Telugu govt jobs   »   Top 20 Questions on Telangana Culture

TGPSC Groups Quick Revision Series: Top 20 Questions on Telangana Culture

TGPSC Groups Quick Revision Seriesలో, మేము తెలంగాణ సంస్కృతిపై అతి ముఖ్యమైన టాప్ 20 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQS)ని మీకు అందిస్తున్నాము. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ టాపిక్ చాలా కీలకంగా ఉంటుంది.

ఈ రివిజన్ సిరీస్‌ను మీ సిద్ధతను బలోపేతం చేయడానికి మరియు మీ విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోండి, తద్వారా మీరు TGPSC పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

Top 20 Questions on Telangana Culture

Q1. తెలంగాణ రాష్ట్రం లో భౌగోళక గుర్తింపు పొందిన వస్తువు లను మరియు వాటికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను లేదా జిల్లా లను జతపర్చుము

                                       జాబితా – 1                                     జాబితా – 2

భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువు  పేరు               జిల్లా పేరు

  1. సిల్వర్ ఫిలిగ్రీ                            A) సిద్దిపేట
  2. చేర్యాల చిత్రకళలు                 B) కరీంనగర్
  3. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్            C) హైదరాబాద్
  4. హలీమ్                                     D) జనగామ

జాబితా – 1 ను  జాబితా – 2 తో జత పరిచి దిగువ ఇచ్చిన ఆప్షన్స్ లో సరైన దానిని ఎన్నుకొనుము.

(a) (a) 1 – A, 2 – B, 3 – C, 4 – D

(b) (b) 1 – B, 2 – A, 3 – D, 4 – C

(c) (c) 1 – C, 2 – D, 3 – A, 4 – B

(d) (d) 1 – D, 2 – C, 3 – B, 4 – A

Q2. తెలంగాణ రాష్ట్రం లో ప్రసిద్ధి గాంచిన నృత్యాలను మరియు వాటి కి సంబంధించిన అంశాలని జతపర్చుము

జాబితా – 1                            జాబితా – 2

  1. థెoసా నృత్యం                     A) కోయ తెగ
  2. పేరిణి శివ తాండవం          B) పీర్ల పండగ రోజున చేసేది
  3. మదిలి                                  C) పురుషులు మాత్రమే చేసేది
  4. రేల నృత్యం                        D) రాజ్ గోండులు

జాబితా – 1 ను  జాబితా – 2 తో జత పరిచి దిగువ ఇచ్చిన ఆప్షన్స్ లో సరైన దానిని ఎన్నుకొనుము.

(d) 1 – D, 2 – C, 3 – A, 4 – B

(c) 1 – C, 2 – D, 3 – B, 4 – A

(c) 1 – C, 2 – D, 3 – A, 4 – B

(d) 1 – D, 2 – C, 3 – B, 4 – A

Q3. తెలంగాణ రాష్ట్రం లో ని ముఖ్యమైన దేవాలయాల ను మరియు అవి ఉన్న జిల్లా ల ను జతపర్చుము.

జాబితా – 1                                  జాబితా – 2

        దేవాలయం పేరు                               జిల్లా  పేరు

  1. గౌతమేశ్వరాలయం                           A) నల్గొండ
  2. వాడపల్లి శివాలయం                        B) పెద్దపల్లి
  3. కొలనుపాక జైన దేవాలయం           C) జగిత్యాల
  4. ఆంజనేయస్వామి దేవాలయం      D) యాదాద్రి భువనగిరి

జాబితా – 1 ను  జాబితా – 2 తో జత పరిచి దిగువ ఇచ్చిన ఆప్షన్స్ లో సరైన దానిని ఎన్నుకొనుము.

(a) 1 – A, 2 – B, 3 – C, 4 – D

(b) 1 – B, 2 – A, 3 – D, 4 – C

(c) 1 – C, 2 – D, 3 – A, 4 – B

(d) 1 – D, 2 – C, 3 – B, 4 – A

Q4. తెలంగాణ రాష్ట్రం లోని కులాలు మరియు ఆశ్రిత కులాల ని జతపర్చుము.

జాబితా – 1                                జాబితా – 2

        కులం పేరు                               ఆశ్రిత కులం పేరు

  1. కమ్మ కులస్తులు            A) పిచ్చ కుంట్లవారు
  2. పెరుకలు                       B) వరుస భట్టుల వారు
  3. మాలలు                        C) ముష్టిగ వారు
  4. మాదిగలు                      D) డక్కలి వారు

జాబితా – 1 ను  జాబితా – 2 తో జత పరిచి దిగువ ఇచ్చిన ఆప్షన్స్ లో సరైన దానిని ఎన్నుకొనుము.

(a) 1 – A, 2 – B, 3 – C, 4 – D

(b) 1 – B, 2 – A, 3 – D, 4 – C

(c) 1 – C, 2 – D, 3 – A, 4 – B

(d) 1 – D, 2 – C, 3 – B, 4 – A

 

Q5. కింద ఇవ్వ బడిన తెలంగాణ రాష్ట్రం లో ని జైన స్మారక ప్రదేశాల ను మరియు అవి ఉన్న జిల్లా ల ను జతపర్చుము.

జాబితా – 1                                జాబితా – 2

        జైన స్మారక ప్రదేశం                      జిల్లా  పేరు

  1. ప్రగటూర్                 A) నాగర్ కర్నూల్
  2. చిలుకూర్               B) రంగారెడ్డి
  3. కుర్చారమ్              C) నిజామాబాద్
  4. చందా                      D) అదిలాబాద్

జాబితా – 1 ను  జాబితా – 2 తో జత పరిచి దిగువ ఇచ్చిన ఆప్షన్స్ లో సరైన దానిని ఎన్నుకొనుము.

(a) 1 – A, 2 – B, 3 – C, 4 – D

(b) 1 – B, 2 – A, 3 – D, 4 – C

(c) 1 – C, 2 – D, 3 – A, 4 – B

(d) 1 – D, 2 – C, 3 – B, 4 – A

Q6. తెలంగాణ లో ఉన్న కులాల్లో “ చిప్పి “ కులము యొక్క కుల వృత్తి ఏమిటి. ?

(a) నేత పని

(b) పశు పోషణ

(c) బట్టల కుట్టడం

(d) వాణిజ్యం

Q7. టేకు కలప మరియు ఆకులు కొయ్యడానికి ముందు గిరిజనులు ఏ పండగ ని జరుపుకుంటారు. ?

(a)రాజుల ముండా

(b) పెద్ద దేవుని పండగ

(c) డూండ్ పండగ

(d) పైవేవీ కావు

Q8. తెలంగాణ లో ని ప్రసిద్ధి చెందిన జాతర లను మరియు అవి ఉన్న జల్లాల తో జతపర్చుము

జాబితా – 1                            జాబితా – 2

           జాతర పేరు                              జిల్లా పేరు  

  1. కొరవి జాతర                                 A) నిజామాబాద్
  2. ఐనవోలు మల్లన్న జాతర           B) జోగుళాంబ గద్వాల
  3. సిద్దుల గుట్ట జాతర                     C) మహబూబాబాద్
  4. మల్దగల్ జాతర                           D) వరంగల్ అర్బన్

జాబితా – 1 ను  జాబితా – 2 తో జత పరిచి దిగువ ఇచ్చిన ఆప్షన్స్ లో సరైన దానిని ఎన్నుకొనుము.

(d) 1 – D, 2 – C, 3 – A, 4 – B

(c) 1 – C, 2 – D, 3 – B, 4 – A

(c) 1 – C, 2 – D, 3 – A, 4 – B

(d) 1 – D, 2 – C, 3 – B, 4 – A

Q9. ” ది మంకీ కింగ్స్ ఆఫ్ ఒగ్గు కథ “ గ్రంధ రచయిత ఎవరు. ?

(a) చుక్కా సత్తయ్య

(b)కుమారస్వామి

(c) మిద్దె రాములు

(d) పైవా రెవరూ కారు

Q10. తెలంగాణ లో పరదా పద్దతి ఎవరి కాలం లో వ్యాప్తి చెందింది. ?

(a) అసఫ్ జాహీల పాలన

(b) కుతుబ్ షాహిల పాలన

(c) మొఘలుల పాలన

(d) బహుమనీల పాలన

Q11. కింద ఇవ్వ బడిన దళిత రచన లను జతపర్చుము.

జాబితా – 1                            జాబితా – 2

        పుస్తకం  పేరు                        రచించిన వారి  పేరు

  1. బోయి భీమన్న                       A) మాలపల్లి
  2. ఉన్నవ లక్ష్మీనారాయణ       B) పాలేరు నుండి పద్మ శ్రీ వరకు
  3. గుర్రం జాషువా                      C) దే బర్న్
  4. బి. శ్యామ్ సుందర్                D) గబ్బిలం

జాబితా – 1 ను  జాబితా – 2 తో జత పరిచి దిగువ ఇచ్చిన ఆప్షన్స్ లో సరైన దానిని ఎన్నుకొనుము.

(a) 1 – A, 2 – B, 3 – C, 4 – D

(b) 1 – B, 2 – A, 3 – D, 4 – C

(c) 1 – C, 2 – D, 3 – A, 4 – B

(d) 1 – D, 2 – C, 3 – B, 4 – A

Q12. తెలంగాణ లో తొలి సంచార గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు. ?

(a) పింగళి వెంకట రామి రెడ్డి

(b) అంబటి పూడి వెంకట రత్న శాస్త్రి

(c) టి. కె. బాలయ్య

(d) పై వారెవరూ కాదు

 

Q13. తెలంగాణ సాయుధ పోరాటం పైన రాయబడిన పుస్తకాలను జతపర్చుము.

జాబితా – 1                              జాబితా – 2

        రచయిత పేరు                             పుస్తకం పేరు

  1. మాది రాజు రామ కోటేశ్వర రావు            A) తెలంగాణ పోరాట స్మృతులు
  2. ఆరుట్ల రామచంద్రారెడ్డి                        B) తెలంగాణ అభ్యుదయంశాలు
  3. వట్టి కోట ఆళ్వార్ స్వామి                       C) వీర తెలంగాణ విప్లవ పోరాటం
  4. చంద్ర రాజేశ్వర రావు                            D) తెలంగాణ

జాబితా – 1 ను  జాబితా – 2 తో జత పరిచి దిగువ ఇచ్చిన ఆప్షన్స్ లో సరైన దానిని ఎన్నుకొనుము.

(a) 1 – A, 2 – B, 3 – C, 4 – D

(b) 1 – B, 2 – A, 3 – D, 4 – C

(c) 1 – C, 2 – D, 3 – A, 4 – B

(d) 1 – D, 2 – C, 3 – B, 4 – A

 

Q14. తెలంగాణ సమాజం లో “ కాటమ రాజు కథ ” ని ఎవరు ప్రదర్శిస్తారు ?

(a) చాకలి వారు

(b) గొల్ల వారు

(c) బ్రాహ్మణులు

(d) పెరిక వారు

Q15. తెలంగాణ లో మొట్ట మొదట గా ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ గా గుర్తించబడిన వారు ఎవరు ?

(a) చెంచులు

(b) కొలాములు

(c) నాయక్ పోడులు

(d) కోయలు

Q16. ప్రతి సంవత్సరం తొలకరి వర్షాలు కురిసే సమయం లో గిరిజనులు జరుపుకునే పండగ ఏది. ?

(a) తీజ్ పండగ

(b) శీత్ల భవాని పండగ

(c) అకిపెన్

(d) పెర్సి పెన్

Q17. కింద ఇవ్వ బడిన పండగ లను మరియు అవి జరుపు కునే నెలల ఆధారం గా జతపర్చుము

జాబితా – 1                              జాబితా – 2

        పండగ  పేరు                                జరుపుకునే నెల పేరు

  1. బతుకమ్మ పండగ             A) ఆషాడ మాసం
  2. బోనాల పండగ                 B) ఆశ్వయుజ మాసం
  3. ఉగాది పండగ                  C) భాద్రపద మాసారంభం
  4. పొలాల అమావాస్య         D) చైత్ర మాసం

జాబితా – 1 ను  జాబితా – 2 తో జత పరిచి దిగువ ఇచ్చిన ఆప్షన్స్ లో సరైన దానిని ఎన్నుకొనుము.

(a) 1 – A, 2 – B, 3 – C, 4 – D

(b) 1 – B, 2 – A, 3 – D, 4 – C

(c) 1 – C, 2 – D, 3 – A, 4 – B

(d) 1 – D, 2 – C, 3 – B, 4 – A

Q18. కింద ఇవ్వ బడిన ప్రముఖుల రచన లను జతపర్చుము

              జాబితా – 1                              జాబితా – 2

        రచయిత పేరు                             పుస్తకం పేరు

  1. పరవస్తు లోకేశ్వర్                   A) చలి నెగళ్ళు
  2. డా. కోయి కోటేశ్వర రావు        B) ఊరేగింపు
  3. సామిడి జగన్ రెడ్డి                  C) కావడి కుండలు
  4. పెండ్యాల వరవర రావు         D) సలాం హైదరాబాద్

జాబితా – 1 ను  జాబితా – 2 తో జత పరిచి దిగువ ఇచ్చిన ఆప్షన్స్ లో సరైన దానిని ఎన్నుకొనుము.

(a) 1 – A, 2 – B, 3 – C, 4 – D

(b) 1 – B, 2 – A, 3 – D, 4 – C

(c) 1 – C, 2 – D, 3 – A, 4 – B

(d) 1 – D, 2 – C, 3 – B, 4 – A

Q19. కింద ఇవ్వ బడిన పాటల రచయిత లను వారు రచించిన పాటల తో జతపర్చుము

                   జాబితా – 1                              జాబితా – 2

        రచయిత పేరు                             రచించిన పాట  

  1. గోరేటి వెంకన్న           A) నా తల్లి తెలంగాణ.. తిరగ బడ్డ వీణ
  2. నందిని సిద్ధారెడ్డి        B) జన జాతర లో మన గీతం జయ కేతనమై ఎగరాలి
  3. గద్దర్                            C) నీ పాట ఏమాయె రో.. నీ మాట ఏమాయె రో
  4. అందె శ్రీ                      D) ఒక పువ్వు ఒక నవ్వు

జాబితా – 1 ను  జాబితా – 2 తో జత పరిచి దిగువ ఇచ్చిన ఆప్షన్స్ లో సరైన దానిని ఎన్నుకొనుము.

(a) 1 – A, 2 – B, 3 – C, 4 – D

(b) 1 – B, 2 – A, 3 – D, 4 – C

(c) 1 – C, 2 – D, 3 – A, 4 – B

(d) 1 – D, 2 – C, 3 – B, 4 – A

Q20. కింద ఇవ్వ బడిన తెలంగాణ మాండలిక పదాలను వాటి యొక్క అర్థాలతో జతపర్చుము.

                          జాబితా – 1                              జాబితా – 2

        మాండలిక పదం                          దాని యొక్క అర్థం  

  1. అలుగు                  A) చెరువు నిండినపుడు నీరు బయటకు వెళ్ళడానికి చేసిన ఏర్పాటు
  2. దాపట                   B) ఎడమ వైపు
  3. సాయమాను          C) ఇంటి ముందర స్తంభాలతో కట్టిన భాగం
  4. కనుములు            D) రవికె గుడ్డలు

జాబితా – 1 ను  జాబితా – 2 తో జత పరిచి దిగువ ఇచ్చిన ఆప్షన్స్ లో సరైన దానిని ఎన్నుకొనుము.

(a) (a) 1 – A, 2 – B, 3 – C, 4 – D

(b) (b) 1 – B, 2 – A, 3 – D, 4 – C

(c) (c) 1 – C, 2 – D, 3 – A, 4 – B

(d) (d) 1 – D, 2 – C, 3 – B, 4 – A

Solutions:

S1. Ans(b)

Sol. సిల్వర్ ఫిలిగ్రీ – కరీంనగర్

చేర్యాల చిత్రకళాలు – సిద్దిపేట

పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్ – జనగామ

హలీమ్ – హైదరాబాద్

S2. Ans(d)

Sol. థెoసా నృత్యం – రాజ్ గోండులు ప్రదర్శిస్తారు.

పేరిణి శివ తాండవం – పురుషులు మాత్రమే చేసే నృత్యం. కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందినది.

మదిలి – పీర్ల పండగ రోజున చేసే నృత్యం.

రేల నృత్యం – కోయ తెగ కి చెందిన మహిళలు చేసే నృత్యం.

S3. Ans(b)

Sol. గౌతమేశ్వరాలయం – పెద్దపల్లి జిల్లా

వాడపల్లి శివాలయం – నల్గొండ జిల్లా

కొలనుపాక జైన దేవాలయం – యాదాద్రి భువనగిరి జిల్లా

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం – జగిత్యాల జిల్లా

S4. Ans(a)

Sol. కమ్మ కులస్తులు – పిచ్చ కుంట్లవారు

పెరుకలు – వరుస భట్టుల వారు

మాలలు – ముష్టిగ వారు

మాదిగలు – డక్కలి వారు

S5. Ans(a)

Sol. ప్రగటూర్ – నాగర్ కర్నూల్ జిల్లా

చిలుకూర్ – రంగారెడ్డి జిల్లా

కుర్చారమ్ – నిజామాబాద్ జిల్లా

చందా – అదిలాబాద్ జిల్లా

S6. Ans(c)

Sol. మేర కులము లో ఉన్నటువంటి మరొక శాఖ నే “ చిప్పి “ కులము. వీరి ప్రధాన కుల వృత్తి బట్టలు కుట్టడం

S7. Ans(a)

Sol. టేకు కలప మరియు ఆకులు కొయ్యడానికి ముందు గిరిజనులు రాజుల ముండా పండగ ని జరుపుకుంటారు.

S8. Ans(c)

Sol. కొరవి జాతర – మహబూబాబాద్ జిల్లా

ఐనవోలు మల్లన్న జాతర – వరంగల్ అర్బన్ జిల్లా

సిద్దుల గుట్ట జాతర – నిజామాబాద్ జిల్లా

మల్దగల్ జాతర – జోగుళాంబ గద్వాల జిల్లా

S9. Ans(b)

Sol. ” ది మంకీ కింగ్స్ ఆఫ్ ఒగ్గు కథ “ గ్రంధ రచయిత డా. కుమారస్వామి. ఉగ్రవాదం గురించి ఒగ్గు కథ రూపం లో రచించాడు.

S10. Ans(b)

Sol. కుతుబ్ షాహిల పాలన లో తెలంగాణ లో పరదా పద్దతి వ్యాప్తి చెందినది. ఇది ఉత్తర భారత దేశం ద్వారా తెలంగాణ లోకి ప్రవేశించింది.

S11. Ans(b)

Sol. బోయి భీమన్న – పాలేరు నుండి పద్మ శ్రీ వరకు

ఉన్నవ లక్ష్మీనారాయణ – మాలపల్లి

గుర్రం జాషువా – గబ్బిలం

బి. శ్యామ్ సుందర్ – దే బర్న్

S12. Ans(c)

Sol. తెలంగాణ లో తొలి సంచార గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన వారు : టి. కె. బాలయ్య

ఇతడు ఆర్మూర్ తాలూకాలో ని మారుమూల గ్రామాలకు ఎడ్ల బండ్ల పై పుస్తకాలను పంపిణీ చేసేవారు.

S13. Ans(b)

Sol. మాది రాజు రామ కోటేశ్వర రావు – తెలంగాణ అభ్యుదయంశాలు

ఆరుట్ల రామచంద్రారెడ్డి – తెలంగాణ పోరాట స్మృతులు

వట్టి కోట ఆళ్వార్ స్వామి – తెలంగాణ

చంద్ర రాజేశ్వర రావు – వీర తెలంగాణ విప్లవ పోరాటం

S14. Ans(b)

Sol. తెలంగాణ సమాజం లో “ కాటమ రాజు కథ ” ని ప్రదర్శించేవారు : గొల్ల వారు

S15. Ans(a)

Sol. తెలంగాణ లో మొట్ట మొదట గా ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ గా గుర్తించబడిన వారు : చెంచులు

S16. Ans(b)

Sol. ప్రతి సంవత్సరం తొలకరి వర్షాలు కురిసే సమయం లో గిరిజనులు జరుపుకునే పండగ : శీత్ల భవాని పండగ. లంబాడీ తెగ వారు ఈ పండగ ని జరుపుకుంటారు.

S17. Ans(b)

Sol. బతుకమ్మ పండగ – ఆశ్వయుజ మాసం

బోనాల పండగ – ఆషాడ మాసం

ఉగాది పండగ – చైత్ర మాసం

పొలాల అమావాస్య – భాద్రపద మాసారంభం, శ్రావణ మాసం చివరన

S18. Ans(d)

Sol. పరవస్తు లోకేశ్వర్ – సలాం హైదరాబాద్

డా. కోయి కోటేశ్వర రావు – కావడి కుండలు

సామిడి జగన్ రెడ్డి – ఊరేగింపు

పెండ్యాల వరవర రావు – చలి నెగళ్ళు

S19. Ans(c)

Sol. గోరేటి వెంకన్న – నీ పాట ఏమాయె రో.. నీ మాట ఏమాయె రో

నందిని సిద్ధారెడ్డి – ఒక పువ్వు ఒక నవ్వు

గద్దర్ – నా తల్లి తెలంగాణ.. తిరగ బడ్డ వీణ

అందె శ్రీ – జన జాతర లో మన గీతం జయ కేతనమై ఎగరాలి

S20. Ans(a)

Sol. అలుగు – చెరువు నిండినపుడు నీరు బయటకు వెళ్ళడానికి చేసిన    ఏర్పాటు

దాపట – ఎడమ వైపు

సాయమాను – ఇంటి ముందర స్తంభాలతో కట్టిన భాగం

కణుములు – రవికె గుడ్డలు 

TEST PRIME - Including All Andhra pradesh Exams

TSPSC Group 2 & 3 Super Revision MCQs Batch | Online Live Classes by Adda 247

TSPSC GROUP-2, GROUP-3 General Studies Online Test Series in Telugu and English By Adda247

Read More:
Top 20 Questions on Telangana Movement Top 20 MCQs on the Development of Sociology
Top 20 Questions on Telangana History Top 20 Questions Telangana Policies

Sharing is caring!