Telugu govt jobs   »   Current Affairs   »   The Land Titling Act came into...

The Land Titling Act came into force for the first time in the country in AP | దేశంలోనే మొదటి సారిగా భూ హక్కుల చట్టం ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి రానుంది

The Land Titling Act came into force for the first time in the country in AP | దేశంలోనే మొదటి సారిగా భూ హక్కుల చట్టం ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి రానుంది
భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో భూ హక్కుల చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ) అమలులోకి తీసుకుని వచ్చారు. అక్టోబర్ 31 నుంచి ఈ చట్టం వర్తిస్తుంది అని ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన GO.512 లో తెలిపారు. ఈ చట్టం ద్వారా భూమి యజమానులు, కొనుకున్నవారి హక్కులను పూర్తిగా పరిరక్షిస్తుంది.  భూ హక్కుదారులు తప్ప భూమిని ఎవ్వరూ విక్రయించలేరు. రాష్ట్రంలో కొనుగోలు రిజిస్టర్ ని కూడా రూపొందిస్తారు, ఇప్పటికే వివాద రిజిస్టర్ మరియు స్టిరాస్తుల శాశ్వత రిజిస్టర్ ని పొందుపరుస్తున్నారు. ఈ చట్టం అమలుతో పాటు ఏపి ల్యాండ్ ఆధారిటీని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కూడా నియమిస్తారు. భూ హక్కుదారుల రిజిస్టర్ పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ ట్రిబ్యునల్ ని ఆశ్రయించాలి మరియు నేరుగా కోర్టులకి వెళ్ళడానికి వీలులేదు తీర్పుపై హైకోర్టులో సవాలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. భారతదేశంలో మరేఇతర రాష్ట్రాలలో ఇటువంటి చట్టం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూ యాజమాణ్య హక్కు దారులను పరిరక్షించడానికి ఈ చట్టం తీసుకుని వచ్చింది.

Sharing is caring!