Telugu govt jobs   »   TGPSC Groups Quick Revision Series
Top Performing

TGPSC Groups Quick Revision Series: Top 20 Questions on Telangana Movement and State Formation

The Telangana Movement and State Formation is a pivotal chapter in the political and socio-cultural history of India, specifically for the region of Telangana. The struggle for a separate Telangana state, distinct from the erstwhile Andhra Pradesh, spanned several decades and culminated in the formation of Telangana as the 29th state of India on June 2, 2014. This movement was fueled by a long-standing demand for self-governance, socio-economic justice, and the preservation of cultural identity.

Understanding the Telangana Movement is not only important from a historical perspective but also critical for aspirants preparing for the TSPSC Group 2 Examination. Paper IV, which covers this subject, holds significant weightage (150 marks), making it an essential component for success in this exam. The paper includes various aspects of the movement, such as the early phases, key leadership, significant protests, agreements, and the ultimate realization of the demand for statehood.

For TSPSC aspirants, thorough knowledge of the Telangana Movement & State Formation can help score well, as it touches upon crucial historical events, legislative processes, and socio-political dynamics that shaped modern-day Telangana. This section offers a high-scoring opportunity, provided candidates have a strong grasp of the sequence of events, key players, and outcomes of the movement.

To assist with quick revision, we have curated the top 20 questions covering the important milestones of the Telangana Movement and the process of state formation. These questions will help aspirants solidify their understanding and enhance their preparation for the TSPSC Group 2 exam and other related TSPSC exams.

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం భారతదేశంలోని రాజకీయ, సామాజిక-సాంస్కృతిక చరిత్రలో కీలక అధ్యాయం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటం అనేక దశాబ్దాలు సాగి, చివరకు 2014, జూన్ 2న తెలంగాణ భారతదేశ 29వ రాష్ట్రంగా అవతరించింది. ఈ ఉద్యమం స్వయంప్రభుత్వం, ఆర్థిక సమానత్వం, సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవాలని కోరుతూ ప్రారంభమైంది.

తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవడం కేవలం చారిత్రక కోణం నుండి మాత్రమే కాదు, TSPSC గ్రూప్ 2 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కూడా కీలకం. ఈ పరీక్షలోని పేపర్ IV (150 మార్కులు) ఈ అంశాన్ని ఎక్కువగా కవర్ చేస్తుంది, కనుక ఇది విజయానికి కీలకమైన భాగం. ఈ పేపర్ తెలంగాణ ఉద్యమం యొక్క ప్రారంభ దశలు, ప్రధాన నాయకత్వం, ప్రధాన నిరసనలు, ఒప్పందాలు, మరియు రాష్ట్రహోదా సాధించిన అంచెలు వంటి వివిధ అంశాలను కలిగి ఉంటుంది.

TSPSC అభ్యర్థులకు, తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం గురించి సుదీర్ఘ జ్ఞానం ఉండటం మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. ఇది ముఖ్యమైన చారిత్రక సంఘటనలు, చట్టపరమైన ప్రక్రియలు, మరియు ఆధునిక తెలంగాణను రూపుదిద్దిన సామాజిక-రాజకీయ చర్చలపై దృష్టి సారిస్తుంది. ఈ విభాగం స్పష్టమైన అర్థంతో చదివిన అభ్యర్థులకు మంచి స్కోరింగ్ అవకాశాన్ని ఇస్తుంది.

త్వరిత పునశ్చరణ కోసం, తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం యొక్క ముఖ్య ఘట్టాలను కవర్ చేసే టాప్ 20 ప్రశ్నలను సేకరించాం. ఈ ప్రశ్నలు అభ్యర్థుల సిద్ధతను మెరుగుపరచడానికి మరియు TSPSC గ్రూప్ 2 పరీక్షకు బలమైన పునాదిని కట్టడానికి సహాయపడతాయి

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటుపై టాప్ 20 ప్రశ్నలు

Q1. తొలి దశ రాజకీయ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం____.

  1. 1968
  2. 1969
  3. 1967
  4. 1970

Q2. తెలంగాణ ప్రజా సమితిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు?

  1. 1968
  2. 1969
  3. 1967
  4. 1970

Q3. ఎవరి మార్గదర్శకత్వంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( కేసీఆర్) ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీని స్థాపించారు.?

  1. కే. అచ్చుత రెడ్డి
  2. ఘంట చక్రపాణి
  3. ఆచార్య జయశంకర్
  4. పైవన్నీ

Q4. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన సంవత్సరం?

  1. 1948 సెప్టెంబర్ 17 
  2. 1949 సెప్టెంబర్ 18 
  3. 1947 సెప్టెంబర్ 17
  4. 1947 సెప్టెంబర్ 20

Q5. 1960లో ప్రాంతీయ సంఘం తొలి తెలంగాణ అధ్యక్షుడిగా పని చేసినవారు ఎవరు?

  1. కే. అచ్చుత రెడ్డి
  2. ఆచార్య జయశంకర్
  3. ప్రొపెసర్ కోదండరాం
  4. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

Q6. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులందరూ కలిసి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడిన తేది?

  1. 1969 జనవరి 13
  2. 1968 జనవరి 13
  3. 1970 జనవరి 15
  4. పైన పెర్కునవేవి కావు

Q7. ‘తెలంగాణ ప్రజా సమితి’ (టిపీఎస్) అధ్యక్షుడిగా 1969 మే 22 న ఎవరిని ఎన్నుకున్నారు?

  1. ఆచార్య జయశంకర్
  2. ప్రొపెసర్ కోదండరాం
  3. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
  4. మర్రి చెన్నారెడ్డి

Q8. భారతదేశంలో మొదటిసారిగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ను ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు?

  1. ఆచార్య జయశంకర్
  2. ప్రొపెసర్ కోదండరాం
  3. ఫజల్ అలీ
  4. మర్రి చెన్నారెడ్డి

Q9. ‘తెలంగాణ ఫోరం’ ను ఎవరు ఏర్పాటు చేసారు?

  1. ఫజల్ అలీ
  2. కుందూరు జానారెడ్డి
  3. జె.సి. దివాకర్ రెడ్డి
  4. మర్రి చెన్నారెడ్డి

Q10. మలిదశ ఉద్యమంలో కీలక తెలంగాణ పాత్ర పోషించిన తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసిన తేది?

  1. 2009 డిసెంబర్ 4
  2. 2009 డిసెంబర్ 10
  3. 2008 డిసెంబర్ 4
  4. 2010 డిసెంబర్ 5

 

Q11. ప్రత్యేక తెలంగాణ సమస్యను పరిష్కరించడం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిటీని ఏర్పాటు చేసిన తేది?

  1. 2010 ఫిబ్రవరి 3
  2. 2011 ఫిబ్రవరి 3
  3. 2010 ఫిబ్రవరి 5
  4. పైవేవి కావు

Q12. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ‘మిలియన్ మార్చ్’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన తేది?

  1. 2011 మార్చి 10
  2. 2010 మార్చి 3
  3. 2010 ఫిబ్రవరి 5
  4. పైవేవి కావు 

Q13. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై చర్చ చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి 2013 మర్చి 21 న జేఏసీ చేపట్టిన ఉద్యమ కార్యక్రమం పేరు?

  1. సడక్ బంద్
  2. తెలంగాణ మార్చ్
  3. మిలియన్ మార్చ్
  4. పైనవేవి కావు

Q14. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 2013 ఆగష్టు 6 న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ?

  1. శ్రీ కృష్ణ కమిటీ
  2. ఆంటోని కమిటీ
  3. టిజెఏసీ కమిటీ
  4. పైవేవి కాదు 

Q15. ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్ బాబు నేతృత్వంలో ఎల్.బి.స్టేడియం, హైదరాబాద్ లో2013 సెప్టెంబర్ 21 న నిర్వహించిన సమైక్యాంధ్ర సభ పేరు?

  1. సేవ్ తెలంగాణ
  2. తెలంగాణ ఫోరం
  3. మిలియన్ మార్చ్
  4. సేవ్ ఆంధ్రప్రదేశ్

Q16. లలిత్ కుమార్ కమిటీ నివేదిక ప్రకారం 1968 మార్చ 31 నాటికి తెలంగాణ మిగులు నిధులు ఎంత?

  1. 10 కోట్లు
  2. 5 కోట్లు
  3. 3 కోట్లు
  4. 32 .3 కోట్లు

Q17. ఆపరేషన్ పోలో జరిగినప్పుడు MIM అధ్యక్షుడు ఎవరు?

  1. అబ్దుల్ వాహిద్ ఒవైసీ
  2. సల్లవుద్దిన్ ఒవైసీ
  3. అసదుద్దీన్ ఒవైసీ
  4. ఖాసిమ్ రజ్వీ

Q18. నిజాం రాష్ట్ర గ్రంథాలయం ప్రథమ సమావేశం ఏ సంవత్సరంలో , ఎక్కడ జరిగింది?

  1. 1925, మధిర
  2. 1925, సూర్యాపేట
  3. 1925, ఖమ్మం
  4. 1924, వరంగల్

Q19. తెలంగాణా ఏర్పాటుకై ఢిల్లీలో పార్లమెంట్ ముందు ఆత్మహత్య చేస్కున్నది ఎవరు?

  1. శ్రీకాంత చారి
  2. శంకర్
  3. యాదిరెడ్డి
  4. శ్రీధర్ రెడ్డి

Q20. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంను ఎప్పుడు గెజిట్లో ప్రచురించారు?

  1. 2013, మార్చి2
  2. 2013, జూన్ 2
  3. 2014, మార్చి 2
  4. 2014, జూన్ 2

TSPSC Group 2 & 3 Super Revision MCQs Batch | Online Live Classes by Adda 247

Solutions:

Q1.ANS.(a)

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1968 లో ఒక క్రమానుగత విప్లవ స్పూర్తితో ఉద్యమం ప్రారంభమైంది.

Q2.ANS.(B)

1969 లో తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేసారు.

Q3.ANS.(c)

ఆచార్య జయశంకర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి 2001లో కల్వకుంట్ల చంద్రశేకర్రావు ( కేసీఆర్) తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీని స్థాపించారు.

Q4.ANS.(A)

1948 సెప్టెంబర్ 17 లో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైనది

Q5.ANS.(a).

1960లో ప్రాంతీయ సంఘం తొలి తెలంగాణ అధ్యక్షుడిగా పని చేసినవారు కే. అచ్చుత రెడ్డి

Q6.ANS.(A)

1969 జనవరి 13న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులందరూ కలిసి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడినారు.

Q7.ANS.(d)

మర్రి చెన్నారెడ్డిని  ‘తెలంగాణప్రజా సమితి’ (టిపీఎస్) అధ్యక్షుడిగా 1969 మే 22 న ఎన్నుకున్నారు.

Q8.ANS.(C)

భారతదేశంలో మొదటిసారిగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ను 1953 డిసెంబర్ 22 న ‘ఫజల్ అలీ’ నేతృత్వంలో ఏర్పాటు చేశారు

Q9.ANS.(b)

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి కన్వీనర్ గా 1990 లో ‘తెలంగాణ ఫోరం’ ఏర్పడింది. 

Q10.ANS.(a)

2009 డిసెంబర్ 4న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ జేఏసీని ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్ గా ప్రొపెసర్ కోదండరాం ను ఎన్నుకున్నారు.

Q11.ANS. (A)

ప్రత్యేక తెలంగాణ సమస్యను పరిష్కరించడం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిటీని 2010 ఫిబ్రవరి 3 న  ఏర్పాటు చేశారు. శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోం శాఖకు సమర్పించిన తేది 2010 డిసెంబర్ 30.

Q12.ANS.(a)

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ‘మిలియన్ మార్చ్’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన తేది 2011 మార్చి10.

Q13.ANS.(a)

ఉమ్మడి ఆంధ్రపరదేశ్ లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై చర్చ చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి 2013 మర్చి 21 న జేఏసీ చేపట్టిన ఉద్యమ కార్యక్రమం పేరు – సడక్ బంద్.

Q14.ANS.(B)

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 2013 ఆగష్టు 6 న కేంద్ర ప్రభుత్వం ఆంటోని కమిటీని ఏర్పాటు చేసినది.

Q15.ANS.(D)

ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్ బాబు నేతృత్వంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో 2013 సెప్టెంబర్ 21 న సమైక్యాంధ్ర సభను ఎల్.బి.స్టేడియం, హైదరాబాద్ లో నిర్వహించారు.

S16. Ans (a)

Sol. కుమార్ లలిత్ కమిటీ లెక్కించిన మిగులు లెక్కింపు కాలం 12 సంవత్సరాలు (1956 నవంబర్ 1 నుండి మార్చి 31, 1968 వరకు) .ఈ కమిటి నివేదిక ప్రకారం తెలంగాణా మిగులు నిధులు 34.1 కోట్లు.

S17. Ans (d)

Sol. ఆపరేషన్ పోలో జరిగినప్పుడు MIM అధ్యక్షుడు ఖాసిమ్ రజ్వి. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది. దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు

S18. Ans (a)

Sol. నిజాం రాష్ట్ర గ్రంథాలయం ప్రథమ సమావేశం 1925, మధిరలో జరిగింది.

S19. Ans (c)

Sol. తెలంగాణ ఏర్పాటుకై ఢిల్లీలో పార్లమెంట్ ముందు ఆత్మహత్య చేస్కున్నది యాదిరెడ్డి. తెలంగాణ పై రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలు తట్టుకోలేక ఇతను 2011 జూలై 20వ తేదీన ఢిల్లీలోని పార్లమెంట్ సమీపంలో గల శాస్త్రీభవన్ వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మహత్య చేసుకున్నాడు.

S20. Ans (c)

Sol. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంను 2014, మార్చి2న గెజిట్లో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ తేది లేకుండా ప్రచురించారు. మార్చి 4, 2014న జూన్ 2ను  తెలంగాణా ఆవిర్భావ తేదిగా ప్రకటించారు.

TSPSC GROUP-2, GROUP-3 General Studies Online Test Series in Telugu and English By Adda247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

TGPSC Groups Quick Revision Series: Top 20 Questions on Telangana Movement and State Formation_5.1
About the Author

Hi! I'm Kalyani, your go-to guide for exam prep on the ADDA247 Telugu blog. With 3+ years of experience in EdTech, I specialize in creating informative content on national and state-level exams, focusing on AP and Telangana State Exams. As someone who's walked the talk, I've personally appeared for competitive exams like TGPSC Groups, IBPS, Railways, and most recently, IBPS RRB Clerk Mains 2024. This hands-on expertise enables me to provide valuable insights and guidance to help you navigate your exam prep journey. On this blog, you can expect expert advice, study materials, and exam strategies for AP and Telangana State Exams, as well as Railways, Banking, Insurance, SSC, and other competitive exams. Stay tuned for regular updates, and let's crack those exams together!