Telugu govt jobs   »   Daily Quizzes   »   Telugu Practice Questions and Answers 30...
Top Performing

Telugu Practice Questions and Answers ,30 March 2022 ,for APPSC Group-4

Telugu Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.

Telugu Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telugu Practice Questions and Answers ,30 March 2022 ,for APPSC Group-4APPSC/TSPSC Sure shot Selection Group

 

Telugu Practice Questions for APPSC Group-4

Telugu Practice Questions  -ప్రశ్నలు

Q1.  ఈ క్రింది వాటిలో సౌదామిని’ పదానికి అర్థంను గుర్తించండి?

  1. సువాసన
  2. మెరుపు
  3. తీగ
  4. స్త్రీ

 

Q2. క్రింద ఇచ్చిన వాటిలో ‘ నిత్యము ‘ పదానికి వికృతి పదం కనుగొనండి?

         (a) నిచ్చలు

        (b) నిచ్చెము

        (c) నిత్తెము

        (d) (a) మరియు (c)

 

Q3. ఈ క్రింది వాటిలో ‘తమస్సు /తమం ‘ పదానికి పర్యాయ పదాలు గుర్తించండి?

(a) చీకటి, అంధకారం, ఇరులు 

(b) నడిరేయి, రాత్రి, నిసి, 

(c) రాత్రి, నిశిధి, రేయి

(d) రాజ్యం, తనివి, తీరం

 

Q4. సామాన్య వాక్యాలను ఎన్ని రకాలుగా వర్ఘీకరించవచ్చో కనుగొనండి?

(a) 1

(b) 2

(c) 3

(d) 4

 

Q5.  ఏదయినా జరగరాని, అనుకోని ప్రమాదానికి గురైన వారి రక్త సంబంధికులు పెట్టే శోకాన్ని గురించి వివరించే వాడే జాతీయంను గుర్తించండి?

(a) ప్రియ భాషలు

(b) పడి చచ్చి తేలుట

(c) గుండెలు పగులుట

  (d) మీనమేష వివాదాలు

 

Q6. ఇచ్చిన పదం ‘ జగన్నాధుడు’ (విడదీయగా) ఏది సరైన శబ్దపది అవుతుందో కనుగొనండి?

(a) జగత్ + నాధుడు

(b) జగన్ + నాధుడు

(c) జగన్నా + ఆధుడు

(d) జగత్+అనాధుడు

 

Q7. మహాప్రాకారం పదం యొక్క విగ్రహవాక్యంను గుర్తించండి ?

(a) గొప్పదైన ప్రాకారం

(b) గొప్పదనం వలన ప్రాకారం 

(C) ప్రాకారం చేత గొప్పది

(d) ఏదీ కాదు

 

Q8.” కాటుక గ్రుక్కినట్టి కరవటంబున జగదండ ఖండమమరె” 

ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారమును కనుగొనండి?

(a) ఉపమ అలంకారం

(b) ఉత్ప్రేక్ష అలంకారం 

(c) ఉల్లేఖ అలంకారం

(d) రూపక అలంకారం.

 

Q9. భూతకాలిక అసమాపక క్రియ ఈ క్రింది వాటిలో ఏ అసమాపక క్రియ అవుతుందో గుర్తించండి?

(a) క్త్వార్థకం

(b) వ్యతిరేక క్త్వార్థకం

(C) శత్రర్థకం

(d) చేదర్థకం

 

Q10. రాజకీయ పార్టీలవారు ” జనానికి తక్షణం కావాల్సింది కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర” అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు. ఈ వాక్యానికి పరోక్ష కధన వాక్యం కనుగొనండి?

(a) రాజకీయ పార్టీలు జనానికి తక్షణం కావాల్సింది తిండి, నిద్ర అని ఎన్నికల ప్రణాళికల్లో చెప్పారు.

(b) రాజకీయ పార్టీలు వారు జనానికి తక్షణం కావాల్సింది. కడుపునిండా తిండి, కంటి నిండా నిద్రయని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు.

(c) రాజకీయ పార్టీల వారు జనానికి తక్షణం కావాల్సింది తిండి, నిద్ర అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు.

(d) పైవన్నీ

 

Q11. ఈ క్రింది వాటిలో ‘అణా’ పదానికి అర్థం గుర్తించండి? 

(a) రూపాయిలో పదవ వంతు విలువ గల నాణెం. 

(b) రూపాయిలో పన్నెండవ వంతు విలువ గల నాణెం

(c) రూపాయిలో పద్నాలుగే వంతు విలువ గల నాణెం. 

(d) రూపాయిలో పదహారవ వంతు విలువ గల నాణెం.

 

Q12. ఈ క్రింది వాటిలో ‘బ్రాహ్మణులు’ పదానికి పర్యాయపదాలు కనుగొనండి?

(a) విప్రులు, పామరులు, పూజ్యులు

(b) ద్విజులు, విప్రులు, భూసురులు

(C) ఆర్యులు, ద్విజులు, పండితులు

(d) భూసురులు, అమరులు, గొప్పవారు.

 

Q13. క్రింద ఇచ్చిన వాటిలో ‘విజ్ఞానం’ పదానికి వికృతిని గుర్తించండి!

(a) విన్నాపము

(b) విన్నెనం

(c) విన్నాణం

(d) పైవన్నీ

 

Q14. (సీతను) చూసిరమ్మంటే (లంకను) కాల్చి వచ్చాడు అనేది ఈ క్రింది వాటిలో ఏమవుతుందో గుర్తించండి?

(a) సామెత

(b) జాతీయము

(C) సొంత వాక్యం

(d) పొడుపు కథ

 

Q15. శ్రీనాధుని చేత ఎన్నో కావ్యాలు రచింపబడ్డాయి ఈ వాక్యము ఏ రకమైన వాక్యమో గుర్తించండి?

(a) కర్తరి వాక్యం

(b) కర్మణి వాక్యం

(c) a ఒక్కటే సరియైన సమాధానం

(d) ఏదీ కాదు

 

Q16. ఈ క్రింది వాటిలో “వంటాముదము” పదం ఏ సంధి అవుతుందో కనుగొనండి

  1. ఇకార సంధి
  2.  ఉకార సంధి

     (C) అకార సంధి

    (d) (త్రిక సంధి

 

Q17 . ‘నలుదెసలు’ పదానికి సమాసంను గుర్తించండి?

(a) ద్వంద్వ సమాసం

(b) ద్విగు సమాసం

(c) బహుపద ద్వంద్వ సమాసం

(d) పైవన్నీ

 

Q18. చుక్కలు తల పూవులుగా 

నక్కజముగ మేను బెంచి యంబర వీదిన్

వెక్కసమై చూపట్టిన 

నక్కోమని ముదము నొందె నత్మస్థితిలోన్

 పై పద్యంలో గల అలంకారమును కనుగొనండి?

(a) అర్థాంతర న్యాస అలంకారం

(b) అతిశయోక్తి అలంకారం

(c) అనన్వయ అలంకారం

(d) శ్లేషా అలంకారం

 

Q19. ‘పనిచేయడం’ అనే పదానికి సరిపడు భాషాంశ పదజాలమును గుర్తించండి?

(a) చదువుట- సంపాందించుట-జీవితంలో స్థిర పడటం. 

(b) ఉద్యోగం- సంపాందించడం- జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్ళడం.

(c) సంపాదించడం – ఖర్చు పెట్టడం ఆనందంగా జీవించడం

(d) పైవేవీ కావు

Q20. య, వ, ర, లు కు గల ఇతర నామంను కనుగొనండి?

(a) యుక్కలు

(b) యణ్ణులు

(C) యణాలు

(d) పైవన్నీ

జవాబులు                                     

Q1. Ans (b)

సౌదామిని = మెరుపు

 

Q2. Ans (d)

నిత్యము – నిచ్చలు, నిత్తెము 

 

Q3. Ans (a)

తమస్సు /తమం – చీకటి, అంధకారం, ఇరులు

 

Q4. Ans (b)

సామాన్య వాక్యాన్ని రెండు (2) విధాలుగా వర్గీకరించారు.

  1. క్రియ సహిత వాక్యాలు
  2. క్రియా రహిత వాక్యాలు

 

Q5. Ans (C)

“గుండెలు పగులుట“  ఏదయినా జరగరాని, అనుకోని ప్రమాదానికి గురైన వారి రక్త సంబంధికులు పెట్టే శోకాన్ని గురించి వివరించే వాడే జాతీయం.

 

Q6. Ans (a)

అనునాసిక సంధి: క-చ-ట – త ప లకు న మలు పరమైతే క్రమంగా ఙ – – ణ – న – మలు ఆదేశమగును.

ఉదా:- జగన్నాధుడు = జగత్+నాధుడు (త్+ నా = న).

 

Q7. Ans (a)

విశేషణ పూర్వ పద కర్మధారయ సమాసం: విశేషణము పూర్వ పదముగాను, విశేష్యం ఉత్తర పదముగాను ఉన్న సమాసమును విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు.

ఉదా: మహా ప్రాకారం – గొప్పదైన ప్రాకారం.

 

Q8. Ans (b)

ఉపమానంలో ఉండే ధర్మాలు ఉపమేయంలో ఉండటం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం ఉత్ప్రేక్ష అలంకారం అనబడును.

ఉదా: కాటుక గుక్కినట్టి కరవటంబున జగదండఖండమమరే ఈ పాదం లోని అలంకారం ఉత్ప్రేక్ష అలంకారము.

ఉప మేయం -చీకటి , 

ఉపమనము – కాటుక భరిణె

ఇక్కడ చీకటి కాటుకలా ఉంది. చీకటి నిండిన భూగోళం కాటుక కూరిన భరిణెలా ఉంది అని భావం.

 

Q9. Ans (a)

క్త్వార్థకం: ఒక కర్తను ఆశ్రయించి ఉన్న పనులలో ముందు జరిగిన పనిని తెలియజేయు క్రియారూపము ‘ క్త్వార్థకం ‘ .

ఉదా: సీత పుస్తకమును చదివి నిద్రపోయెను. ఈ వాక్యము నందు ”సీత’ అను కర్త చదువుట, నిద్రపోవుట అను రెండు పనులను చేసినది. ఈ రెండు పనులలో పాఠమును చదువుట ముందుగా జరిగెను. ఈ పని సూచించు క్రియారూపమైన ‘చదివి’ అనునది ‘ క్త్వార్థకము .

 

Q10.Ans(b)

ప్రత్యక్ష కధనం:  రాజకీయ పార్టీలవారు ” జనానికి తక్షణం కావాల్సింది కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర” అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు.

పరోక్ష కధనం: రాజకీయ పార్టీలు వారు జనానికి తక్షణం కావాల్సింది. కడుపునిండా తిండి, కంటి నిండా నిద్రయని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు.

 

Q11. Ans (d)

అణా = రూపాయిలో పదహారవ వంతు విలువ గల నాణెం.

 

Q 12. Ans (b)

బ్రాహ్మణులు = ద్విజులు, విప్రులు, భూసురులు. 

 

Q 13. Ans (C)

విజ్ఞానం – విన్నాణం

 

Q14. Ans (a)

(సీతను) చూసిరమ్మంటే (లంకను) కాల్చి వచ్చాడు అనేది ఒక సామెత.

 

Q 15. Ans (b)

 కర్మణి వాక్యం :  శ్రీనాధుని చేత ఎన్నో కావ్యాలు రచింపబడ్డాయి.

 

Q16. Ans (C)

అకార సంధి: అత్తునకు (సంధి) అచ్చు పరమైనపుడు సంధి బహుళము.

ముదము = వంట + ఆముదము

  అ+ఆ (నిత్యం)

 

Q 17. Ans (b)

నలుదిశలు = నాలుగైన దిశలు

ద్విగు సమాసం: సంఖ్యా వాచక విశేషణము పూర్వ పదముగా ఉన్న కర్మధారయ  ద్విగు సమాసం అంటారు

 

Q 18. Ans (b)

వివరణ: ఆకాశంలోని నక్షత్రాలు తలలో ధరించిన పువ్వులవలె, కనబడేటట్లుగా ఆశ్చర్యం కలిగేటట్లు. హనుమంతుడు తన సంతాన – శరీరాన్ని పెంచి, ఆకాశవీధిలో గొప్పగా కనబడ్డాడు. సీత చూసి ఆనందాన్ని పొందింది. 

హనుమంతుడు ఆకాశాన్ని తాకేలా, ఆకాశంలోని నక్షత్రాలు ఆయన తలలోని పువ్వుల వలె కనబడ్డాయి అని అతిశయించి  చెప్పడం వల్ల అతిశయోక్తి అలంకారం.

 

Q 19. Ans (C)

పనిచేయడం = సంపాదించడం – ఖర్చు పెట్టడం- ఆనందంగా జీవించడం.

 

Q20. Ans (b)

య-వ-ర- లను యణ్ణులు అంటారు

 అంతస్థాలు అని పేరు.

 

Telugu Practice Questions and Answers ,30 March 2022 ,for APPSC Group-4

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Telugu Practice Questions and Answers ,30 March 2022 ,for APPSC Group-4

 

Sharing is caring!

Telugu Practice Questions and Answers ,30 March 2022 ,for APPSC Group-4_6.1