Telugu govt jobs   »   Current Affairs   »   ఓడీఎఫ్ ప్లస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది
Top Performing

ఓడీఎఫ్ ప్లస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది

భారతదేశంలోని ODF ప్లస్ గ్రామాల జాబితాలో తెలంగాణ  అగ్రస్థానంలో నిలిచింది

స్వచ్ఛ భారత్ మిషన్ ఒడిఎఫ్ ప్లస్ విభాగంలో తెలంగాణ టాప్ పర్ఫార్మర్‌గా నిలిచింది. స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రామీణ ఫేజ్-2లో భాగంగా భారతదేశంలోని అన్ని గ్రామాలలో 50% బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్ ప్లస్) జాబితాలో చేర్చినట్లు ప్రభుత్వం మే 10 న  ప్రకటించింది. సాలిడ్, లిక్విడ్, వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లను అమలు చేసి ఓడీఎఫ్ రహిత హోదా సాధించిన గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో చేర్చినట్లు కేంద్ర జలవనరుల శాఖ నివేదించింది. బహిరంగ మలవిసర్జన రహిత స్థితిని కొనసాగించడం, బయో డిగ్రేడబుల్ వ్యర్థాలు,  ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ద్రవ వ్యర్థాలను నిర్వహించడం వంటి పలు చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు తెలంగాణ ప్రశంశలు అందుకుంది.  కేంద్ర జల విద్యుత్ శాఖ ఒక ప్రకటన ప్రకారం, మే 10 నాటికి దేశవ్యాప్తంగా 2,96,928 గ్రామాలు ODF ప్లస్ జాబితాలో ఉన్నాయి.

100% స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచి, అన్ని గ్రామ పంచాయతీలు ODF ప్లస్‌గా ఉన్న ఏకైక రాష్ట్రంగా అవతరించడం ద్వారా తెలంగాణ అద్భుతమైన ఘనత సాధించింది. కర్ణాటక (99.5%),  తమిళనాడు (97.8%), ఉత్తరప్రదేశ్ (95.2%) తర్వాతి స్థానాల లో  గుజరాత్ చివరి స్థానంలో నిలిచింది. చిన్న రాష్ట్రాలలో గోవా (95.3%), సిక్కిం (69.2%) అత్యుత్తమ పనితీరు కనబరిచినట్లు కేంద్ర జలవిద్యుత్ శాఖ తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ మరియు నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్ మరియు లక్షద్వీప్‌లు కూడా 100% ODF ప్లస్ హోదాను సాధించాయి. ఓడీఎఫ్ ప్లస్‌లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

APPSC గ్రూప్-2 Complete Prelims + Mains 360 Degrees Preparation Kit | Online Live Classes by Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

ఓడీఎఫ్ ప్లస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది_4.1

FAQs

ODF ఎప్పుడు ప్రారంభించబడింది?

స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీన్) [SBM (G)] అక్టోబర్ 2, 2014 న ప్రారంభించబడింది, ఇది అక్టోబర్ 02, 2019 నాటికి దేశంలోని అన్ని గ్రామీణ కుటుంబాలకు మరుగుదొడ్లను అందించడం ద్వారా బహిరంగ మలవిసర్జన రహిత (ODF) దేశంగా మార్చడం ప్రధాన లక్ష్యం.