తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ రంగంలో రాబోయే పదేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తుల సమూహాలు (క్లస్టర్లు) ఉన్నాయని, మరో రెండు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల విస్తరణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఎలక్ట్రానిక్స్ – సిటీలో రేడియంట్ అప్లయెన్సెస్ సంస్థ ఏర్పాటు చేసిన తొలి ఎల్‌ఈడీ టీవీల తయారీ పరిశ్రమను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో తయారీ (మేకిన్ తెలంగాణ) నినాదంతో ఎల్‌ఈడీ టీవీలు తయారు చేస్తున్న రేడియంట్ సంస్థ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తోంది.
ముఖ్యమైన అంశాలు:
- తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి : కల్వకుంట్ల తారక రామారావు
- తెలంగాణ ముఖ్యమంత్రి: శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు
*******************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************