డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేది సాంకేతికతను ఉపయోగించడం ద్వారా వ్యవసాయం చేసే విధానాన్ని మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. భారత ప్రభుత్వంలో భాగంగా డిజిటల్ వ్యవసాయ మిషన్ ను ప్రారంభించారు, ఇది వ్యవసాయ రంగాన్ని మెరుగుపరిచేందుకు, అధునాతన డిజిటల్ సాధనాలను ఉపయోగించి వ్యవసాయ విధానాలను పూర్తిగా మార్చడానికి తోడ్పడుతుంది. ఈ కార్యక్రమంలో డేటా విశ్లేషణలు, మొబైల్ యాప్‌లు, డ్రోన్‌లు వంటివి వ్యవసాయంలో సమర్థవంతతను మరియు ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగిస్తారు. ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమితి ఈ మిషన్‌ను 2817 కోట్లు వ్యయంతో ఆమోదించింది. ఇందులో రూపాయి 1940 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఈ మిషన్ వివిధ డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలు వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) మరియు డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (DGCES) వంటి ఐటి పథకాల అమలుకు మద్దతుగా పనిచేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు విద్యా, పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో ఈ పథకాలు అమలవుతాయి.
డిజిటల్ వ్యవసాయ మిషన్ యొక్క లక్ష్యం
ఈ మిషన్ భారత ప్రభుత్వం చేపట్టిన ఆధార్, డిజిలాకర్, యూపిఐ, ఈ సైన్ వంటి విజయవంతమైన డిజిటల్ పాలన కార్యక్రమాల మాదిరిగా వ్యవసాయ రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) నిర్మాణంపై దృష్టి పెడుతుంది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యవసాయ కార్యకలాపాల సులభతరం కోసం వ్యవసాయదారులకు డేటా ఆధారిత సేవలు మరియు పరిష్కారాలను అందిస్తుంది. డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (DGCES) ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల అంచనాలను మెరుగుపరచడం కూడా ఈ మిషన్ ముఖ్య లక్ష్యం.
డిజిటల్ వ్యవసాయ మిషన్ ముఖ్యాంశాలు
ఈ డిజిటల్ వ్యవసాయ మిషన్ లోని ప్రధాన భాగాలు:
- అగ్రిస్టాక్
- క్రిషి నిర్ణయ మద్దతు వ్యవస్థ (Krishi DSS)
- సాయిల్ ప్రొఫైల్ మ్యాప్ లు
ఈ భాగాలు రైతులకు ఆధునిక సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి
అగ్రిస్టాక్: డిజిటల్ వ్యవసాయానికి నాంది
అగ్రిస్టాక్ అనే రైతు కేంద్రిత డిజిటల్ ప్లాట్‌ఫామ్ మూడు ప్రధాన రిజిస్ట్రీలు లేదా డేటాబేసులను కలిగి ఉంటుంది: రైతుల రిజిస్ట్రీ, జియో-రిఫరెన్స్డ్ గ్రామ పటాలు, మరియు విత్తిన పంట రిజిస్ట్రీ. ఈ రిజిస్ట్రీలు రాష్ట్ర/సంఘపరిపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్వహిస్తాయి.
- రైతుల రిజిస్ట్రీ: ప్రతి రైతుకు ‘రైతు ఐడి’ అనే ప్రత్యేక డిజిటల్ ఐడెంటిటీ ఇవ్వబడుతుంది. ఇది వారి భూమి, పశు సముదాయాలు, విత్తిన పంటలు, కుటుంబ సభ్యుల వివరాలు మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డేటాను కలుపుతుంది. ఆధార్ తరహాలో ఇది పని చేస్తుంది. ఫర్రుఖాబాద్ (ఉత్తర ప్రదేశ్), గాంధీనగర్ (గుజరాత్), బీడ్ (మహారాష్ట్ర), యమునా నగర్ (హర్యానా), ఫతేఘర్ సాహిబ్ (పంజాబ్), మరియు విరుదునగర్ (తమిళనాడు) జిల్లాల్లో ఈ పథకం పై పైలట్ ప్రాజెక్టులు అమలు అయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6 కోట్ల మంది రైతులకు, 2025-26 లో 3 కోట్ల మంది రైతులకు, మరియు 2026-27 లో 2 కోట్ల మంది రైతులకు ఈ డిజిటల్ ఐడీలు ఇవ్వడం లక్ష్యం.
- విత్తిన పంట రిజిస్ట్రీ: ఈ రిజిస్ట్రీ రైతుల విత్తిన పంటల వివరాలను డిజిటల్ పంట సర్వేల ద్వారా నమోదు చేస్తుంది. 2023-24 సంవత్సరంలో 11 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ పంట సర్వే నిర్వహించబడింది. ఈ పథకం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 400 జిల్లాలలో మరియు 2025-26 లో మిగతా జిల్లాలలో అమలు చేయబడుతుంది.
- జియో-రిఫరెన్స్డ్ గ్రామ పటాలు: ఈ పటాలు భౌగోళిక సమాచారం ఆధారంగా భూమి రికార్డులను పర్యవేక్షిస్తాయి.
క్రిషి నిర్ణయ మద్దతు వ్యవస్థ (DSS): డేటా ఆధారిత వ్యవసాయానికి మద్దతు
మిషన్ కింద ఇటీవల ఆవిష్కరించిన కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (DSS) అనేది పంటలు, నేల, వాతావరణం మరియు నీటి వనరులతో సహా బహుళ వనరుల నుండి డేటాను సమీకృతం చేసే సమగ్ర జియోస్పేషియల్ ప్లాట్ఫామ్. ఈ వ్యవస్థ రైతులు మరియు విధానకర్తలకు పంట నమూనాలు, వాతావరణ పరిస్థితులు మరియు నీటి లభ్యతపై అంతర్దృష్టులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది వ్యవసాయ పద్ధతులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. పంటల మ్యాప్ లను రూపొందించడం, కరువులు మరియు వరదలను పర్యవేక్షించడం మరియు దిగుబడి మదింపులను మెరుగుపరచడంలో, ముఖ్యంగా పంట బీమా క్లెయిమ్ లను పరిష్కరించడానికి DSS సహాయపడుతుంది.
సాయిల్ ప్రొఫైల్ మ్యాప్స్: మట్టి నిర్వహణకు కొత్త దారులు
ఈ మిషన్ కింద 1:10,000 స్కేల్ తో 142 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమికి సంబంధించిన సాయిల్ ప్రొఫైల్ మ్యాప్స్ తయారుచేయాలని లక్ష్యం. ప్రస్తుతం 29 మిలియన్ హెక్టార్ల భూమి యొక్క సాయిల్ ప్రొఫైల్ పూర్తి అయ్యింది.
డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (DGCES): పంట అంచనాలను మెరుగుపరచడం
డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (DGCES) అనేది పంట దిగుబడి అంచనాలను మెరుగుపరచే ముఖ్యమైన కార్యక్రమం. ఈ సర్వే ద్వారా సమీకరించిన డేటా, ఉపగ్రహ చిత్రాలు మరియు రిమోట్ సెన్సింగ్ ద్వారా పంట ఉత్పత్తి అంచనాలను మెరుగుపరుస్తుంది. ఇది MSP (మినిమం సపోర్ట్ ప్రైస్), పంట బీమా మరియు పంట రుణాలు వంటి పథకాలను మరింత సమర్థవంతంగా చేసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఇది సమతుల్య ఎరువుల వినియోగం మరియు నీటి పారుదల అవసరాలను కూడా నిర్ణయిస్తుంది.
ముగింపు: సాంకేతికతతో నిండిన వ్యవసాయ భవిష్యత్తు
డిజిటల్ వ్యవసాయ మిషన్ అనేది సాంకేతికత ఆధారిత వ్యవసాయ విధానాన్ని నిర్మించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న పథకం. ఈ పథకం ద్వారా వ్యవసాయదారులు స్మార్ట్ వ్యవసాయ పద్ధతులను అవలంబించి వ్యవసాయ ఉత్పాదకతను, వ్యవసాయ ఆదాయాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తారు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |