తెలంగాణ VRO నోటిఫికేషన్ 2025 త్వరలో ప్రకటించవచ్చు మరియు అభ్యర్థులు మంచి స్కోరు సాధించడానికి పూర్తిగా సిద్ధం కావాలి. అభ్యర్థులకు సహాయం చేయడానికి, Adda247 తెలుగు ముఖ్యమైన అంశాలపై తెలంగాణ VRO స్టడీ నోట్స్ మరియు MCQ లను అందిస్తోంది. ఈరోజు అంశం తెలంగాణ పాలసీ మరియు పధకాలు, వీటితో మీరు మెరుగైన సమాచారం తో పాటు మంచి మార్కులు పొందగలరు. తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న పధకాలు వాటి నిర్వహణ, అవసరాలు, కేటాయింపులు వంటి మరెన్నో అంశాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. పూర్తిగా చదివి, మీ ప్రణాళికని మెరుగుపరచుకోండి మరియు ఈ MCQ లను ప్రయత్నించండి.
తెలంగాణ పాలసీలు మరియు స్కీములు
నూతన తెలంగాణా ప్రభుత్వం ఎన్నో ఆశలతో మరియు ప్రజలకు అవసరాలు తీర్చే పద్ధకాలతో అధికారంలోకి వచ్చింది. తాజాగా ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కావున అభ్యర్ధులు పధకాలు మరియు ప్రభుత్వం నూతనంగా తీసుకునే పాలసీల పట్ల అవగాహనతో ఉండాలి.
Q1. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే పథకం ఏది?
(a) అమ్మ కోసం పథకం
(b) మహిళా శక్తి పథకం
(c) మహాలక్ష్మి పథకం
(d) చేయూత పథకం
Ans: (c) మహాలక్ష్మి పథకం
వివరణ:
తెలంగాణ మహాలక్ష్మి పథకం అనేది మహిళా సాధికారత పథకం, ఇది తెలంగాణ రాష్ట్ర మహిళలకు వారి కుటుంబ పెద్దలకి 2500 రూపాయల ఆర్థిక సహాయం అందించడం,మరియు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లు మరియు తెలంగాణ అంతటా ఉచిత RTC బస్సు ప్రయాణం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Q2. “చేయూత పథకం” తెలంగాణలో ఏ సేవలకు సంబంధించినది?
(a) ఉచిత విద్యుత్
(b) మాతృ ఆరోగ్య సంరక్షణ
(c) ఆరోగ్యశ్రీ ఆరోగ్య ప్రయోజనాలు
(d) సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు
Ans: (c) ఆరోగ్యశ్రీ ఆరోగ్య ప్రయోజనాలు
వివరణ:
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం, వైద్యం అందించేందుకు చేయూత పథకాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్ని ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించబడుతుంది.
ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ. వైద్య చికిత్స కోసం 10 లక్షల ఆర్థిక కవరేజీ. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 90.10 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయని అంచనా. శారీరక రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు 21 ప్రత్యేక సేవలతో పాటు 1,672 విభిన్న వైద్య ప్యాకేజీలు కూడా ఈ పథకం కింద అందుబాటులో ఉన్నాయి.
Q3. తెలంగాణ ప్రభుత్వం రూ.500 సబ్సిడీ రేటులో గ్యాస్ సిలిండర్లను అందించే పథకం ఏది?
(a) చేయూత పథకం
(b) ఇంద్రమ్మ హౌసింగ్ పథకం
(c) గృహ జ్యోతి పథకం
(d) మహాలక్ష్మి పథకం
Ans: (d) మహాలక్ష్మి పథకం
వివరణ: తెలంగాణ మహాలక్ష్మి పథకం అనేది మహిళా సాధికారత పథకం, ఇది తెలంగాణ రాష్ట్ర మహిళలకు వారి కుటుంబ పెద్దలకి 2500 రూపాయల ఆర్థిక సహాయం అందించడం,మరియు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లు మరియు తెలంగాణ అంతటా ఉచిత RTC బస్సు ప్రయాణం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Q4. కింది తెలంగాణ పథకాలతో వాటి లక్ష్యాలను సరిపోల్చండి:
పథకం | లక్ష్యం |
A. గృహ జ్యోతి | 1. మాతృ సహాయం |
B. అమ్మ కోసం | 2. ప్రయాణ పర్యవేక్షణ |
C. T-Safe యాప్ | 3. ఉచిత విద్యుత్ |
D. మహిళా శక్తి | 4. స్వయం సహాయ సంఘాలు |
సరైన జతను ఎంచుకోండి:
(a) A-3, B-1, C-2, D-4
(b) A-2, B-3, C-1, D-4
(c) A-1, B-2, C-3, D-4
(d) A-3, B-4, C-2, D-1
Ans: (a) A-3, B-1, C-2, D-4
Q5. 2024 మార్చి 11న ప్రారంభించిన “ఇంద్రమ్మ హౌసింగ్ పథకం” ప్రధాన లక్ష్యం ఏమిటి?
(a) మహిళలకు ఉచిత బస్సు సేవలు అందించడం
(b) స్వయం సహాయ సంఘాలకు రుణాలు అందించడం
(c) పేదల కోసం అఫోర్డబుల్ హౌసింగ్ నిర్మించడం
(d) ప్రయాణ భద్రతా చర్యలను అమలు చేయడం
Ans: (c) పేదల కోసం అఫోర్డబుల్ హౌసింగ్ నిర్మించడం
వివరణ: ఇళ్లు లేదా భూమి లేని వ్యక్తులకు ఇంటి నిర్మాణం కోసం ఉచిత భూమి/సైట్ ఇస్తారు. ఆర్థిక సహాయంలో భాగంగా రూ. 5,00,000 ఇంటి నిర్మాణం కోసం అవసరమైన వారికి అందిస్తారు.
Q6. తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి సరైన వాఖ్యలను గుర్తించండి:
- మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం మరియు గ్యాస్ సబ్సిడీ అందిస్తుంది.
- గృహ జ్యోతి పథకం ఉచిత విద్యుత్ అందిస్తుంది.
- . T-Safe యాప్ వ్యవసాయ పథకాల పర్యవేక్షణ కోసం రూపొందించబడింది
- అమ్మ కోసం పథకం మాతృ ఆరోగ్య సంరక్షణకు సంబంధించినది.
(a) I మరియు III మాత్రమే
(b) I, II, మరియు IV మాత్రమే
(c) II మరియు III మాత్రమే
(d) I, II, III, మరియు IV
Ans: (b) I, II, మరియు IV మాత్రమే
వివరణ: III తప్పు; T-Safe యాప్ ప్రయాణ పర్యవేక్షణ కోసం, వ్యవసాయ పథకాలకు కాదు.
Q7. కింది వాటిలో తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి తప్పు వాఖ్య ఏది?
(a) మహాలక్ష్మి పథకం 2023 డిసెంబర్ 9న ప్రారంభించబడింది.
(b) ఇంద్రమ్మ హౌసింగ్ పథకం 2024 మార్చి 12న ప్రారంభించబడింది.
(c) గృహ జ్యోతి పథకం ఉచిత విద్యుత్ అందిస్తుంది.
(d) చేయూత పథకం ఆరోగ్యశ్రీ ఆరోగ్య సంరక్షణకు సంబంధించినది.
Ans: (b) ఇంద్రమ్మ హౌసింగ్ పథకం 2024 మార్చి 11న ప్రారంభించబడింది, 12న కాదు.
వివరణ: ఇంద్రమ్మ హౌసింగ్ పథకం/ ఇందిరమ్మ ఇల్లు పధకం 2024 మార్చి 11న ప్రారంభించబడింది ఇళ్లు లేదా భూమి లేని వ్యక్తులకు ఇంటి నిర్మాణం కోసం ఉచిత భూమి/సైట్ ఇస్తారు. ఆర్థిక సహాయంలో భాగంగా రూ. 5,00,000 ఇంటి నిర్మాణం కోసం అవసరమైన వారికి అందిస్తారు.
Q8. 2025 “రాజీవ్ యువ వికాసం” పథకం గురించి కింది వాటిలో ఏది తప్పు?
(a) ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాల యువతకు స్వయంసంబంధిత ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది.
(b) I వర్గంలో రూ.1 లక్ష వరకు రుణాలు 70% సబ్సిడీతో అందిస్తారు.
(c) II వర్గంలో రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు రుణాలు 70% సబ్సిడీతో అందిస్తారు.
(d) పథకం కింద గరిష్ఠ రుణ పరిమితి రూ.3 లక్షలు, 60% సబ్సిడీతో అందిస్తారు.
Ans: (b) I వర్గంలో రూ.1 లక్ష వరకు రుణాలు 80% సబ్సిడీతో అందిస్తారు, 70% కాదు.
వివరణ: దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు రూ.6 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలి ఏడాది 1.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. క్యాటగిరీ-1 కింద రూ.లక్ష వరకు రుణం అందిస్తుంది. అందులో 80 శాతం రాయితీ ఉంటుంది. క్యాటగిరీ-2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తుంది. అందులో 70 శాతం రాయితీ కల్పిస్తుంది. క్యాటగిరీ-3 కింద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రుణాలను అందజేయనుండగా.. అందులో 60 శాతం రాయితీ లభిస్తుంది.
Q9. TSMFC నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం గురించి ఏ వాఖ్య సరైనది?
(a) ఈ కార్యక్రమం కేవలం ముస్లిం యువతకే అందుబాటులో ఉంటుంది.
(b) అర్హత వయో పరిమితి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది.
(c) పట్టణ ప్రాంతాల వార్షిక ఆదాయ పరిమితి రూ.2,00,000 ఉంటుంది.
(d) ఆధార్ కార్డు నమోదు అవసరం లేదు.
Ans: (c) పట్టణ ప్రాంతాల వార్షిక ఆదాయ పరిమితి రూ.2,00,000.
Q10. 2025-26 తెలంగాణ బడ్జెట్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) విభాగానికి కేటాయించిన మొత్తం ఎంత?
(a) ₹15,500 కోట్లు
(b) ₹17,677 కోట్లు
(c) ₹20,000 కోట్లు
(d) ₹4,500 కోట్లు
Ans: (b) ₹17,677 కోట్లు
వివరణ: మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఎ & యుడి) విభాగం కింద వివిధ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, 6 17,677 కోట్ల కేటాయింపును ప్రకటించింది, వీటిలో ఒక నవల మూడేళ్ల, 500 4,500 కోట్ల కోట్ల పెట్టుబడి ప్రణాళికతో సహా, కొత్తగా స్థాపించబడిన మునిసిపాలిటీలు మరియు పట్టణ అభివృద్ధి అధికారిక అభివృద్ధికి మరియు పట్టణ అభివృద్ధి అధికారుల అభివృద్ధి కోసం.
TS High Court GK Questions Geography – River System, Download PDF
Q11. తెలంగాణ బడ్జెట్ 2025-26 ప్రకారం, విద్యాశాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్ శాతం ఎంత?
(a) 6.5%
(b) 7.9%
(c) 10.2%
(d) 8.3%
Ans: (b) 7.9%
వివరణ: విద్యా రంగానికి రూ.23,108 కోట్లు అనగా మొత్తం కేటాయింపుల్లో 7.9% కేటాయించారు. ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు’ ఏర్పాటు చేయనున్నన్నారు. మొదటి దశలో 58 స్కూళ్ల నిర్మాణానికి రూ.11,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
Q12. 2035 నాటికి తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన పునరుత్పాదక ఇంధన లక్ష్యం ఎంత?
(a) 20,000 మెగావాట్లు
(b) 30,000 మెగావాట్లు
(c) 40,000 మెగావాట్లు
(d) 50,000 మెగావాట్లు
Ans: (c) 40,000 మెగావాట్లు
వివరణ: ప్రస్తుతం 10,095 మెగావాట్లుగా ఉన్న సామర్థ్యాన్ని రాబోయే పదేళ్లలో 50,500 మెగావాట్లకు పెంచాలని యోచిస్తోంది. 2034-35 నాటికి కొత్తగా 40,405 మెగావాట్ల సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా మొత్తం 50,500 మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది
Q13. 2025-2026 కోసం విద్యుత్ సబ్సిడీలకు కేటాయించిన మొత్తం ఎంత?
(a) ₹21,221 కోట్లు
(b) ₹1,775.15 కోట్లు
(c) ₹3,000 కోట్లు
(d) ₹9,000 కోట్లు
Ans: (b) ₹1,775.15 కోట్లు
వివరణ: గృహజ్యోతి పథకం ద్వారా రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. అర్హులైనవారికి విద్యుత్తు వాడకం నెలలో 200 యూనిట్లలోపు ఉంటే వారికి ఉచితంగా విద్యుత్తును అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి నెలకు దాదాపు రూ.వెయ్యి వరకు ఆర్థిక ప్రయోజనం కలుగుతోంది. ఇప్పటికే రూ.1,775.15 కోట్ల మొత్తాన్ని విద్యుత్ సంస్థలకు సబ్సిడీ కింద ప్రభుత్వం చెల్లించింది.
Q14. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 కి నోడల్ ఏజెన్సీ ఏది?
(a) TSSPDCL
(b) TGNPDCL
(c) NTPC
(d) TREDCO
Ans: (d) TREDCO
వివరణ: గ్రీన్ ఎనర్జీ ఉత్పాదకతను పెంచి భవిష్యత్తు అవసరాలకు సరిపడే విద్యుత్తును సమకూర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025’ని రూపొందించింది. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం అదనంగా సమకూర్చుకోవాలనేది కొత్త పాలసీ లక్ష్యం. ఈ పాలసీని పర్యవేక్షించే సంస్థ TREDCO/ తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్
Q15. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, మరియు గ్రీన్ మెథనాల్ ప్రాజెక్టులను స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత శాతం క్యాపిటల్ సబ్సిడీ అందిస్తోంది?
(a) 25%
(b) 20%
(c) 30%
(d) 50%
Ans: (a) 25%
వివరణ: ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ (బయోజనిక్ కార్బన్ సహా) పరిశ్రమల ప్లాంట్, పరికరాల (ఎలక్ట్రోలైజర్ సహా) వ్యయంలో 25శాతం వరకు సబ్సిడీగా ప్రభుత్వం అందిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, దాని డెరివేటివ్స్ తయారీ అవసరమైన డీసాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు 20శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు. ప్రాజెక్టులకు ప్రభుత్వమే నీటిసరఫరా సదుపాయాన్ని కల్పిస్తుంది. నీటి చార్జీలపై ఐదేళ్లపాటు 25శాతం రాయితీ ఇస్తారు.
Q16. రాష్ట్రంలోని గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పత్తుల అమ్మకాల ద్వారా లభించే నికర SGST ఆదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల పాటు 100% తిరిగి చెల్లిస్తుంది?
(a) 3 సంవత్సరాలు
(b) 5 సంవత్సరాలు
(c) 7 సంవత్సరాలు
(d) 10 సంవత్సరాలు
Ans: (b) 5 సంవత్సరాలు
వివరణ: గ్రీన్ హైడ్రోజన్ రీ ఫ్యూయలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు 30 శాతం పెట్టుబడి రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది. పరికరాల కొనుగోలుపై 100 శాతం ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ను ప్లాంట్‌లో ఉత్పాదన ప్రారంభమైన నాటి నుంచి ఐదేళ్లలో ఇస్తుంది.
Q17. తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 ఏ తేదీ నుండి అమలులోకి వచ్చింది?
(a) మార్చి 15, 2025
(b) మార్చి 20, 2025
(c) మార్చి 17, 2025
(d) మార్చి 25, 2025
Ans: (c) మార్చి 17, 2025
Q18. తెలంగాణ MSME పాలసీ 2024 ప్రకారం, వచ్చే ఐదేళ్లలో MSME అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంత మొత్తం ఖర్చు చేయాలని యోచిస్తోంది?
(a) ₹4,000 కోట్లు
(b) ₹3,000 కోట్లు
(c) ₹5,000 కోట్లు
(d) ₹6,000 కోట్లు
Ans: (a) ₹4,000 కోట్లు
వివరణ: తెలంగాణ ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో మైక్రో, స్మాల్ మరియు మిడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) అభివృద్ధి కోసం రూ. 4,000 కోట్లను ఖర్చు చేయాలని ప్రణాళిక వేసింది. ఇది రాష్ట్రంలో మొదటి MSME-నిర్దిష్ట విధానం, ఇది ఇప్పటికే ఉన్న TS-iPASS ఫ్రేమ్‌వర్క్‌లోని ఖాళీలను పూరించడానికి రూపొందించబడింది. MSMEలకు స్టార్టప్ నుండి సేల్స్ దశల వరకు ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ అందించడానికి ఈ పాలసీ 40 చర్యలను కలిగి ఉంటుంది.
Q19. MSME రంగం ఎదుర్కొంటున్న ఆరు కీలక సమస్యలను పరిష్కరించేందుకు MSME పాలసీ 2024ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి చెందిన వారు?
(a) తెలంగాణ
(b) ఆంధ్రప్రదేశ్
(c) కేరళ
(d) కర్ణాటక
Ans: (a): తెలంగాణ
Q20. గేమింగ్ రంగ వృద్ధిని వేగవంతం చేయడానికి కొత్త యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, మరియు కామిక్స్ (AVGC) పాలసీని ప్రారంభించేందుకు యోచిస్తున్న రాష్ట్రం ఏది?
(a) తమిళనాడు
(b) ఆంధ్రప్రదేశ్
(c) మహారాష్ట్ర
(d) తెలంగాణ
Ans: (a): తెలంగాణ
Q21. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన T-PRIDE పథకం పూర్తి పేరు ఏమిటి?
(a) Telangana Programme for Rural Industrial Development & Empowerment
(b) Telangana Promotion and Reforms for Industrial Development & Entrepreneurship
(c) Telangana State Program for Rapid Industrial Development & Empowerment
(d) Telangana State Program for Rapid Incubation of Dalit Entrepreneurs
Ans: (c) Telangana State Program for Rapid Industrial Development & Empowerment
Q22. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మొదటి పథకం ఏది?
(a) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
(b) ఇంద్రమ్మ హౌసింగ్ స్కీం
(c) గృహ జ్యోతి
(d) మహాలక్ష్మి పథకం
Ans: (a) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
Q23. “కూల్ రూఫ్ పాలసీ: 2023-2028” ను ప్రకటించిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది?
(a) కర్ణాటక
(b) ఆంధ్రప్రదేశ్
(c) తెలంగాణ
(d) మహారాష్ట్ర
Ans: (c)
వివరణ: హీట్ వేవ్స్ మరియు అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్‌ను పరిష్కరించడానికి కూల్ రూఫ్ పాలసీని ప్రకటించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ అనేది 2023 నుండి 2028 వరకు ఐదేళ్ల పాలసీ. కూల్ రూఫ్ పాలసీని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి ప్రారంభించారు.
Q24. 2030 నాటికి తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశించిన పునరుత్పాదక ఇంధన లక్ష్యం ఎంత?
(a) 10,000 మెగావాట్లు
(b) 20,000 మెగావాట్లు
(c) 30,000 మెగావాట్లు
(d) 40,000 మెగావాట్లు
Ans: (b) 20,000 మెగావాట్లు
Q25. తెలంగాణ MSME పాలసీ ప్రకారం, వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం ఎంత మొత్తం ఖర్చు చేయాలని యోచిస్తోంది?
(a) ₹3,500 కోట్లు
(b) ₹4,000 కోట్లు
(c) ₹5,000 కోట్లు
(d) ₹6,500 కోట్లు
Ans: (b) ₹4,000 కోట్లు
Q26. 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ విద్యా శాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్ ఎంత?
(a) ₹21,500 కోట్లు
(b) ₹22,750 కోట్లు
(c) ₹24,174 కోట్లు
(d) ₹25,600 కోట్లు
Ans: (c) ₹24,174 కోట్లు
వివరణ: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు పెరిగాయి. విద్యాశాఖకు రూ.23,108 కోట్లు కేటాయించగా.. గత బడ్జెట్ (రూ.21,292 కోట్ల)తో పోల్చితే ఇది రూ.1,816 కోట్లు అదనం. తాజాగా బడ్జెట్‌లో విద్యకు కేటాయించిన నిధుల వాటా 7.57 శాతం కాగా గత బడ్జెట్‌లో అది 7.31 శాతం.
Q27. తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 ఏ తేదీ నుండి అమలులోకి వచ్చింది?
(a) మార్చి 15, 2025
(b) మార్చి 17, 2025
(c) మార్చి 20, 2025
(d) మార్చి 25, 2025
Ans: (b) మార్చి 17, 2025
వివరణ: తెలంగాణ పర్యాటక పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025 నుంచి 2030 వరకు ఐదేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది. దీనిద్వారా ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాలని పర్యాటకశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 3 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా
Q28. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, మరియు గ్రీన్ మెథనాల్ ప్రాజెక్టులను స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత శాతం క్యాపిటల్ సబ్సిడీ అందిస్తోంది?
(a) 20%
(b) 25%
(c) 30%
(d) 50%
Ans: (b) 25%
ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ (బయోజనిక్ కార్బన్ సహా) పరిశ్రమల ప్లాంట్, పరికరాల (ఎలక్ట్రోలైజర్ సహా) వ్యయంలో 25శాతం వరకు సబ్సిడీగా ప్రభుత్వం అందిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, దాని డెరివేటివ్స్ తయారీ అవసరమైన డీసాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు 20శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు. ప్రాజెక్టులకు ప్రభుత్వమే నీటిసరఫరా సదుపాయాన్ని కల్పిస్తుంది. నీటి చార్జీలపై ఐదేళ్లపాటు 25శాతం రాయితీ ఇస్తారు.
Q29. తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 ద్వారా వచ్చే ఐదేళ్లలో ఎంత మొత్తం పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది?
(a) ₹10,000 కోట్లు
(b) ₹12,500 కోట్లు
(c) ₹15,000 కోట్లు
(d) ₹18,000 కోట్లు
Ans: (c) ₹15,000 కోట్లు
వివరణ: తెలంగాణ పర్యాటక పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025 నుంచి 2030 వరకు ఐదేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది. దీనిద్వారా ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాలని పర్యాటకశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 3 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా.
Q30. 2025-26 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది?
(a) ₹18,000 కోట్లు
(b) ₹20,616.89 కోట్లు
(c) ₹24,439 కోట్లు
(d) ₹49,383 కోట్లు
Ans: (c) ₹24,439 కోట్లు
వివరణ: వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. 2025-26 బడ్జెట్‌లో రూ.24,439 కోట్లు కేటాయించింది. ఇందులో ‘రైతుభరోసా’కు రూ.18 వేల కోట్లను ప్రతిపాదించింది. 2024-25లో వ్యవసాయ రంగానికి రూ.49,383 కోట్లు కేటాయించింది.
Q31. 2024-25లో వ్యవసాయ రంగానికి కేటాయించిన మొత్తం రూ.49,383 కోట్లలో రుణమాఫీకి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది?
(a) ₹18,000 కోట్లు
(b) ₹20,616.89 కోట్లు
(c) ₹24,439 కోట్లు
(d) ₹26,000 కోట్లు
Ans: (d) ₹26,000 కోట్లు
వివరణ: రూ.26 వేల కోట్లను రుణమాఫీకి కేటాయించారు. ఇంతవరకు 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616.89 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Telangana VRO 2025 Question Bank: 30+ Important MCQs on Telangana Policies, Download PDF