Telugu govt jobs   »   Current Affairs   »   తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను కేంద్ర...

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమించింది

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమించింది

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జూలై 28 న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, న్యాయవాదుల కోటా నుంచి లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్కుమార్ జూకంటి, న్యాయాధికారుల కోటా నుంచి సుజన కలసికంలను అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ చేసిన సిఫారసులకు జూలై 12న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఆమోదం తెలిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

జూలై 28 రాత్రి ఈ నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. అదనంగా, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అంతేకాదు, బొంబాయి, కోల్‌కతా, గువాహటి, కేరళ, ఛత్తీస్గఢ్ హైకోర్టులకు చెందిన మొత్తం 15 మంది అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు అనుమతి లభించింది.

ఈ నియామకాలతో తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం ఖాళీల సంఖ్య 12కి తగ్గింది.హైకోర్టులో మొత్తం 42 మంది మంజూరైన న్యాయమూర్తులు ఉండగా, అందులో 32 మంది శాశ్వత న్యాయమూర్తులు, 10 అదనపు న్యాయమూర్తుల పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 25 మంది శాశ్వత, ఇద్దరు అదనపు న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు. శాశ్వత న్యాయమూర్తుల్లో 7, అదనపు న్యాయమూర్తుల్లో 8 పోస్టులు కలిపి మొత్తం 15 ఖాళీగా ఉండగా ఇప్పుడు ఈ ముగ్గురి నియామకంతో ఖాళీల సంఖ్య 12కి తగ్గింది. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు జూలై 30 లేదా 31 న ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

తెలంగాణ తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా బి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు.