ఆంధ్రప్రదేశ్ : కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ సుస్థిరాభివృద్ధిని సాధించే దిశగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. మానవ సామర్థ్యం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధికి మద్దతు, సామాజిక భద్రత లక్ష్యాలను నవరత్నాలతో ఏకీకరణ చేయడం ద్వారా లక్ష్యాలను చేరుకుంటున్నట్లు తెలిపారు. సుస్థిరాభివృద్ధికి ఈ నాలుగు స్తంభాలు కీలకం అని చెప్పారు. శుక్రవారం ఆయన వార్షిక బడ్జెట్ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్‌డీజీ ఇండియా 2020–21 నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన నీరు–పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం, లింగ సమానత్వం, చౌకగా సుస్థిర శక్తి – సముద్ర జలజీవుల పరిరక్షణ వంటి అంశాల్లో రాష్ట్రం 5వ స్థానంలో ఉందన్నారు.
నాడు–నేడు, జగనన్న అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ వైద్య శాలలు, వైద్య కళాశాలలు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో మానవ సామర్థ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం, వైఎస్సార్ జలకళ, రహదారుల అభివృద్ధి, కొత్త ఓడరేవులు, నౌకాశ్రయాలు, వ్యవసాయం–పాడి పరిశ్రమలో మౌలిక సదుపాయాల కల్పన, జగనన్న కాలనీలు, వైఎస్సార్ హౌసింగ్ వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************