Telugu govt jobs   »   Daily Quizzes   »   Telugu Practice Questions and Answers ,14...
Top Performing

Telugu Practice Questions and Answers ,15 March 2022 ,for APPSC Group-4

Telugu Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.

Telugu Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telugu Practice Questions and AnswersAPPSC/TSPSC Sure shot Selection Group

 

Telugu Practice Questions for APPSC Group-4

Telugu Practice Questions  -ప్రశ్నలు

Q1. ఈ క్రింది  ఇచ్చిన వాటిలో ‘ఇంకొకరు’ అనే పదం ఏ సంధి  అవుతుందో గుర్తించండి?

(a) ఇకార సంధి

(b) ఉకార సంధి 

(c) అకార సంధి

(d) త్రిక సంధి

 

Q2. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ‘భరతావని ‘ అనే  పదం ఏ సంధి అవుతుందో గుర్తించండి?

(a) వృద్ధి సంధి

(b) సవర్ణ దీర్ఘ సంధి

(c) యణాదేశ సంధి

(d) గుణ సంధి

 

Q3.ఇచ్చిన పదం ‘తన్మయము’విడదీయగా ఏది సరి అయిన శబ్ద పది  అవుతుందో గుర్తించండి?

(a) తన్ + మయము 

(b) తను + మయము

(c) తత్ + మయము

(d)పైవన్నీ

 

 Q4.ఇచ్చిన పదం ‘పయోనిధి’ విడదీయగా ఏది సరి అయిన శబ్ద పది అవుతుందో గుర్తించండి?

(a) పయ: + నిధి

(b)పయో + నిధి

(c) పయ్య + నిధి

(d) ప: + యోనిధి

 

 Q5. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ‘ సింగపుకొదము’ అనే పదం ఏ సంధి అవుతుందో గుర్తించండి?

(a) రుగాగమ సంధి

(b) గసడదవాదేశ సంధి 

(c) ఆమ్రేడిత సంధి 

(d) పుంప్వాదేశ సంధి 

 

 Q6. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ‘శరచ్చంద్రికలు’ అనే పదం ఏ సంధి అవుతుందో గుర్తించండి?

(a) శ్చుత్వ సంధి  

(b) జస్త్వ సంధి

(c) అనునాసిక సంధి

(d) విసర్గ సంధి

 

Q7. ఇచ్చిన పదం ‘వారోత్సవాలు’ విడదీయగా ఏది సరి అయిన శబ్ద పది  అవుతుందో గుర్తించండి?

(a) వారము + ఉత్సవాలు

(b) వారపు + ఉత్సవాలు

(c) వార + ఉత్సవాలు

(d)వారము + ఓత్సవాలు

 

Q8. ఇచ్చిన పదం ‘ చేయునతడు’ విడదీయగా ఏది సరి అయిన శబ్దపది అవుతుందో గుర్తించండి?

(a) చేయును + అతడు 

(b) చేయున్+అతడు

(c) చేయునందు + అతడు

(d) చేయు + అతడు

 

Q9. ఈ క్రింది ఇచ్చిన వాటిలో సంస్కృత సంధిని గుర్తించండి?

(a) సవర్ణ దీర్ఘ సంధి 

(b) రుగాగమ సంధి

(c) పుంప్వాదేశ సంధి  

(d) ప్రాతాది సంధి

 

Q10. ఈ క్రింది ఇచ్చిన వాటిలో తెలుగు సంధి ఏది అవుతుందో గుర్తించండి?

(a)గుణ సంధి

(b)వృద్ధి సంధి

(c)ఇకార సంధి

(d) యణాదేశ సంధి

జవాబులు

తెలుగు సంధులు : తెలుగు పదముల మధ్య జరుగు సంధులను తెలుగు సంధులు అంటారు .

ఉదా : అకార , ఇకార , త్రిక మొదలైన సంధులు .

సంస్కృత సంధులు : సంస్కృత పదముల మధ్య జరుగు సంధులను సంస్కృత సంధులు అంటారు .

ఉదా : సవర్ణ , గుణ , వృద్ది మొదలైన సంధులు .

 

Q1.Ans (c) 

అకార సంధి : తెలుగు సంధి

అకార సంధి: అత్తునకు  అచ్చు పరమైనపుడు సంధి బహుళము.

 ఉదా: ఇంకొకరు = ఇంక + ఒకరు.

 

Q2: Ans (b)

సవర్ణదీర్ఘ సంధి : సంస్కృత సంధి

సవర్ణదీర్ఘ సంధి :అ, , , ఋలకు అవియే అచ్చులు (సవర్ణములైన) పరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదేశం అగును.

ఉదా: భరతావని = భరత + అవని (అ+అ = ఆ)

 

Q3 Ans (C)

అనునాసిక సంధి: సంస్కృత సంధి.

అనునాసిక సంధి: పూర్వ పదాంతంలో ఉంది. పరమైంది.

 * ‘కారం దాని అనునాసికమైన ‘ (తథదధన) గా మురింది. 

 * వర్గ ప్రథమాక్షరాలకు (క, , , , ప లకు) గాని, ‘గాని పరమైనపుడు అదే వర్గ అనునాసికాలు ఆదేశమవుతాయి దీన్నే అనునాసిక సంధి అంటారు. 

 ఉదా : తన్మయము = తత్ + మయము

 

Q4. Ans (a)

విసర్గ సంధి : తెలుగు సంధి

విసర్గ సంధి: అకారాంత పదాల విసర్గకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు (క, , , , , , , , , ఫ), ,, స లు గాక మిగతా అక్షరాలు పరమైనపుడు విసర్గ లోపించి కారం కారంగా మారుతుంది.

2) విసర్గకు శ ,,స లు పరమైనపుడు శ , , సలు ద్విత్వాలుగా మారతాయి. 

3) విసర్గ మీద క , , ,, లు వస్తే మార్పురాదు (సంధి ఏర్పడదు)

4) అంత:, దుః, చతు:, ఆశీః, పునః మొదలైన పదాల విసర్గ రేఫ (ర్) గా మారుతుంది.

5) ఇస్, ఉస్ ల విసర్గకు క , , , ఫ లు పరమైతే విసర్గకారంగా మారుతుంది.

6) విసర్గకు, , ఛ లు పరమైతే కారం , , ఠ లు పరమైతే కారం; , థ లు పరమైతే కారం వస్తాయి.

ఉదా : పయోనిధి = పయ: + నిధి

 

Q5 Ans (d)

పుంప్వాదేశ సంధి : తెలుగు సంధి

పుంప్వాదేశ సంధి : మొదటిపదాల చివరన మువర్ణం లోపించింది. ము వర్ణం స్థానాన్ని పు వర్ణం ఆక్రమించింది.

* ప్రతి సంధిలోనూ మొదటిపదం గుణాలను తెలుపుతుంది. ఇవి విశేషణాలు. 

* మొదటిపదం విశేషణం అయితే ఆ సమాసాలను విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంఅంటారు అంటే ఈ సంధి కర్మధారయ సమాసాల్లోఏర్పడుతుంది. * కర్మధారయ సమాసాల్లో మువర్ణానికి బదులు పు, 

oపులు ఆదేశంగావస్తే దాన్ని పుంప్వాదేశసంధిఅంటారు. (మువర్ణం స్థానాన్ని పు పుంపువర్ణం ఆక్రమిస్తుంది. దీన్నే వ్యాకరణ పరిభాషలో ఆదేశంఅంటారు.)

 ఉదా : సింగపుకొదము = సింగము + కొదము

 

 Q6 Ans (a)

శ్చుత్వ సంధి : సంస్కృత సంధి. 

శ్చుత్వ సంధి:  సకార వర్గం                    శకార వర్గం

 

                          స                                       శ

                          త                                      చ

                          థ                                     ఛ

                          ద                                     జ 

                          ధ                                    ఝ 

                         న                                     ఞ 

 

వర్గాలు పూర్వ పదాంతంగా ఉండి. కార ‘ (చ ఛ జ ఝ ఞ) లు పరమైనాయి. అలా అయినప్పుడు మళ్ళీ కార వర్గాలే వస్తాయి. 

  ఉదా  :   శరచ్చంద్రికలు   = శరత్ + చంద్రికలు 

  త్ + చ = చ్చ

 

Q7 Ans (C)

గుణ సంధి : సంస్కృత సంధి

గుణ సంధి: అకారానికి “ఇ, , ఋ” లు పరమైనప్పుడు క్రమముగా , , అర్లు ఏకాదేశం అగును.

గుణములు అనగా “ఏ, , అర్”లు

ఉదా: వారోత్సవాలు = వార + ఉత్సవాలు

 

Q8 Ans (d)

నుగాగమ సంధి: తెలుగు సంధి 

నుగాగమ సంధి సూత్రం : ఉదంత తద్ధర్మార్ధ విశేషణానికి అచ్చుపరమైతే నుగాగమం వస్తుంది.

*చేయు, వచ్చు క్రియలకు చివర ఉత్తుఉంటుంది. వీటికి అచ్చు కలిసింది. (తడు, ‘అప్పుడు, అప్పుడు రెండు పదాల్లోనూ లేని న్అనే హల్లు కొత్తగా వచ్చి చేరి చేయు అతడు అనేది చేయు నతడు  గానూ మారిపోయింది. ఈ సందర్భాల్లో న్కొత్తగా వచ్చి చేరింది. న్ఆగమం కాబట్టి ఇట్లా ఏర్పడటాన్ని నుగాగమ సంధిఅంటారు

*ఉదా: చేయునతడు = చేయు + అతడు

 

Q9.Ans (a)

సవర్ణ దీర్ఘ సంధి: అ, , , ఋ లకు అవియే అచ్చులు (సవర్ణములైన) పరమైనపుడు ఏకాదేశం అవుతుంది. 

ఉదా: భానూదయము = భాను + ఉదయము.(ఉ + ఉ (ఊ = నూ)

 

Q10.Ans (c) 

ఇకార సంధి: తెలుగు సంధి

ఇకార సంధి: ఇత్తునకు అచ్చు పరమగునపుడు సంధి వైకల్పికం (లేదా) ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం

ఏమ్యాదులు = ఏమి , మరి , అవి , అది 

ఉదా : మరేమి = మరి + ఏమి (ఇ+ ఏ= రే)

 

Telugu Practice Questions and Answers

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Telugu Practice Questions and Answers

 

Sharing is caring!

Telugu Practice Questions and Answers ,15 March 2022 ,for APPSC Group-4_6.1