ఆధునిక సమాజానికి దూరంగా, ప్రకృతితో మమేకమై, ఆదిమ సంస్కృతిని ఆచరిస్తూ అడవుల్లో జీవిస్తున్నారు గిరిజనులు, తెలంగాణలో అనేక రకాల గిరిజన తిరుగుబాట్లు జరిగాయి, అవి గోండుల తిరుగుబాట్లు, ధర్మారం లంబాడీల తిరుగుబాట్లు, మెండ్రాయి లంబాడీల తిరుగుబాట్లు. తెలంగాణ తిరుగుబాటు అనేది 1946 మరియు 1951 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో మరియు తరువాత హైదరాబాద్ రాచరిక రాష్ట్రానికి చెందిన సామంత ప్రభువులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. పరాయి ప్రాంతాల వారి పెత్తనాలు పెరగడంతో అనేక రకాల దోపిడీలకు గురవడం అనేది కాల క్రమేనా జరుగుతూ వస్తుంది. గిరిజనులు సంస్కృతి, జీవన విధానాలపై దాడులు జరిగాయి. దాంతో వారు తిరగబడ్డారు. వెట్టి చాకిరిని వ్యతిరేకింస్తూ, భూస్వాములు, వడ్డీ వ్యాపారులపై పోరాడారు. ఈ దశలో కొందరు గొప్ప నాయకులు గిరిజనులని నడిపించారు. చివరికి నిజాం, స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాలు దిగి వచ్చాయి. గిరిజనులు సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టాయి.
అసలు ఎవరి గిరిజనులు
భారత దేశంలోని అటవీ, పర్వత ప్రాంతాల్లో గిరిజన సమూహాలు ఎక్కువగా జీవిస్తున్నాయి. మొత్తం దేశ జనాభాలో దాదాపు 7% గిరిజనులు ఉన్నారు. వీరు ఈశాన్య ప్రాంతం, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో నివసిస్తున్నారు. గిరిజనులు ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, జీవన విధానం, ఆచార సంప్రదాయాలన్నీ అటవీ ప్రాంతంలోని అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. వాటితో ముడిపడిన వివిధ సమస్యలపై స్వాతంత్య్రానికి ముందూ, తర్వాత గిరిజనులు అనేక ఉద్యమాలు చేపట్టారు.
గిరిజనులు నాగరిక సమాజానికి దూరంగా ఉంటూ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తున్న వారు. ట్రైబ్ (తెగ) అనే పదం రోమన్ పదం ట్రిబస్ నుండి వచ్చింది. రోమన్ భాషలో ట్రిబస్ అంటే అటవీ/కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలు.
గిరిజనుల జీవన విధానంపై జరిగిన పరిశోధనలు
- లూయిస్ హెన్రీ మోర్గాన్ ప్రపంచంలో మొదటిసారిగా గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు జరిపిన సామాజికవేత్త. పరిశోధనల వివరాలను 1877లో ప్రచురించిన ‘ది ఏన్షియంట్ సొసైటీ’ అనే గ్రంథంలో అందించారు.
- వెన్నెలకంటి రాఘవయ్య భారతదేశంలో గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు చేసిన సామాజికవేత్త. ఈయన గ్రంథం ‘ట్రైబ్స్ ఇన్ ఇండియా’.
- 1778 – 1971 మధ్యకాలంలో 70 వరకు గిరిజన ఉద్యమాలు జరిగాయని ఆయన తన పరిశోధనలో వెల్లడించారు.
- మనదేశంలో అధిక గిరిజన ఉద్యమాలు ఉత్తర, ఈశాన్య భారతదేశంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఇవి ప్రధానంగా రెండు రకాలు.
- స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతుగా
- వెట్టిచాకిరీ వ్యవస్థ, భూస్వాములు, వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా జరిగాయి.
- స్వాతంత్య్రం తర్వాత భారతదేశంలో గిరిజన ఉద్యమం గురించి గ్రంథస్థం చేసినవారు సంజీవ్ బారువా.
- ఇండియా అగైనెస్ట్ ఇట్‌సెల్ఫ్ – అస్సాం అండ్ ద పాలిటిక్స్ ఆఫ్ నేషనాలిటీ
- డ్యూరబుల్ డిజార్డర్ – అండర్‌స్టాండింగ్ ద పాలిటిక్స్ ఆఫ్ నార్త్ – ఈస్ట్ ఇండియా అనే గ్రంథాలు రచించారు.
Adda247 APP
కె.ఎస్.సింగ్ ప్రకారం గిరిజన ఉద్యమాలను ఈయన 3 దశలుగా పేర్కొన్నారు.
- మొదటి దశ: 1795 – 1860 వరకు
- రెండో దశ: 1860 – 1920 వరకు
- మూడో దశ: 1920 – 1947 వరకు
వలస పాలనలో గిరిజన ఉద్యమాలు:
- చుదార్ గిరిజన తిరుగుబాటు (1795-1800)
- కోల్, భంజీ తిరుగుబాటు (1820)
- చోటానాగ్‌పుర్ తిరుగుబాటు (1920)
- సంతాల్ గిరిజనతిరుగు బాటు (1871-1880)
- బిర్సాముండా (ముండా -ఓరాన్ ఉద్యమం) 1869-1895
- అల్లూరి సీతారామరాజు (కోయలు, జాతపుల ఉద్యమం) (1922-1924) 7)
- కొమురం భీం (గోండ్వానా ఉద్యమం) (1938 – 1944).
స్వాతంత్య్రం తర్వాత గిరిజన ఉద్యమాలు
- ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాంతీయ ఉద్యమాలు
- బిహార్‌లోని ఆదివాసీలు – ఝార్ఖండ్ రాష్ట్రం కోసం
- బోడో ఉద్యమం – బోడోలాండ్ రాష్ట్రం కోసం
- గూర్ఖా – గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం.
- గిరిజన వేర్పాటు ఉద్యమం: మిజోరం, నాగాలాండ్, మణిపుర్, త్రిపుర, మేఘాలయలోని ఉద్యమాలు
- నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం.
- ఆదీవాసీల భూ సేకరణ చట్టం-1894: ఈ చట్టం ప్రకారం పునరావాసానికి కావాల్సిన చర్యలు చేట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో ఆదివాసీ ఉద్యమాలు
- క్రీ.శ. 1724లో నిజాం-ఎ-ముల్క్ ముబారిజ్ ఖాన్ ను ఓడించి దక్కనును స్వాధీనం చేసుకుని పరిపాలించడం ప్రారంభించాడు.
- 1773 లో మధోజీ భోంస్లే హైదరాబాదు నిజాం ఆలీ ఖాన్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు, దీని ద్వారా అతను అమరావతి జిల్లా బీరార్ లోని గవిల్ ఘర్ మరియు నార్నాలా కోటలకు బదులుగా పెన్ గంగకు దక్షిణంగా ఉన్న చుట్టుపక్కల భూభాగాలతో మాణిక్ ఘర్ (చంద్రపూర్ రాజురా) ను నిజాంకు అప్పగించడానికి అంగీకరించాడు.
- బ్రిటీష్ వారికి, రెండవ రఘోజీ భోంసలేకు మధ్య జరిగిన యుద్ధం ఫలితంగా, వారు బీరార్ భూభాగాన్ని బ్రిటీష్ వారికి అప్పగించారు, వారు ఒప్పందం మరియు యుద్ధంలో సహకరించే బాధ్యత కింద నిజాంకు అప్పగించారు. పర్యవసానంగా గోండు రాజుల పురాతన స్థానం సిర్పూర్ అసఫ్ జాహీ పాలకుల చేతుల్లోకి వెళ్లింది.
- క్రీ.శ. 1853లో నిజాం, ఈస్టిండియా కంపెనీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది, దీని ప్రకారం నిజాం సేన చేసిన ఖర్చుకు బదులుగా నిజాం బీరార్ మరియు ఇతర జిల్లాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు. నిజాం రాజ్యాల్లోని అన్ని వర్గాల ప్రజలు బీరార్ ను కోల్పోయినందుకు ఎంతో ఆతృతగా భావించారు.
- 1860లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో రాంజీ గోండు నాయకత్వంలో రోహిలాలు, గోండులు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయగా నిర్మల్ లో అప్పటి పాలకులు అణచివేశారు. కొమరం భీము అనే గిరిజనుడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి గిరిజనులను సంఘటితం చేసి, వారి హక్కుల గురించి వారిలో చైతన్యం తీసుకువచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధాల ద్వారా వారి హక్కుల కోసం పోరాడాడు.
- ఈ పోరాటం 1940 లో కొమ్రాన్ భీము మరణించే వరకు కొనసాగింది. ఆదిలాబాద్ చరిత్రలో కొమురం భీముకు ప్రత్యేక స్థానం ఉంది అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఈటెలకు ప్రత్యేక స్థానం ఉంది కొమురం భీము స్మారకార్థం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం పౌర్ణమి రోజున జోడేఘాట్, బాబేఝరి ప్రాంతాల్లో జాతర జరుగుతుంది.
- జిల్లాలో స్వాతంత్ర్య పోరాటం భారత స్వాతంత్ర్యోద్యమంలో అంతర్భాగమైంది. 1920లో మహాత్మాగాంధీ మద్దతుతో ఖైలాఫత్ ఉద్యమం జరిగింది. 1930లో ప్రాతినిధ్య ప్రభుత్వ మంజూరు కోసం తెలంగాణ అంతటా సోదర సంఘాలు/ సంఘాలు ఉద్యమించాయి. క్రీ.శ.1938లో హైదరాబాద్ నిజాం నేతృత్వంలో ప్రజాస్వామిక ప్రభుత్వం కోసం ఉద్యమం జరిగింది.
తెలంగాణలో గిరిజన తిరుగుబాట్లు
- గోండుల తిరుగుబాట్లు
- మెండ్రాయి లంబాడీల తిరుగుబాట్లు
- ధర్మారం లంబాడీల తిరుగుబాట్లు.
గోండుల తిరుగుబాట్లు
- తాము ఘటోత్కచుడి సంతానం అని గోండుల నమ్మకం. గోండుల నివాస స్థలం సంకెనపల్లి (ఆదిలాబాద్). వీరి జీవనాధారం పోడు వ్యవసాయం, అటవీ ఫలాల సేకరణ.
- 1917లో నిజాం ప్రభుత్వం రిజర్వ్ అడవుల చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం గోండుల అధీనంలో ఉన్న భూమిపై ప్రభుత్వానికి హక్కు ఏర్పడింది దానితో గోండుల నిర్వాసితులయ్యారు.
- దీంతో గోండులు సంకెనపల్లి ప్రాంతాన్ని వదిలి సుర్ధాపుర్ అనే గూడెంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అడవులను నరికి పొలాలుగా మార్చుకున్నారు. పంట చేతికి వచ్చేసరికి గోండులను అక్కడి నుంచి తరిమివేయడానికి సిద్ధిఖీ, పట్వారి లక్ష్మణ్‌రావు అనే భూస్వాములు వచ్చారు.
- కొమురం భీం నేతృత్వంలో ప్రజలు తిరగబడి సిద్ధిఖీపై దాడి చేశారు. కొమురం భీంకు బ్రిటిష్ ఇండియాలో సహాయపడిన రహస్య ఉద్యమకారుడు విటోభా.
- కొమురం భీం అస్సాం తేయాకు కూలీల తిరుగుబాటులో కూడా పాల్గొని జైలుకు వెళ్లాడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి గిరిజనులను సంఘటితం చేసి, వారి హక్కుల గురించి వారిలో చైతన్యం తీసుకువచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధాల ద్వారా వారి హక్కుల కోసం పోరాడాడు. ఈ పోరాటం 1940 లో కొమ్రాన్ భీము మరణించే వరకు కొనసాగింది.
కొమరం భీం – తెలంగాణలో గిరిజన ఉద్యమాల ఐకాన్
- గోండు గిరిజనుడైన కొమురం భీం తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్ జిల్లాలో జన్మించాడు. ఈ ప్రాంతాన్ని చందా (చంద్రాపూర్), బల్లాల్పూర్ పాలించడంతో గోండులు జనాభాలో గణనీయమైన భాగంగా ఉన్నారు.
- హైదరాబాద్ లో ఆసిఫ్ జాహీల పాలన చివరి దశ తెలంగాణ ప్రాంత చరిత్రలో మొరటుగా సాగింది. హిందూ ప్రజలు నిజాంల దురుసు ప్రవర్తనకు బలైపోయారు.
- నిజాం ప్రజలపై చెప్పలేని అరాచకాలకు తెరతీశాడు. పన్నులు విపరీతంగా పెంచారు, మహిళలను అవమానించారు, తెలియని కారణాలతో పురుషులను వేధించారు. మొత్తం మీద ప్రజల దోపిడీ నిత్యకృత్యంగా మారింది. తెలంగాణ ప్రాంతంలోని జిల్లాల పేర్లు మార్చారు.
- ఇతర గిరిజన నాయకులు చేసిన త్యాగాలు, మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన షహీద్ భగత్ సింగ్ కథలు కొమరంకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. తనలోని తిరుగుబాటుదారుని మేల్కొల్పడానికి ఇది సరైన ప్రేరణను అందించింది. ‘జల్, జంగిల్ జమీన్’ (అడవుల్లో నివసించే ప్రజలకు అడవిలోని అన్ని వనరులపై పూర్తి హక్కులు ఉండాలి) అనే నినాదం ఇచ్చారు.
- కొమరం భీం తెలంగాణ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. తన ప్రజల విముక్తి కోసం ఆయన చేసిన పోరాటం కేవలం న్యాయం జరగాలనే ఆయన సంకల్పంతోనే రగిలిపోయింది. ఆయన రాజకీయ ప్రేరేపితుడు కాదు, ఇది అతని నిజాయితీని నీరుగార్చడంలో విఫలమైంది.
- కొమరం భీం నిజమైన అర్థంలో తన ప్రజల నాయకుడు. తన ప్రజల విముక్తికి చురుగ్గా నాయకత్వం వహించాడు. ఆయన ప్రారంభించిన ఈ విమోచనోద్యమమే ఇటీవలి కాలంలో ఫలించిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ డిమాండ్ కు బీజం వేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఆయనను తెలంగాణ విమోచనోద్యమానికి ప్రతీకగా భావిస్తారు.
- 01-నవంబర్-2012 (గిరిజన దినోత్సవం) నాడు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై కొమరం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజలందరికీ ఆయన నిజమైన స్ఫూర్తిగా నిలిచారు.
మొండ్రాయి లంబాడీల తిరుగుబాట్లు
- మొండ్రాయి భూస్వామి కడారి నరసింహారావు లంబాడీల భూమిని అక్రమంగా తన పేరు మీద పట్టా చేయించుకున్నాడు.
- దాంతో స్థానిక లంబాడీలు, పక్క గ్రామ ప్రజలు ఏకమై భూస్వామిపై తిరుగుబాటు చేశారు. గురు దయాళ్‌సింగ్ నాయకత్వాన మిలిటరీ సైన్యాలు సాయం రావడంతో మొండ్రాయి లంబాడీల తిరుగుబాట్లు ఆగిపోయింది.
ధర్మారం లంబాడీల తిరుగుబాట్లు
- దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు. హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణా సాయుధ పోరాటంగా పిలుస్తారు.
- దొడ్డి కొమురయ్య మరణంతో ధర్మారం లంబాడీలు ప్రభావితమయ్యారు. ఈ తండా గిరిజనులు ముఖ్తేదారు విసునూరు రాఘవరావుపై తిరుగుబాటు చేశారు. ముఖ్తేదారు అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి పొందారు.
- దీంతో ముఖ్తేదారు రాఘవరావు, బాబు దొర (విసునూరు రాంచంద్రారెడ్డి కుమారుడు) సహాయంతో లంబాడీల తిరుగుబాటును అణచివేశారు. తిరుగుబాటు నాయకుల్లో ఒకరైన జాటోతు హమును, అతడి కుమారులను సజీవదహనం చేశారు. మోహనరెడ్డి, నల్ల నరసింహులు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.
TSPSC Study Notes – Tribal movements in Telangana, Download PDF
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |