Telugu govt jobs   »   Current Affairs   »   తెలుగు భాషా దినోత్సవం చరిత్ర మరియు ప్రాముఖ్యత

తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29, చరిత్ర మరియు ప్రాముఖ్యత

తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29 న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ద్రావిడ భాష అయిన తెలుగు ఈ ప్రాంతాలలో ప్రధానంగా వాడుక భాష మరియు భారతదేశంలోని ఆరు శాస్త్రీయ భాషలలో తెలుగు ఒకటిగా గుర్తించబడింది. తెలుగు భాషను ప్రోత్సహించడానికి మరియు పెంపొందించడానికి ఉద్దేశించిన ఈ రోజు, దాని అభివృద్ధికి తోడ్పడటానికి  వివిధ కార్యక్రమాల తో పాటు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. భాషా వారసత్వాన్ని పెంపొందించడానికి, పరిరక్షించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలకు నిర్వహిస్తారు.

తెలుగు భాషా దినోత్సవం గిడుగు వెంకట రామమూర్తి రచనలకు నివాళిగా ఉపయోగపడుతుంది మరియు తెలుగు భాష యొక్క గొప్ప వారసత్వం మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దేశ ప్రధాని మోడి ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఆగస్టు 29వ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించాలి అని అన్నారు.

AP Forest Range Officer Notification 2022 , Apply Online |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

తెలుగు భాషా దినోత్సవం చరిత్ర

ప్రముఖ తెలుగు కవి, రచయిత, సామాజిక దార్శనికుడు గిడుగు వెంకట రామమూర్తి జన్మదినం సందర్భంగా ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. తెలుగు భాష బోధన మరియు వాడుకలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో రామమూర్తి కీలక పాత్ర పోషించారు.

20వ శతాబ్దానికి ముందు, విద్యాసంస్థల్లో తెలుగు బోధించేది పండితులు కానీ అది వాడుక భాషా కి భిన్నంగా  సంస్కృతీకరించబడినది. దీనివలన సామాన్య ప్రజలు ఉపయోగించే మాట్లాడే భాష నుండి విధ్యార్ధులు నేర్చుకునేది చాలా భిన్నంగా ఉండెది. ఈ వ్యత్యాసం వలన కమ్యూనికేషన్‌లో సవాళ్లకు దారితీసింది మరియు భాష యొక్క ఎదుగుదలకు ఆటంకం కలిగించింది.

గిడుగు వెంకట రామమూర్తి ఈ విషయాన్ని గుర్తించి విద్యకు పునాదిగా మాట్లాడే తెలుగును ఉపయోగించాలని సూచించారు. లిఖిత తెలుగు భాషను మాతృభాషలు మాట్లాడే భాషతో అనుసంధానం చేస్తూ సంస్కరించడానికి మరియు ప్రామాణీకరించడానికి అతను ఒక ముఖ్యమైన అడుగు వేశారు. ఈ చొరవ పాఠశాలలు మరియు విద్యాసంస్థల్లో మాట్లాడే తెలుగు బోధన, రాయడం మరియు మూల్యాంకన మాధ్యమంగా మారడానికి దారితీసింది, దీని వలన భాష ప్రజలకు మరింత అందుబాటులోకి మారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాడ్డాక అధికారిక భాష చట్టం 1966  ప్రకారం తెలుగు భాషను రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి ఆంధ్రరాష్ట్రం తో పాటు కేంద్ర పాలిత ప్రాంతం గా ఉన్న యానాం లోను తెలుగును అధికారిక భాషగా గుర్తించారు.

గిడుగు వెంకట రామమూర్తి గురించి

1863 ఆగస్టు 29న శ్రీకాకుళం పర్వతాలపేట పట్టణంలో రామమూర్తి జన్మించారు. దాదాపు 12 ఏళ్ల వయసులో ఆయన తండ్రి మరణించారు. కష్టాలు ఉన్నప్పటికీ తన పాఠశాల విద్యను ముగించి. పాఠశాలలో భోదించెడప్పుడు సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పడం ప్రారంభించారు. చదువు పూర్తి అయ్యాక 1880లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయ వృత్తిని చేపటట్టి ఇంటి బరువు బాధ్యతలు తీసుకున్నారు. 1880 నుంది 1911 దాకా పర్లాకిమిడి సంస్థానంలో  వివిధ పదవులు చేసి విధ్యార్ధుల చదువుకు ఎంతగానో సహాయం చేశారు. పదవి విరమణ తర్వాత దేశయాటన చేసి తెలుగు భాషకు ఎంతో కృషి చేశారు. 1919-20లో ‘తెలుగు’ అనే మాసపత్రిక నడిపారు. ఎన్నో పుస్తకాలు రచనలు చేసి అతిపెద్ద ఆధునిక తెలుగు భాషావేత్తలలో ఒకరిగా మారారు. రామమూర్తి గారు 1940 జనవరి 22 న మరణించారు.

ప్రశంసలు, పురస్కారాలు

  • 1934 లో ప్రభుత్వం అతనికి ‘కైజర్-ఇ-హింద్ అవార్డు ని బాహుకరించింది
  • 1913 లో ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదు ఇచ్చింది.
  • 1938 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణని ప్రధానం చేసింది.

గిడుగు వెంకట రామమూర్తి రచనలు

  • 1931లో  సవర-ఇంగ్లీషు కోశం
  • 1912 లో A Memorandum of Modern Teluguని రచించి ప్రభుత్వానికి పంపించారు
  • సవరల పై దాదాపుగా 30 పాటలు రచించారు

తెలుగు బాష గురించి

తెలుగు ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో వాడుక బాష గా ఉపయోగిస్తారు. ఈ రెండు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలో చాలా రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పుదుచ్చేరి మరియు అండమాన్ మరియు నికోబార్ దీవుల కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా తెలుగు మాట్లాడె వాళ్ళు నివసిస్తున్నారు. అశోకుని కాలం లో కూడా తెలుగు లిపి ప్రస్తావన ఉంది.  తెలుగు బాష ప్రపంచం లోనే అత్యాదికం గా వాడే భాషలలొ 14వ ది. ప్రపంచ వ్యాప్తంగా 81 మిలియన్ల మంది తెలుగుని మాట్లాడుతున్నారు.

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29 న జరుపుకుంటారు