తెలంగాణ భావజాల వ్యాప్తిలో పౌరసంఘాలు, వేదికల పాత్ర
తెలంగాణ భావజాలంతో సహా భావజాల వ్యాప్తిలో పౌర సంస్థలు మరియు వేదికలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రత్యేక సాంస్కృతిక, చారిత్రక మరియు సామాజిక-ఆర్థిక గుర్తింపును కలిగి ఉన్న తెలంగాణ ఉద్యమం సందర్భంలో, ఈ సంస్థలు ఈ ప్రాంతం యొక్క ప్రత్యేక దృక్పథాలు మరియు ఆకాంక్షలను వ్యక్తీకరించడానికి మరియు వ్యాప్తి చేయడానికి వాహనాలుగా పనిచేస్తాయి.
తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
- 1987లో హైదరాబాద్ లోని కాచీగూడ బసంత్ టాకీస్ లో తెలంగాణ సదస్సు జరిగింది.
- ఈ సదస్సులో తెలంగాణ ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పడింది
ఈ ట్రస్ట్ సభ్యులు:
- కేశవరావు జాదవ్ సార్
- జయశంకర్ సార్
- ప్రభాకర రావు
- హరినాథ్
ట్రస్ట్ యొక్క లక్ష్యాలు :
- తెలంగాణ అన్యాయాలపై పరిశోధన
- ఈ అన్యాయాలకు సంబంధించిన ప్రచురణలు
ఈ ట్రస్టు యొక్క ప్రచురణలు :
- ఎస్.ఆర్.సి రిపోర్టు
- ప్రభుత్వ డాక్యుమెంట్లు
- పెద్ద మనుషుల ఒప్పందం
- జి.వో.నెం 36
- 1969 అఖిలపక్ష ఒప్పందం
- ఈ ట్రస్టుకు సంబంధించిన పత్రిక – ‘మా తెలంగాణ పత్రిక’.
- మా తెలంగాణ పత్రికను 1989 ఆగష్టు 13న కాచిగూడలోని ‘బసంత్ టాకీస్ లో ఆవిష్కరించారు.
- మా తెలంగాణ మాసపత్రిక 7 సంచికలు వెలువడ్డాయి.
మా తెలంగాణ పత్రిక యొక్క ప్రత్యేక సంచికలు
- 1989లో కల్వకుర్తి ఎన్నికలలో ఎన్.టి.ఆర్. పోటీ చేసినప్పుడు
- 1997లో మలిదశ ఉద్యమం ప్రారంభమైనప్పుడు
- 2001లో టి.ఆర్.ఎస్. ఏర్పడినప్పుడు
- తెలంగాణలో జరుగుతున్న ధోపిడిపై 1988లో ఈ ట్రస్టుముద్రించిన పుస్తకం–పర్ స్పెక్టివ్ ఆన్ తెలంగాణ
- ఈ విధంగా తెలంగాణలో భావజాల వ్యాప్తిలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు యొక్క పాత్ర మరువలేనిది.
APPSC/TSPSC Sure shot Selection Group
పౌర సంఘాల ఏర్పాటు తెలంగాణ ఐక్యవేదిక
- మేధావులు, కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, ప్రజలు కలిసి పౌరసంఘాలుగా ఏర్పడి తెలంగాణ డిమాండ్ ను ముందుకు తెచ్చారు.
- తెలంగాణ ప్రాంతంలో విడివిడిగా పనిచేస్తున్న 28 ప్రజాసంఘాలు కలిసి ‘తెలంగాణ ఐక్యవేదిక’గా రూపొందాయి.
- 1997 ఆగస్టు 14,15 తేదీలలో ఉస్మానియాలో ప్రాంతీయ అసమానతలు-అభివృద్ధి ప్రత్యామ్నాయాలు అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రొ॥ జయశంకర్, విశ్వేశ్వరరావు, సింహాద్రి, అఖిలేశ్వరి మొదలగు వారి ఆధ్వర్యంలో జరిగింది.
- ఈ సదస్సులో విద్యా, ఉద్యోగ, సాగునీరు రంగాలలో తెలంగాణకు సమైక్య రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై పరిశోధక పత్రాలను సమర్పించారు.
- తరువాతి కాలంలో ఈ పత్రాలు జయశంకర్ సార్, విశ్వేశ్వరరావుల సంపాదకత్వంలో ‘తెలంగాణ డెవలప్మెంట్ అండర్ డైమన్షన్స్’ (ఆంగ్లం) అనే పేరుతో సంకలనంగా వచ్చింది.
- 1997 అక్టోబర్ 16న జయశంకర్ సారు నేతృత్వంలో తెలంగాణ ఐక్యవేదిక ఆవిర్భావాన్ని ప్రకటిస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. మొదట్లో తెలంగాణ ఐక్యవేదికకు కార్యాలయం కాచిగూడలోని సుప్రభాత్ కాంప్లెక్స్ లో ఉండేది.
- తర్వాతి కాలంలో తెలంగాణ ఐక్య వేదికకు కార్యాలయం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ తన నివాసమైన జలదృశ్యంలో ఒక గదిని ఇచ్చాడు.
- ఈ ఐక్యవేదిక కార్యాలయమే 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క కార్యాలయంగా మారింది.
- తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలోని ‘తెలంగాణ’ పత్రికను కాళోజీ నారాయణరావు 1997 నవంబర్ 1న గన్పార్క్ వద్ద ఆవిష్కరించారు.
- జోగులాంబగ గద్వాల జిల్లాలో కరువు సంభవించినపుడు గట్టుమండలంలోని రాయాపూర్ గ్రామాని దత్తత తీసుకొని నిత్యావసర వస్తువులను సరఫరాలు ఐక్య వేదిక చేసింది.
- 1998లో ఆదిలాబాద్ జిల్లాలో కలరా వ్యాపించినపుడు ప్రభుత్వం దానిని అతిసార వ్యాధిగా గుర్తించింది. అటువంటి సమయంలో తెలంగాణ ఐక్యవేదిక తరపున నిజనిర్ధారణ సంఘం (బి. ఎన్. శంకర్ వి.ప్రకాశరావు, మల్లేపల్లి లక్ష్మయ్యగారు)గా వెళ్ళి అది అతిసారం కాదు కలరా అని నిర్ధారించారు.
- బి. జనార్ధనరావు చొరవ వలన ఈ సమస్య గురించి అమెరికాలోని వాల్ స్ట్రీట్ జనరల్ తమ పత్రికలో ముద్రించారు.
- దాంతో కలరా వ్యాధి నివారణకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది.
తెలంగాణ విద్యావంతుల వేదిక
2004 మార్చిలో కోదండరామ్ కన్వీనర్‌గా ‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ ఏర్పడింది.
ఈ వేదిక రాష్ట్ర మహాసభలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది
- మొదటి సభ – హైద్రాబాద్ (2005)
- రెండవ సభ – వరంగల్ (2007)
- మూడవ సభ – ఖమ్మం (2010)
- నాల్గవ సభ – హైద్రాబాద్ (2013)
- ఐదవ సభ – హైద్రాబాద్ (2015)
ఈ వేదిక ముద్రించిన పుస్తకాలు:
- భూమిపుండు (ఓపెన్ కాస్ట్ మైనింగ్)
- తెలంగాణలో విద్య (కార్పొరేట్ విద్యకు వ్యతిరేకంగా)
- చెదిరిన చెరువు (తెలంగాణ సమస్యలపై)
- ఫ్లోరోసిస్ (డా|| రాజారెడ్డి రాశాడు)
- నీళ్ళు-నిజాలు (ఆర్. విద్యాసాగర్ రావు)
- తెలంగాణ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యాసాలు (శ్రీధర్ రావు దేశ్ పాండే)
- రాజోలిబండ, తెలంగాణ అభివృద్ధి మిథ్య
- వాస్తవం ఐదేండ్ల కాంగ్రెస్ పాలన (2009 ఎన్నికల సమయంలో)
నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ సమస్యను ఎత్తిచూపుతూ డాక్టర్ రాజారెడ్డిగారు రాసిన ఫ్లోరోసిస్ పుస్తకంను ముద్రించి మిర్యాలగూడ సభలో ఆవిష్కరించింది.
కేంద్ర ప్రభుత్వం రాంచీలో ఉన్న మైనింగ్ యూనివర్సిటీ శాఖను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. ఈ మైనింగ్ యూనివర్సిటీ శాఖను కొత్తగూడెంలో ఏర్పాటు చేయాలని వేదిక పోరాడగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణలోని శాతవాహన యూనివర్సిటీలో మైనింగ్ యూనివర్సిటీశాఖను ఏర్పాటు చేస్తామనిహామీ ఇచ్చింది
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం
- తెలంగాణ ప్రాంతం నుంచి అమెరికా వెళ్ళిన తెలంగాణ ప్రవాస భారతీయులు (ఎన్.ఆర్.ఐ లు) ప్రొ.జయశంకర్ సార్ సలహాపై 1999లో అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంను స్థాపించారు.
- ఈ ఫోరం అధ్యక్షులు – మధు కె.రెడ్డి, ఛైర్మన్ డి.పి.రెడ్డి.
- గల్ఫ్ లోని తెలంగాణ ప్రవాస భారతీయులను చైతన్య పరచడం కోసం 2007లో గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషనను ఏర్పరచడంలో టి.డి.ఎఫ్ తన వంతు పాత్రను నిర్వహించింది.
తెలంగాణ హిస్టరీ సొసైటీ
- తెలంగాణ చరిత్రను వెలుగులోకి తేవాలనే ఉద్దేశ్యంతో 2006 జూన్ లో హైదరాబాద్ లోని ఫతేమైదాన క్లబ్ లో సమావేశం జరిగింది.
- ఈ సదస్సులోనే టి.వివేక్ కన్వీనర్‌గా తెలంగాణ హిస్టరీ సొసైటీ ఆవిర్భవించింది.
ఈ సొసైటీ ప్రచురించిన పుస్తకాలు
- తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం
- 17 సెప్టెంబర్ 1948 భిన్న దృక్కోణాలు
- 1857 పోరాట తిరుగుబాటు
- ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విద్రోహ చరిత్ర
తెలంగాణ చరిత్ర పట్ల అవగాహన కల్పించడానికి ఈ సొసైటీ నిర్వహించిన సదస్సులు:
- నిర్మల్ సదస్సు
- మహబూబ్ నగర్ సదస్సు
తెలంగాణ హిస్టరీ సొసైటీ తెలంగాణ చరిత్ర, సంస్కృతి మొదలగు వాటిని వెలికి తీయడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తనవంతు పాత్రను పోషించింది.
తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్
- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2008 మార్చి లో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఆవిర్భవించింది.
- అధ్యక్షులు : ప్రొఫెసర్ జి. వెంకటరాజం, ఉపాధ్యక్షులు: ప్రొఫెసర్ సయ్యద్ అయూబ్ అలీ
- తెలంగాణకు సంబంధించిన పండుగలు, ఉత్సవాలు, మరుగున పడుతున్న విషయాలను తిరగదోడి ప్రచురించాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ కొనసాగింది.
తెలంగాణ జనపరిషత్
- ఒక వ్యక్తి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పనిచేస్తుంది కావున ఆ పార్టీలో అంతర్గత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అందువల్ల అసలు లక్ష్యం పక్కన పడుతుందని కొంతమంది ప్రజాసంఘాల నాయకులు భావించారు.
- ఇలా భావించిన ప్రజాసంఘాల నాయకులు కేశవరావు జాదవ్ నాయకత్వంలో తెలంగాణ జనపరిషతు స్థాపించారు.
- ఈ జనపరిషత్ యొక్క నినాదం : ‘ఒకే ఆలోచన, ఒకే ఎజెండా, ఒకే జెండా’
- 2006 నుంచి తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటిలో భాగస్వామ్య సంస్థగా తెలంగాణ జనపరిషత్ ఉద్యమించింది.
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్స్
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |