి శాతం పరంగా, 2020 నుండి ఇప్పటి వరకు తెలంగాణ తన వృద్ధి రేటులో అత్యంత వేగంగా 17% పెరుగుదలను చూపింది.
- రైతుల కోసం రైతు బంధు పథకం, పొలాలకు నీటిని అందించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మరియు గర్భిణీ మరియు బాలింతల కోసం ఆరోగ్య లక్ష్మి పథకం వంటి ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :
- తెలంగాణ రాజధాని: హైదరాబాద్.
- తెలంగాణ గవర్నర్: తమిళిసై సౌందరరాజన్.
- తెలంగాణ ముఖ్యమంత్రి: కె. చంద్రశేఖర రావు.
Read More : తెలంగాణా బడ్జెట్ 2022-23 PDF
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************