Telugu Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.
Telugu Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telugu Practice Questions for APPSC Group-4
Telugu Practice Questions -ప్రశ్నలు
Q1.ఈ క్రింది వాటిలో ‘కందుకూరి రచనలు చేశాడు’. అనే వాక్యం వాక్యం అవుతుందో గుర్తించండి?
(a) సంయుక్త వాక్యం
(b) సామాన్య వాక్యం
(c)సంశ్లిష్ట వాక్యం
(d)కర్మణి వాక్యం
Q2.ఈ క్రింది ఇచ్చినవాటిలో ‘ దివ్య సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నది’ అనే వాక్యం ఏ వాక్యం అవుతుందో గుర్తించండి?
(a) సంయుక్త వాక్యం
(b) సామాన్య వాక్యం
(c) సంశ్లిష్ట వాక్యం
(d) పైవన్నీ
Q3. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ‘ సుమ పోటీలకు వెళ్లి, మంచి అలవాట్లు గురించి ప్రసంగించింది’ ఈ వాక్యం ఏ వాక్య రకానికి చెందునో గుర్తించండి?
(a) సంయుక్త వాక్యం
(b) సామాన్య వాక్యం
(c) సంశ్లిష్ట వాక్యం
(d) పైవి ఏవి కావు
Q4. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ‘సంయుక్త వాక్యాన్ని మరల ఎన్ని విధాలుగా విభజించవచ్చునో గుర్తించండి?
(a) రెండు రకాలు
(b)మూడు రకాలు.
(c) నాలుగు రకాలు
(d)ఆరు రకాలు
Q5.గౌరి సంగీతం నేర్చుకున్నది.
గౌరి బాగా పాడింది.
గౌరి అందరి మన్ననలు పొందింది.
పైన ఇచ్చిన వాక్యాలతో సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి?
(a) గౌతమి సంగీతం నేర్చుకుని పాడి, అందరి పొగడ్తలు అందుకున్నది.
(b) గౌతమి సంగీతం నేర్చి, పాడి, అందరి మన్నలను పొందాలనుకుంది.
(c) గౌతమి సంగీతం నేర్చుకుని, అందరి మన్ననలు పొందింది.
(d) పైవి ఏవీ కాదు.
Q6.ఈ క్రింది ఇచ్చిన వాటిలో నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంధికభాషలో రాసేవాడిని .నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంధిక భాషలోరాసేవాడిని.ఈ వాక్యాలు కలిగి ఉన్న సంయుక్త వాక్యంను గుర్తించండి?
(a) నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంధికంతో, వ్యాసాలు గ్రాంధిక భాషలని రాసే వాడిని
(b) నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని.
(C) a మాత్రమే సరియైన సమాధానం.
(d) పై వాటిలో సరియైన సమాధానం లేదు.
Q7. ఈ క్రింది ఇచ్చిన వాటిలో వైద్యుడు ప్రధమ చికిత్స చేస్తాడు. వైద్యుడు మందులు ఇస్తాడు అనే వాక్యల ను ఉపయోగించి రాసిన సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి?
(a) వైద్యుడు చికిత్స చేసి, మందులు ఇవ్వాలి.
(b) వైద్యుడు చికిత్స, చేసి, మందులు ఇచ్చి పంపించాలి.
(c) వైద్యుడు ప్రధమ చికిత్స చేసి, మందులు ఇస్తాడు.
(d) a మరియు b సరియైన సమాధానం
Q8. ఈ క్రింది ఇచ్చిన వాటిలో సామాన్య వాక్యాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చునే గుర్తించండి?
(a) రెండు రకాలు
(b) మూడు రకాలు
(c) నాలుగు రకాలు
(d) ఆరు రకాలు
Q9.ఈ క్రింది ఇచ్చిన వాటిలో సామాన్య వాక్యం ను గుర్తించండి?
(a) రాజు, ఆనంద్ ఆటకు వెళ్ళారు.
(b)రవి బాగా చదివి , నిద్రపోయాడు..
(c) రమణ ఊరికి వెళ్ళాడు.
(d) a మరియు b సరియైన సమాధానం
Q10. ఈ క్రింది ఇచ్చిన వాటిలో శ్రీదేవి బాగా చదివింది. శ్రీదేవీ ఎక్కువ మార్కులు తెచ్చుకుంది అనే ఈ వాక్యం ఏ రకమైన వాక్యానికి చెందునోగుర్తించండి?
(a) సంయుక్త వాక్యం
(b) సామాన్య వాక్యం
(c) సంశ్లిష్ట వాక్యం
(d) రెండు సామాన్య వాక్యాలు
జవాబులు
Q1.Ans (b)
సామాన్య వాక్యము: ఒకే ఒక విషయాన్ని తెలియజేసే వాక్యాన్ని ‘సామాన్య వాక్యం’ అంటారు.
* ఒక సమాపక క్రియతో సంపూర్ణ అర్థమును ఇచ్చు వాక్యం ను సామాన్య వాక్యం అంటారు.
*ప్రతీ వాక్యంలో ఒకే ఒక సమాపక క్రియ ఉంటుంది. అలా ఒక సమాపక క్రియ ఉండే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు.
*ఉదా: కందుకూరి రచనలు చేశాడు.
Q2.Ans (a)
సంయుక్త వాక్యం: సమాన ప్రాధాన్యము గల రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యం గా ఏర్పడితే దానిని సంయుక్త వాక్యం అంటారు.
* రెండు సమానమైన ప్రతిపత్తి / స్థాయి కలిగిన వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది.
* రెండు నామ పదాలలో ఒకటి లోపించడం
* రెండు నామ పదాలు ఒకే చోట చేరితే చివర బహువచనం వస్తుంది.
Q3.Ans (C)
* సంశ్లిష్ట వాక్యం : రెండు సామాన్య వాక్యాలను ఒక వాక్యంగా కలిపి రాస్తే దానిని సంశ్లిష్ట వాక్యం అంటారు. * అనేక అసమాపక క్రియలతో కూడి ఉన్న ఒక సమామకక్రియ గల వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు.
*ఒకటి లేక అంతకంటే ఎక్కువగానీ అసమాపక క్రియలు కలిగి ఉండి, ఒక సమాపక క్రియతో వాక్యం ముగిస్తే దానిని ” సంక్లిష్టవాక్యం” అంటారు.
ఉదా:సుమ పోటీలకు వెళ్లి, మంచి అలవాట్లు గురించి ప్రసంగించింది.
Q4.Ans (b)
సంయుక్త వాక్యము: సమాన ప్రాధాన్యము గల రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యం గా ఏర్పడితే దానిని సంయుక్త వాక్యం అంటారు.
*సంయుక్త వాక్యమును మరల మూడు విధాలుగా విభజించవచ్చు.
అవి :1) సంకలన సంబంధ వాక్యం.
2) వికల్ప సంబంధ వాక్యం
3) వైరుధ్య / విరుద్ధ సంబంధ వాక్యం.
Q5. Ans (d)
సంశ్లిష్ట వాక్యం : రెండు సామాన్య వాక్యాలను ఒక వాక్యంగా కలిపి రాస్తే దానిని సంశ్లిష్ట వాక్యం అంటారు. * అనేక అసమాపక క్రియలతో కూడి ఉన్న ఒక సమామకక్రియ గల వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు.
*ఒకటి లేక అంతకంటే ఎక్కువగానీ అసమాపక క్రియలు కలిగి ఉండి, ఒక సమాపక క్రియతో వాక్యం ముగిస్తే దానిని ” సంక్లిష్టవాక్యం” అంటారు.
ఉదా :గౌతమి సంగీతం నేర్చుకుని, బాగాపాడి, అందరి మన్ననలు పొందింది.
Q6 Ans (b)
సంయుక్త వాక్యం:సంయుక్త వాక్యం: సమాన ప్రాధాన్యము గల రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యం గా ఏర్పడితే దానిని సంయుక్త వాక్యం అంటారు.
* రెండు సమానమైన ప్రతిపత్తి / స్థాయి కలిగిన వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది.
* రెండు నామ పదాలలో ఒకటి లోపించడం
* రెండు నామ పదాలు ఒకే చోట చేరితే చివర బహువచనం వస్తుంది.
ఉదా :నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని.
Q7. Ans (c)
సంశ్లిష్ట వాక్యం : రెండు సామాన్య వాక్యాలను ఒక వాక్యంగా కలిపి రాస్తే దానిని సంశ్లిష్ట వాక్యం అంటారు. * అనేక అసమాపక క్రియలతో కూడి ఉన్న ఒక సమామకక్రియ గల వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు.
*ఒకటి లేక అంతకంటే ఎక్కువగానీ అసమాపక క్రియలు కలిగి ఉండి, ఒక సమాపక క్రియతో వాక్యం ముగిస్తే దానిని ” సంక్లిష్టవాక్యం” అంటారు.
ఉదా :వైద్యుడు ప్రధమ చికిత్స చేసి, మందులు ఇస్తాడు.
Q8.Ans ( a)
సామాన్య వాక్యాలను రెండు రకాలు గా విభజించవచ్చు.
అవి:1) క్రియా సహిత వాక్యం
2)క్రియా రహిత వాక్యం
Q9.Ans (c)
సామాన్య వాక్యము: ఒకే ఒక విషయాన్ని తెలియజేసే వాక్యాన్ని ‘సామాన్య వాక్యం’ అంటారు.
* ఒక సమాపక క్రియతో సంపూర్ణ అర్థమును ఇచ్చు వాక్యం ను సామాన్య వాక్యం అంటారు.
*ప్రతీ వాక్యంలో ఒకే ఒక సమాపక క్రియ ఉంటుంది. అలా ఒక సమాపక క్రియ ఉండే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు.
*ఉదా: రమణ ఊరికి వెళ్ళాడు.
Q10.Ans (d)
సామాన్య వాక్యము: ఒకే ఒక విషయాన్ని తెలియజేసే వాక్యాన్ని ‘సామాన్య వాక్యం’ అంటారు.
* ఒక సమాపక క్రియతో సంపూర్ణ అర్థమును ఇచ్చు వాక్యం ను సామాన్య వాక్యం అంటారు.
*ప్రతీ వాక్యంలో ఒకే ఒక సమాపక క్రియ ఉంటుంది. అలా ఒక సమాపక క్రియ ఉండే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు.
*ఉదా:శ్రీదేవి బాగా చదివింది. శ్రీదేవీ ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. రెండు సామాన్య వాక్యాలు ను ఒకే చోట ఇవ్వడం జరిగింది
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************