తెలంగాణ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖలో CDPO మరియు ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (EO) పోస్టుల భర్తీకి 03 జనవరి 2023 మరియు 08 జనవరి 2023న నిర్వహించిన పరీక్షలను రద్దుచేస్తున్నట్లు TGPSC తెలిపింది. గతంలో నిర్వహించిన ఈ రెండు నియామక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు 19 జూలై 2024 న ఆధికారిక ప్రకటన విడుదల చేసింది TGPSC. 2022 సెప్టెంబర్ లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖలో 23 TGPSC CDPO మరియు 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (EO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే.
CDPO మరియు ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్షలు రద్దు
03 జనవరి 2023 మరియు 08 జనవరి 2023న నిర్వహించిన తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖలోని CDPO, EO పరీక్షల పేపర్ లీక్ అయినట్లు తేలడంతో TGPSC ఆ పరీక్షలను రద్దు చేసింది. CDPO, EO పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే తెలియజేస్తామన్ని ఈ మేరకు TGPSC ఒక వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. అయితే గతంలో TGPSC CDPO ఫలితాలను విడుదల చేసి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసింది, కానీ ఇప్పటికీ అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వలేదు.
TGPSC CDPO మరియు ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్షలు రద్దు వెబ్‌నోట్
పోస్టింగుల సమయంలో పరీక్ష రద్దు ఎందుకు?
TGPSC CDPO రాతపరీక్ష ఫలితాలను విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన కూడా నిర్వహించిన TGPSC, ఇప్పటివరకు అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వలేదు. దీంతో TGPSC CDPO పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులు తమకు పోస్టింగులు ఇవ్వాలని కోర్డును ఆశ్రయించారు. అలాగే ఈ పరీక్ష విజయం సాధించని అభ్యర్థులు కూడా.. TGPSC గ్రూప్-1 పరీక్షలాగా.. TGPSC CDPOప్రశ్నపత్రం కూడా లీక్ అయిందని అభ్యర్థులు హైకోర్టు ఆశ్రయించారు. TGPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (EO) పరీక్షలో బయోమెట్రిక్ తీసుకోలేదని, కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. సిట్ అధికారుల నివేదిక ఆధారంగా పరీక్షలను రద్దుచేస్తున్నట్లు TGPSC ప్రకటించింది.
Adda247 APP
ప్రశ్నపత్రాలు లీక్ అయ్యినట్లు నిర్దారణ
గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించిన CDPO మరియు ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (EO) నియామక పరీక్షను రద్దు చేసింది. గతేడాది ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో… సిట్ అధికారులు జరిపిన విచారణలో మహిళాశిశు సంక్షేమ శాఖలో CDPO (Notification No.13/2022), ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (EO) (Notification No.11/2022) ప్రశ్నపత్రాలు లీకైనట్లు వెల్లడైంది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL), ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) నివేదిక ఆధారంగా 2023 జనవరి 3, 8 తేదీల్లో నిర్వహించిన పరీక్షలు రద్దు చేసినట్లు TGPSC కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TGPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |