APPSC గ్రూప్ 2 మెయిన్స్ కి దాదాపు 80 రోజుల సమయం ఉంది ఇప్పటికే అభ్యర్ధులు వారి ప్రిపరేషన్ ప్రణాళిక తో ముందుకి సాగుతూ ఉంటారు APPSC గ్రూప్ 2 స్టడీ మెటీరీయల్ లో భాగంగా తెలుగు భాషా సాహిత్యం మరియు అభివృద్ది గురించి ఈ కధనంలో తెలుసుకోండి.
Adda247 APP
తెలుగు భాషా సాహిత్యం చరిత్ర
తెలుగు భాషా సాహిత్యాన్ని రెండు భాగాలుగా అభివర్ణించవచ్చు అవి నన్నయ పూర్వ యుగం మరియు నన్నయ తర్వాత యుగం . తెలుగు భాష నన్నయ తో ప్రాచుర్యం పొందింది మరియు నన్నయ్య తర్వాతి కవులు కూడా ఎంతో కృషి చేశారు. నన్నయ ని తెలుగు సాహిత్యానికి ఆది కవి అని పిలుస్తారు. ఆధునిక కాలంలో బయటపడిన శాసనాల ఆధారంగా తెలుగు భాష క్రీ.శ 1వ శతాబ్దానికి పూర్వమే వాడుకలో ఉన్నది. క్రీ.శ 1 వ శతాబ్దానికి చెందిన శాతవాహనరాజు హాలుడు కి చెందిన గాథాసప్తశతి శాసనం ఆధారంగా తెలుస్తుంది. మరియు ఆ తర్వాత క్రీ.శ 6వ శతాబ్దం, క్రీ.శ 9 శతాబ్దంకి చెందిన పద్య శాసనాలు లభించాయి. నన్నయ పూర్వ యుగాన్ని 3 విభాగాలుగా విభజించవచ్చు అవి:
1. క్రీ.శ 575 కు పూర్వ యుగం
2. క్రీ. శ575- క్రీ. శ848
3. క్రీ.శ 848- క్రీ. శ1050
1. క్రీ.శ 575 కు పూర్వ యుగం
- తెలుగు లో మొట్టమొదటి పదం నాగబు ఇది అమరావతి స్తూపం పై కనిపిస్తుంది.
- హాలుడి గధాసప్తశతిలో కనిపించిన తెలుగు పదాలు: అందం, పిల్ల, అద్దం, పొట్ట, పిల్ల, అవ్వొ మొదలైనవి ఉన్నవి
- ఇక్ష్వాకుల కాలం లో కూడా తెలుగు పదాలు కనిపించాయి అవి: బాపి, అడవి, ఎహువల
- శాసనాల లో గ్రామాల పేర్లు, వ్యక్తి పేర్లు తెలుగులో కనిపించాయి.
- విష్ణుకుండినుల ఈవూరు శాసనంలో కూడా తెలుగు పదాలు కనిపించాయి
2. క్రీ. శ575- క్రీ. శ848
- ఈ కాలంలో తెలుగులో వ్యాఖ్యాలు లభించాయి
- తెలుగులో రేనాటి చోళులు కడప లో వేయించిన 33 శాసనాలు లభించాయి.
- తెలుగులో వీరు వేయించిన ధనుంజయుని కలమళ్ళ శాసనం మొట్ట మొదటి శాసనం మరియు పుణ్యకుమారుని ఎర్రగుడిపాడు రెండవ శాసనం
3. క్రీ.శ 848- క్రీ. శ1050
- ఈ కాలం లో పధ్య గద్యాలు కనిపించాయి
- తెలుగులో తూర్పు చాళుక్యులు వేయించిన అద్దంకి శాసనం మొట్ట మొదటి పద్య రచన
- క్రీ.శ 848లో కుందుకురు శాసనంలో సీస పద్యంగురించి తెలిపారు మారియూ క్రీ.శ. 897లో ధర్మవరం శాసనంలో కూడా సీస పధ్యం గురించి ఆనవాలు ఉన్నవి.
నన్నయ
తెలుగు కవులలో నన్నయ ప్రముఖుడు. ఇతను తెలుగులో మొట్ట మొదటి కావ్యాన్ని రచించాడు. నన్నయ రాజ్ రాజా నరేంద్రుని ఆస్థానంలో ఆస్థాన కవి
- నన్నయ బిరుదులు: శబ్దశాసనుడు, ఆది కవి, వాగను శాసణుడు, విపుల శబ్దశాసనుడు
- నన్నయ రచనలు: మహాభారతం, రముండికా విలాసం, శకుంతలోపాఖ్యానం, ఆంధ్రశబ్ద చింతామని
ఇతర కవులు:
- పావులూరి మల్లన
- మహావీరా చారి
- మల్లియ రెచ్చన్
- మల్లికార్జున
- శ్రీ పతి
- పాల్కురి సవ్వమనాధుడు
తిక్కనయుగం:
నెల్లూరుని పాలించే మనుమసిద్ది ఆస్థానంలో తిక్కన మంత్రిగా ఉండేవారు.
- రచనలు: నిర్వచనోత్తర రామాయణం, కృష్ణ శతకం, విజయ సేనాం, ఆంధ్ర మహాభారతం
- బిరుదులు: కవి బ్రహ్మ, మహా కవి, సోమయాజి, కవిమిత్ర, ఉభయ కవి మిత్రుడు
ఎర్రన
నన్నయ 14వ శతాబ్దానికి చెందిన కవి. ఇతను బుక్కరాయల ఆస్థానకవి. నన్నయ తర్వాత అరణ్య పర్వం ని రచించి మహాభారతాన్ని పూర్తి చేశారు. నన్నయ తిక్కన మరియు ఎర్రన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి కవిత్రయం అనే బిరుడదుని పొందారు,
- రచనలు: హరివంశం, నృసింహ పురాణం, అంకితం, ప్రబంధ కావ్యాలు రచించిన తొలి కవి
- బిరుదులు: శంభు దాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు
శ్రీనాధుడు
శ్రీనాథుడు 15 వ శతాబ్దికి చెందిన తెలుగు కవి. ఇతను వేమారెడ్డి ఆస్థానంలో పనిచేసేవారు.
రచనలు: శ్రీ మారుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్త శతి, పండితారాధ్య చరిత్ర, శృంగారనైషదం, హరవిలాసం, భీమేశ్వర పురాణం, కాశీఖండం, పల్నాటి వీరచరిత్ర
తెలుగులో శ్రీనాధుడికి సాటి కవులు ఎవరు లేరు. క్రీ. శ 14వ శతాబ్దంలో పాలించిన రాజులందరూ ఇతన్ని సత్కరించారు.
ఆధునిక సాహిత్యం
ఆంధ్రదేశం లేదా ఆంధ్ర, రాయలసీమ, తూర్పుతీర ప్రాంతం బ్రిటీషు ప్రభుత్వ ఆధీనంలో కి వచ్చిన క్రీ.శ1766- 1802 వరకూ ఉన్న కాలాన్ని ఆధునిక సాహిత్య కాలం అంటారు. ఈ కాలంలోనే తెలుగులో నిఘంటువు పరిచయం అయ్యింది మరియు కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, శ్రీశ్రీ, గిడుగు రామమూర్తిరంగనాయకమ్మ, దేవులపల్లి వంటి వారెందరో తెలుగు సాహితయానికి వారి వంతు కృషి చేశారు.
కందుకూరి వీరేశలింగం:
ఆధునిక ఆంద్రదేశంలో సాంఘిక సంఘసంస్కర్తగా పేరు గడించారు మరియు జాతీయోధ్యమంలో పాలుపంచుకుని కవితలను రచించిన మొదటి కవి.
- రచనలు: రాజశేఖర చరితం, సతీహితబోధిని మరియు హాస్యవర్ధిని (ఈ రెండు పత్రికలు)
- బిరుదులు: ఆంధ్రస్కాట్
శ్రీశ్రీ
శ్రీ శ్రీ పూర్తి పేరు శ్రీ రంగం శ్రీనివాసరావు, ఈయన 1934 దనుంచి 1931 వరకూ చేసిన రచన సంకలనాన్ని మహాప్రస్థానంగా ప్రచురించారు.
గిడుగు వెంకట రామ మూర్తి
సవర భాషకి వ్యకరణం రచించారు, సవర భాషా వాగనుశాసణుడిగా ఇతన్ని పేర్కొంటారు. చిచ్చరపిడుగు గిడుగుగా ప్రసిద్ది చెందారు.
ముప్పాళ్ల రంగనాయకమ్మ
ఈమె స్త్రీవాద దృక్పధంతో రచించిన మొదటి నవల జానకి విముక్తి
రచనలు: జానకి విముక్తి, రామాయణ విష వృక్షం, బలిపీఠం, పెక మేడలు
ముఖ్య సమాచారం:
ప్రాముఖ్యం | రచయిత | రచన |
తెలుగులో తొలి నవల | గోపాలకృష్ణమ | శ్రీ రంగ రాయ చరిత్ర |
తొలి సమగ్ర నవల | కందుకూరి వీరేశలింగం | రాజశేఖర చరిత్రం |
తొలి హాస్య నవల | చిలకమర్తి లక్ష్మీ నరసింహం | గణపతి |
తొలి మనోవైజ్ఞానిక నవల | గోపీచంద్ | అసమర్ధుని జీవ యాత్ర |
తొలి నాటకం | వాసుదేవ శాస్త్రి | మంజరి మధుకరియం (షేక్స్పీయర్ రచించిన జూలియస్ సీజర్ తెలుగు అనువాదం ) |
సమగ్ర సాంఘిక నాటకం | గురజాడ అప్పారావు | కన్యాశుల్కం |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |