ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని వివిధ గమ్యస్థానాలకు, అలాగే ఇతర దేశాలతో బాగా అనుసంధానించబడి ఉంది. దీనికి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. బంగాళాఖాతం యొక్క సుదీర్ఘ తీరం మరియు అనేక సముద్ర ఓడరేవులతో, ఇది సముద్ర వాణిజ్యంలో కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో విజయవాడలో అతిపెద్ద రైల్వే జంక్షన్‌లు ఉన్నాయి మరియు విశాఖపట్నం ఓడరేవు అతిపెద్ద కార్గో హ్యాండ్లింగ్ ఓడరేవులలో ఒకటి.
ఆంధ్రప్రదేశ్ – రవాణా
- వస్తువులు, ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేర్చడాన్ని రవాణా అంటారు.
- ప్రస్తుత నాగరిక ప్రపంచంలో రవాణా ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఒక దేశంలోని ప్రజల ఆర్థిక సాంఘిక, రాజకీయ జీవన పరిస్థితులు ఆ దేశంలోని రవాణా అభివృద్ధి పై ఆధారపడి ఉంటాయి.
- పరిశ్రమల నుంచి వస్తువులను వినియోగదారులకు సరఫరా చేయడానికి రవాణా తోడ్పడుతుంది.
- రవాణాను నాలుగు రకాలుగా విభజించవచ్చు.అవి:
- రోడ్డు
- రైల్వేలు
- నీటి మార్గాలు
- విమాన మార్గాలు
రోడ్డు మార్గాలు
ప్రయాణికులు, వారి వస్తువులు ఇతరత్రా సామాగ్రిని గమ్యస్థానాలకు చేరవేయాడానికి రోడ్డు మార్గాలు ఉపయోగపడతాయి.
- రహదారులు దేశంలోని రాష్ట్రాలనే కాకుండా ప్రపంచంలోని దేశాలను కూడా కలుపుతున్నాయి.
- రోడ్ల అభివృద్ది కోసం 1943 నాటికి భారతదేశంలో ఎలాంటి పథకం (ప్రణాళిక) లేదు. మొదట రోడ్డు రవాణా అభివృద్ధి ప్రణాళికను 1043లో తయారుచేశారు. దీన్నే నాగపూర్ ప్రణాళిక అంటారు.
నాగపూర్ ప్రణాళిక ముఖ్య ఉద్దేశాలు:
- ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు జిల్లా రోడ్డుకు 2 మైళ్ల దూరంలో, తక్కువ జనాభా ఉన్న గ్రామాలు 5 మైళ్ల దూరంలో ఉండాలి.
- 500 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి ఒక రోడ్డు ఉండాలి.దేశంలో ఇతర రాష్ట్రాలతోపాటు సుదూర ప్రాంతాలకు రోడ్లను విస్తరించాలి. పై విషయాలను దృష్టిలో పెట్టుకుని నాగపూర్ ప్రణాళిక రోడ్లను నాలుగు భాగాలుగా విభజించింది. అవి:
- జాతీయ రహదారులు
- రాష్ట్ర రహదారులు
- జిల్లా పరిషత్ రహదారులు
- గ్రామీణ రహదారులు
APPSC/TSPSC Sure shot Selection Group
జాతీయ రహదారులు
- 22 డిసెంబర్ 2015 నాటికి రాష్ట్రంలో 4913.6 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉన్నాయి
- 2015-16 సామాజిక-ఆర్టిక సర్వే ప్రకారం, రాష్ట్రంలో 24 జాతీయ రహదారులు ఉన్నాయి
- జాతీయ రహదారి మార్గాలు తక్కువగా ఉన్న జిల్లా విజయనగరం 123.33 కి.మీ
- జాతీయ రహదారి మార్గాలు ఎక్కువగా ఉన్న జిల్లా చిత్తూరు 707.33 కి.మీ
- NH 16 రాష్ట్రంలో 1014 కి.మీ దూరం వెళ్తుంది.
క్రమ సంఖ్య | జాతీయ రహదారి సంఖ్య | జాతీయ రహదారి నూతన సంఖ్య | రాష్ట్రంలో జాతీయ రహదారి పొడవు((కి.మీ.లలో) | రాష్ట్రంలో జాతీయ రహదారి వెళ్లే ప్రాంతాలు |
1 | NH-4 | NH-40
(థానే – చెన్నై) ) |
83 | కర్ణాటక సరిహద్దు నుంచి పలమనేరు, చిత్తూరు, నరహరిపేట మీదుగా తమిళనాడు సరిహద్దు వరకు. |
2 | NH-5 | NH-16 (కోల్‌కతా – చెన్నై) | 1014 | ఒడిశా సరిహద్దు ఇచ్చాపురం (శ్రీకాకుళం) నుంచి నరసన్నపేట వరకు, శ్రీకాకుళం,భీమునిపట్నం, విశాఖవట్నం, పత్తిపాడు- రాజమండ్రి, ఏలూరు, హనుమాన్ జంక్షన్, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడురు మీదుగా తమిళనాడు సరిహద్దు వరకు |
3 | NH-7 | NH-44(వారణాసి – కన్యాకుమారి) | తెలంగాణ సరిహద్భు నుంచి కర్నూలు, అనంతపురం, పెనుకొండ మీదుగా కర్ణాటక లోకి ప్రవేశిస్తుంది | |
4 | NH-9 | NH-65(పుణె – మచిలీపట్నం) | మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా తెలంగాణ సరిహద్భ వరకు. | |
5 | NH-18 | NH-40 (కర్నూలు, నంద్యాల, కడప) | 369 | కర్నూలు, నంద్యాలణ కడప, రాయచోటి, చిత్తూరు. |
6 | NH-43 | NH-26
రాయచూర్ – విజయనగరం |
83 | ఒడిశా సరిహద్దు నుంచి సాలూరు – రామచంద్రపురం, విజయనగరం, పాతవలస వద్దNH-5 (16)తో కలుస్తుంది. |
7 | NH-63 | NH-63
అంకోలా-గుత్తి
|
62 | కర్ణాటక సరిహద్దు నుంచి గుంతకల్లు – గుత్తి |
8 | NH-205 | NH-76
(అనంతపూర్-చెన్నై) |
360 | అనంతపురం కదిరి, మదనపల్లి, రేణిగుంట మీదుగా తమిళనాడు సరిహద్దువరకు. |
9 | NH-214 | కత్తిపూడి-కాకినాడ-పామర్రు | 270 | కత్తిపూడి, కాకినాడ, ఆమలాపురం, రాజోలు, శీవకోడు, పాలకొల్లు, భీమవరం, కైకలూరు, గుడివాడ, పామర్రు. |
10 | NH-214(A) | NH-216 NH-214,NH-214(A)రహదారులను కలిపి NH-216గా పిలుస్తున్నారు. | 255 | కత్తిపూడి జంక్షన్ నుంచి కాకినాడ మీదుగా నరసాపురం, మచిలీపట్నం, చల్లపల్లి, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, ఒంగోలు వద్ద NH16లో కలిసి ముగుస్తుంది. |
11 | NH-219 | NH-42
మదనపల్లి-కుప్పం-కృష్ణగిరి |
128 | మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం నుంచీ తమిళనాడు సరిహద్దు వరకు |
12 | NH-221 | 30-విజయవాడ దగ్గర కొండపల్లి నుంచి చత్తీస్‌గఢ్ వరకు. | 155 | ఈ జాతీయ రహదారి విజయవాడ దగ్గర ౫49 కూడలి వద్ద మొదలై కొండపల్లి,మైలవరం, తిరువూరు, పెనుబల్లి, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం,నెల్లిపాక,చింతూరు కొండ చత్తీస్‌గఢ్ వరకు. |
13 | NH-234 | NH-75 | కర్ణాటక సరిహద్దు నుంచి వెంకటగిరి కోట మీదుగా నెల్లూరు వరకు వెళుతుంది |
రాష్ట్ర రహదారులు
రాష్ట్ర రహదారులు జిల్లా ముఖ్య పట్టణాలను రాష్ట్ర రాజధానితో కలుపుతాయి. ఇవి రాష్ట్రం లోతట్టు ప్రాంతంలోని ముఖ్య రహదారులు. రాష్ట్రం అంతటా విస్తరించి ఉంటాయి.
- ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ ఫిబ్రవరి 22, 2016లో నిర్వహించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 14,722 కి.మీ.ల పొడవైన రాష్ట్రీయ రహదారులు (State Highways) ఉన్నాయి.
- రాష్ట్రీయ రహదారులను ‘SH’గా పేర్కొంటారు.
రాష్ట్ర రహదారి సంఖ్య | రహదారి ప్రాంతాలు | జిల్లా |
SH-2 | మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు | గుంటూరు |
SH-7 | దేవరపల్లి (ప.గో. నుంచి తల్లాడ (ఖమ్మం వరకు) | పశ్చిమ గోదావరి |
SH-39 | విశాఖపట్నం, శృంగవరపుకోట, అరకు వరకు | విశాఖపట్నం |
SH-30 | అనంతపురం, తాడిపర్తి ,బుగ్గ | అనంతపురం |
SH-31 | ముద్దనూరు, ఎర్రగుంట్ల, రాజంపేట, కోడూరు (కడప), రేణిగుంట (చిత్తూరు) | కడప, చిత్తూరు |
SH-41 | రాజమహేంద్రవరం- మధురపూడి, కోరుకొండ,రంపచోడవరం మోతుగూడెం | తూర్పు గోదావరి |
SH-42 | సూర్యాపేట, ఖమ్మం (తెలంగాణ), జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం తాదేపల్లిగూడెం, పాలకొల్లు | పశ్చిమ గోదావరి |
SH-43 | ఏలూరు, విజయరాయి, చింతలపూడి | పశ్చిమ గోదావరి |
SH-44 | ఏలూరు, తడికెల పూడి, కామవరపు కోట, జంగారెడ్డిగూడెం | పశ్చిమ గోదావరి |
SH-45 | చీరాల, చిలకలూరిపేట), నరసరావుపేట, పిడుగురాళ్ల | గుంటూరు |
SH-48 | గుంటూరు, పొన్నూరు, బాపట్ల, చీరాల | గుంటూరు |
SH-50 | కర్ణాటక సరిహద్దు నుంచి మదనపల్లి | చిత్తూరు |
జిల్లా రహదారులు
- ఇవి తాలూకా కేంద్రాలను జిల్లాలతో; ఉత్పత్తి ప్రాంతాలు, మార్కెట్ కేంద్రాలను రాష్ట్రీయ
- రహదారులతో, రైల్వే స్టేషన్‌లతో కలిపే రహదారులు.
గ్రామీణ రహదారులు
ఇవి గ్రామాలను, తాలూకా కేంద్రాలు, జిల్లా రహదారులు, ఇతర గ్రామాలతో కలిపే రహదారులు.
- మొదట గ్రామీణ రహదారులు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉండేవి. వాటి ఆలనాపాలనను, ఆర్థికంగా ఈ శాఖ భరించలేకపోవడంతో వీటిని రహదారులు, భవనాల శాఖకు 1908-09లో బదిలీ చేశారు.
- గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
వాహనాలు
డిసెంబరు 31, 2015 నాటికి రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయంలో నమోదైన మొత్తం వాహనాల సంఖ్య 85,05,102 (2014 లో ఈ వాహనాలు 70,02,143 గా ఉన్నాయి).
- మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాలు – 78.19%.
- మొత్తం ద్విచక్ర వాహనాలు – 66,50,311
- ఆటోలు – 4,29,902
- కార్లు – 5,24,429
APSRTC (ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్‌స్‌పోర్ట్ కార్పొరేషన్) లెక్కల ప్రకారం అక్టోబరు 2015 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 11,962 బస్సులు ఉన్నాయి.
- APSRTC లో.
- ఉద్యోగులు – 60,006
- జోన్‌లు – 4
- రీజియన్‌లు – 12
- డిపార్‌ట్‌మెంట్లు – 126
- APSRTC ని 1958లో స్థాపించారు.ప్రారంభంలో కేవలం 5 వేల మంది సిబ్బందితో ఇది మొదలైంది.
రైల్వే మార్గాలు
రవాణా సౌకర్యాలన్నింటిలోనూ రైలు మార్గాల ద్వారా జరిగి రవాణాకు చాలా ప్రాముఖ్యం ఉంది. దేశ ఆర్థికాభివృద్ధికి రైల్వే వ్యవస్థ వెన్నెముక లాంటిది.
- దేశంలో జరుగుతున్న రవాణాలో సుమారు సగం రైల్వేల ద్వారానే జరుగుతోంది.
- భారత దేశ ప్రధాన రైలు మార్గాలైన (1) ఢిల్లీ – మద్రాసు (చెన్నై), (2) కలకత్తా – చెన్నై, (3) బొంబాయి-చెన్నై లైన్లు ఆంధ్రప్రదేశ్ నుంచే వెళుతున్నాయి.
- ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య పారిశ్రామిక కేంద్రాలైన విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి విజయవాడ, మచిలీపట్నం, గూడూరు, తిరుపతి ప్రాంతాలను రైలు మార్గాలతో కలిపారు.
- ఆంధ్రప్రదేశ్‌లో మొదటి రైలు మార్గం చిత్తూరు జిల్లాలోని రేణిగుంట – పుత్తూరు మధ్య 1862లో నిర్మించారు.
- ఆంధ్రప్రదేశ్ రైల్వే నెట్‌వర్‌క్‌ను 3 జోన్ల కింద నిర్వహిస్తున్నారు.అవి;
1) దక్షిణ మధ్య రైల్వే: దీని ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్. రాష్ట్రంలో ఎక్కువ భాగం దీని పరిధిలోనే ఉంది. –
2) దక్షిణ రైల్వే: దీని ప్రధాన కార్యాలయం చెన్నై. పుత్తూరు నుంచి చెన్నై వరకు ఉండే ప్రాంతం ఈ జోన్‌లో ఉంది.
3) తూర్పు తీర రైల్వే మండలం: దీని ప్రధాన కార్యాలయం భువనేశ్వర్. విశాఖ నుంచి ఒడిశా సరిహద్దు వరకు ఈ జోన్ ఉంది.
- రైల్వే గ్యారేజ్ రిసెర్చ్ వర్‌క్‌షాప్ తిరుపతిలో ఉంది.
- విజయవాడ సమీపాన ఉన్న గుంటుపల్లి వద్ద వ్యాగన్ వర్‌క్‌షాప్ ఉంది.
- దక్షిణ మధ్య రైల్వే మొదటి, డబుల్ డెక్కర్ రైలును కాచిగూడ నుంచి గుంటూరు మధ్య 2014 మే 13న ప్రారంభించారు.
- ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ రైల్వే జంక్షన్.
- ఇది భారతదేశంలోనే రెండో పెద్ద జంక్షన్.
- ఈ రైల్వే స్టేషన్ ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని కలుపుతుంది. ఈ రైల్వే జంక్షన్‌లో 10 ప్లాట్‌ఫామ్‌లు, 22 ట్రాక్‌లు ఉన్నాయి.
- ఈ జంక్షన్‌ను 1888లో నిర్మించారు.
- దీని మీదుగా ప్రతిరోజూ దాదాపు 400 రైళ్లు ప్రయాణిస్తాయి.
- ప్రతి నిత్యం ఈ రైల్వే స్టేషన్ నుంచి 1.40 లక్షల మంది ప్రయాణిస్తుంటారు.
- ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4,403 కి.మీ. పొడవైన రైల్వే మార్గాలు ఉన్నాయి.
ఓడరేవులు/జలమార్గాలు
- రాష్ట్రంలో నదులు, కాలువల ద్వారా రవాణాకు అనువైన జలమార్గాలు ఉన్నాయి.
- రవాణా మార్గాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడుకుని ఉన్న రవాణా, అతి ఎక్కువ సరుకులు, సుదూర ప్రాంతాలకు చేరవేసే రవాణా జలమార్గమే.
- ఆంధ్రప్రదేశ్‌లో 14 చిన్నతరహా, మధ్యతరహా ఓడరేవులు; ఒక ప్రధాన ఓడరేవు ఉన్నాయి.
- గుజరాత్ రాష్ట్ర తీరం (1054 కి.మీ.) తర్వాత భారతదేశంలో పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం మనదే.
- ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కి.మీ.
- రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవు విశాఖపట్నం. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది.మిగతా 14 చిన్నతరహా ఓడరేవులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి.
AP Geography PDF in Telugu Chapterwise
విశాఖపట్నం ఓడరేవు
- విశాఖ ఓడరేవు దేశంలోనే అత్యంత లోతయిన సహజసిద్ధమైన ఓడరేవు.
- ఈ ఓడరేవు భారతదేశానికి తూర్పు తీరాన ఉంది.
- ఇది కోల్‌కతాకు 880 కి.మీ. దూరంలో, మద్రాసుకు 780 కి.మీ. దూరంలో ఉంది.
- ఇది చాలా పురాతనమైన ఓడరేవు.
- విశాఖ నగరానికి గొప్ప పారిశ్రామిక నగరంగా గుర్తింపును సంపాదించి పెట్టిన ఉక్కు కర్మాగారం, ఆయిల్ రిఫైనరీ, కోరమండల్ ఎరువుల కర్మాగారం,B.H.P.V. హిందుస్థాన్ జింక్ లాంటి కర్మాగారాలు రావడానికి ఈ ఓడరేవే కారణం.
- ఖనిజాన్ని ఎగుమతి చేసే ముఖ్య ఉద్దేశంతో 1933 లో 70 మిలియన్ రూపాయల ఖర్చుతో ఈ ఓడరేవును నిర్మించారు.
- దేశంలో మరెక్కడా లేని విధంగా విశాఖ ఓడరేవు నిర్మాణానికి ప్రకృతే కొన్ని సదుపాయాలు కల్పించింది.
- డాల్ఫినోస్ పర్వతం సముద్రంలోకి చొచ్చుకువెళ్లి అలల తాకిడి లేకుండా అడ్డుకుంటుంది. అలల తాకిడి లేని ప్రాంతం నౌకలు నిలవడానికి అనుకూలంగా ఉంటుంది.
- ఎల్‌పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్)ను దిగుమతి చేసుకునే సామర్థ్యం ముంబయి ఓడరేవు తర్వాత విశాఖ ఓడరేవుకు మాత్రమే ఉంది.
- ఈ రేవు నుంచి నెలకొకసారి ప్రయాణికుల నౌక పోర్‌ట్‌బ్లెయిర్‌కు వెళుతుంది.
- స్వతంత్ర భారతదేశ మొదటి ఓడ ‘జల ఉష ఇక్కడే తయారైంది
- డాల్ఫినోస్ పర్వతం తూర్పు శిఖరంపై 175 మీటర్ల ఎత్తున లైట్‌హౌస్ ఉంది.
కాకినాడ ఓడరేవు
- కాకినాడ ఓడరేవు ఒక మధ్యతరహా ఓడరేవు
- ఈ ఓడరేవు కాకినాడ జిల్లాలో ఉంది.
- విశాఖపట్నం ఓడరేవుకు, కాకినాడ ఓడరేవు 145 కి.మీ.దూరంలో ఉంది.
- కాకినాడ ఓడరేవు కూడా పురాతనమైన ఓడరేవు.
- ఇది హోప్ ఐలాంద్‌కు 17 కి.మీ. దూరంలో ఉంది.
- ఈ ఓడరేవుకు 8 కి.మీ. దూరంలోనే నౌకలకు లంగరు (నిలపడం) వేస్తారు.
- అక్కడి నుండి చిన్న పడవల ద్వారా సరుకుల ఎగుమతి, దిగుమతి జరుగుతుంది.
- ఈ ఓడరేవు ద్వారా జరిగే ఎగుమతుల్లో కరక్కాయలు, పశువుల కొమ్ములు, తవుడు, నార వస్తువులు, పొగాకు, నువ్వుల పిండి ఎముకల పొడి, పత్తిగింజల నూనె, చింతగింజలు, అల్యూమినియం సల్ఫేటు, మాంగనీసు ఖనిజం లాంటివి ఉన్నాయి.
- దిగుమతుల్లో యూరియా, రాక్ ఫాస్పేట్, డై అమ్మోనియం ఫాస్పేట్ లాంటివి ముఖ్యమైనవి.
- కాకినాడకు 7 కిలోమీటర్ల దూరంలో నక్కెలపూడి వద్ద ఒక లైట్ హౌస్ ఉంది. ఇది కాకినాడ రేవుకు సహాయపడుతుంది.
మచిలీపట్నం ఓడరేవు
- ఈ రేవు ప్రాముఖ్యం తగ్గిపోవడంతో దీన్ని మైనర్ పోర్టుల జాబితాలో చేర్చారు.
- ఈ రేవులో ఒక మత్స్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కృష్ణపట్నం ఓడరేవు
- ఈ ఓడరేవును ఇటీవల నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పరిచారు.
- భారతదేశంలో తొలి గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు ఇది.
- ఈ ఓడరేవును ‘నవయుగ’ అనే కంపెనీ నిర్మించింది.
- అనంతపురం జిల్లాలోని ఓబులాపురంలో లభించే ఇనుప ఖనిజాన్ని ఈ ఓడరేవు నుంచి చైనాకు ఎగుమతి చేస్తారు.| రాష్ట్రంలో ప్రయివేటీకరించిన మొదటి ఓడరేవు (1997).
వాడరేవు ఓడరేవు
ఇది ప్రకాశం జిల్లా చీరాలకు సమీపంలో ఉంది.
గంగవరం ఓడరేవు
విశాఖ ఉక్కు కర్మాగారం స్టాపించినప్పటి నుంచి దీనికి సమీపంలో ఉన్న గంగవరం ఓడరేవు అభివృద్ధికి ప్రతిపాదన వచ్చింది.
- ఇది అత్యంత లోతైన ఓడరేవు (21మీ.)
- 2009 ఏప్రిల్ నుంచి ఇక్కడ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ – వ్యవసాయం
కళింగపట్నం ఓడరేవు
- ఈ ఓడరేవు శ్రీకాకుళానికి 29 కి.మీ. దూరంలో ఉంది.
- ఈ రేవుకు వచ్చిన నౌకలన్నింటికి తీరానికి ౩ కి.మీ. దూరంలో లంగరు వేస్తారు.
- చిన్న పడవలు రేవుకు సరుకులను చేరవేస్తాయి. రసాతల!
- 64 మీ. ఎత్తులో ఒక లైట్‌హౌస్స్ తుపాను హెచ్చరిక కేంద్రం ఉన్నాయి.
- ఇక్కడ రిప్లే (Replay) కంపెనీ గోదాములు ఉన్నాయి.
- ఇక్కడ నుంచి ముఖ్యంగా జనపనార ఎగుమతిని చేస్తారు.
భీముని పట్నం ఓడరేవు
- ఈ ఓడరేవు కూడా విశాఖపట్నం జిల్లాలోనే ఉంది.
- సెప్టెంబరు – ఏప్రిల్ నెలల మధ్య చిన్నసైజు స్టీమర్లు రేవులోకి రావడానికి వీలవుతుంది.
- రిప్లే (Replay) కంపెనీ ఈ ఓడరేవు ద్వారా వ్యాపారం చేస్తుంది.ఈ రేవు కేవలం ఎగుమతులకు మాత్రమే ఉపయోగపడుతుంది.జనపనార, గోగునార, తోళ్లు లాంటి వస్తువులు ఈ ఓడరేవు ద్వారా ఎగుమతి అవుతున్నాయి.
నరసాపురం ఓడరేవు
ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి నది పాయ అయిన వశిష్ట నది మీద ఆధారపడి ఉంది.
- ఇది కూడా పురాతనమైన రేవు పట్టణం
- సముద్ర తీరానికి 7 కి.మీ. దూరంలో పడవలు ఆగుతాయి.
- ఈ రేవు ద్వారా ఎక్కువ వ్యాపారం జరగడంలేదు.
నిజాంపట్నం ఓడరేవు
- ఇది గుంటూరు జిల్లాలో ఉంది.
- ఇవి కాకుండా ముత్యాలపాలెం (విశాఖ), రవ్వ (తూర్పుగో దావరి), మోటుపల్లి (ప్రకాశం) లాంటి చిన్న ఓడరేవులు ఉన్నాయి.విమాన మార్గాలు
విమాన మార్గాలు/వాయు రవాణా
- మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలతో – విశాఖపట్నం, విజయవాడ (గన్నవరం) మరియు తిరుపతి – ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు మరియు కొన్ని విదేశీ గమ్యస్థానాలకు కూడా బాగా అనుసంధానించబడి ఉంది. ఇప్పుడు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, నెల్లూరులోని దగదర్తి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌లలో మూడు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక, ఓడరేవులు, రైలు, హైవేల అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడంలో ప్రధాన పాత్ర పోషించబోతోంది.
- ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించే పర్యాటకులకు మరియు రాష్ట్ర జనాభాకు సేవలను అందిస్తాయి. విశాఖపట్నం విమానాశ్రయం మరియు విజయవాడ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయాలు మరియు వాణిజ్య కారణాల కోసం ప్రధాన దృష్టిని పొందుతాయి. తిరుపతి విమానాశ్రయం ప్రధాన యాత్రికుల జనాభాకు సేవలందించే అంతర్జాతీయ విమానాశ్రయం. దేశీయ విమానాలతో రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాలు కర్నూలు, కడప, పుట్టపర్తి, రాజమండ్రిలో ఉన్నాయి.
అదనపు సమాచారం
- 2015 – 16 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో డిసెంబరు 22, 2015 నాటికి 46,869.60 కి.మీ. పొడవైన రోడ్డు మార్గాలు ఉన్నాయి. వీటిలో 41956 కి.మీ. రోడ్డును రోడ్లు, భవనాల శాఖ నిర్వహిస్తోంది.
- రాష్ట్రంలో జాతీయ రహదారులు 4913.60 కి.మీ. పొడవు ఉన్నాయి.
- రాష్ట్రంలో రాష్ట్రీయ రహదారులు (SH) 6485 కి.మీ. పొడవు ఉన్నాయి.
- జిల్లా రహదారుల పొడవు 19807 కి.మీ.
- గ్రామీణ రహదారుల పొడవు 15664 కి.మీ.
- రాష్ట్రంలో రోడ్ల సాంద్రత ప్రతి 1000 చ.కి.మీ. పరిధిలో 30.70 కి.మీ. రహదారులు ఉన్నాయి.
Download :ఆంధ్రప్రదేశ్ – రవాణా pdf
మరింత చదవండి |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |