తెలంగాణలోని గిరిజన తెగలు
తెలంగాణలో గిరిజనులు: A.P. పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 32 షెడ్యూల్డ్ తెగలు ఉన్నాయి. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ జిల్లాల్లోని ST జనాభా రాష్ట్రంలోని మొత్తం ST జనాభాలో 52.96 % మరియు మిగిలిన 47.04 % గిరిజనులు మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 1976లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడీలను షెడ్యూల్డ్ తెగగా గుర్తించడంతో రాష్ట్రంలో గిరిజనుల సంఖ్య బాగా పెరిగింది. వాల్మీకి బోయలు, ఖైతీ లంబాడీలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించే అంశంపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 2015లో చెల్లప్ప కమిషన్‌ను నియమించింది.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభాలో 9.34% గిరిజన జనాభాను కలిగి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం గోండులు తెలంగాణలోని అత్యంత ప్రముఖమైన ఆదిమ తెగలలో ఒకటి. తెలంగాణలోని 9 జిల్లాలు షెడ్యూల్డ్ ప్రాంతాలను కలిగి ఉన్నాయి. అవి: ఆదిలాబాద్, కొమరంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం & నాగర్ కర్నూల్.
ఇక్కడ మేము TSPSC గ్రూప్‌లు, TS పోలీస్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే తెలంగాణలోని గిరిజనుల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తున్నాము.
APPSC/TSPSC Sure shot Selection Group
తెలంగాణలోని ముఖ్యమైన గిరిజన జాతులు
తెలంగాణ రాష్ట్రంలోని అడవులు, కొండలు, మైదాన ప్రాంతాల్లో లక్షలాది మంది గిరిజనులు నివసిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన భాష, జీవన విధానం, దుస్తులు, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి ఉన్నాయి. వీరిలో చాలా మంది గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ మేము తెలంగాణలోని ముఖ్యమైన గిరిజన జాతులు గురించి చర్చించాము.
లంబాడీలు
- లంబాడీలను బంజారా అని, సుగాలి అని కూడా అంటారు.
- లంబాడీ అనే పదానికి సంస్కృత భాష ప్రకారం లవణం (ఉప్పు) అని అర్థం. ఉప్పును సేకరించి పలు ప్రాంతాలలో అమ్మడం వలన వీరికి లంబాడీలు అని పేరు వచ్చింది.
- బంజారా పదం పర్షియన్ పదమైన ‘బెరింజ్ అరెంజ్’ నుంచి వచ్చిందని పేర్కొంటారు. బెరింజ్ అరింజ్ అనగా వరిడీలర్
- మరికొందరి అభిప్రాయం ప్రకారం బంజర్ అనే పదం సంస్కృతపదమైన బనిజ్ నుంచి వచ్చింది. బనిజ్ అనగా వ్యాపారి అని అర్థం.
- సుగాలీ అంటే మంచి పశుసంపదను కలిగిన వారు అని అర్థం
- బంజారాలను ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ధాన్యం వర్తకులుగా పరిగణిస్తారు.
- తెలంగాణలో లంబాడీలు అతిపెద్ద తెగ. దాదాపు తెలంగాణ రాష్ట్రం అంతా విస్తరించి ఉన్నారు.
- లంబాడీలు వారికే ప్రత్యేకమైన ఆవాసాలతో నివాసాన్ని ఏర్పరుచుకొని గుంపులుగా జీవనం కొనసాగిస్తారు. వీటినే తండాలు అంటారు. సాధారణంగా తండాలు ప్రధాన గ్రామానికి దూరంగా ఉంటాయి.
- పెళ్ళి అయిన లంబాడా మహిళలు ఏనుగుదంతంతో తయారుచేసిన గాజులను మణికట్టు నుండి ముంజేతి వరకు వేసుకుంటారు. దీనిని బలియ (Balia) అని పిలుస్తారు.
- లంబాడీలకు ప్రకృతి ఆరాధన, బహుదేవతారాధన ఎక్కువ. సేవాలాల్ అనే గురువును పూజిస్తారు
- వీరియొక్క సాంప్రదాయ ఉత్సవాలు: తీజ్, సీతాభవాని, తుల్జాభవాని
- పెళ్ళికాని మహిళలు తీజ్ పండుగను గొప్పగా జరుపుకుంటారు
- లంబాడాలకు సాంప్రదాయ కళాకారులు ఉంటారు. వీరిని దప్పన్స్ (Dappans) అంటారు.
- బంజారాలు నిర్వహించే పంచాయితీని నసాబ్, అని అంటారు.
గోండులు
- గోండు అనే పేరు గోండ్వానా నుండి వచ్చింది. దక్షిణభారతదేశం గోండ్వానాలో అంతర్భాగం. ఈ గోండ్వానాలో నివసించే ఒక గిరిజన జాతియే ఈ గోండులు.
- గోండులు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాలలో ఎక్కువగా జీవిస్తారు. గోండుల మొదటి ఆవాసం ఛత్తీస్గడ్ లోని బస్తర్ అని శాస్త్రవేత్తల అభిప్రాయం.
- తెలంగాణ రాష్ట్రంలో గోండులు కొమురం భీం అసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు.
- గోండులు తమకుతాము కోడూర్ లేదా కోయ్ గా గోండీ భాషలో పిలుచుకుంటారు.
- తెలంగాణలోని గోండులలో రాజోండు ప్రముఖమైనవారు.
- గోండులు నాగదేవత, పెర్సిపెన్ అనే దేవతను ఎక్కువగా ఆరాధిస్తారు.
- గోండులు స్థిరవ్యవసాయం చేస్తారు
- గోండులు ఎద్దుకొమ్ములను అలంకారంగా ధరిస్తారు.
- దండారీ పండుగ గోండుల యొక్క ముఖ్యపండుగ.
చెంచులు
- చెంచులు తెలంగాణలో గుర్తించిన మొట్టమొదటి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్.
- చెంచులు ప్రధానంగా నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో, నల్లగొండ జిల్లాలో, నల్లమల అడవులలో నివసిస్తున్నారు.
- చెంచులు ఇప్పపువ్వును ఉడకబెట్టి ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పపువ్వుతో సారా తయారుచేస్తారు.
- శంకు ఆకారంలో ఉండె గుడిసెలను చెంచులు నిర్మించుకుంటారు. సాంప్రదాయ చెంచు ఆవాసాలను పెంట అని పిలుస్తారు.
- చెంచుల ఆరాధ్య దైవం: భైరవుడు, గారెల మైసమ్మ, శ్రీశైలం మల్లిఖార్జునస్వామి
- చెంచులు శ్రీశైల మల్లిఖార్జున స్వామిని వారి అల్లుడిగా భావిస్తారు. అందుకే శివరాత్రి పండుగను పెద్దఎత్తున పుకుంటారు. * ఇప్పటికీ శ్రీశైల దేవస్థానంలో ఒక చెంచు పూజారి ఉంటాడు.
- చెంచుల జాతరలు : ‘సల్లేశ్వరం జాతర’, ‘మల్లెలతీర్థం, మన్ననూరు జాతర, లొద్ది మల్లయ్య జాతర
కోయలు
- కోయజాతి వారు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నివసిస్తున్నారు.
- కోయలు తెలంగాణలో గోదావరి నదికి ఇరువైపులా నివసిస్తున్నారు.
- కోయలు సూర్యచంద్రులను ఆరాధిస్తారు. వీరు కోయదొరలుగా ప్రకటించుకున్నారు.
- కోయలు చిలకజోస్యం బాగా చెబుతారు.
- కోయలు ప్రముఖంగా దొరల సట్టమ్ గా ప్రసిద్ధి.
- కోయల ప్రధాన పండుగలు : సమ్మక్క-సారక్క జాతర, ముత్యాలమ్మ పండుగ
- కోయజనాభా అధికంగా ఉన్న జిల్లాలు:
- భద్రాద్రి కొత్తగూడెం – భద్రాచలం, అశ్వారావుపేట
- జయశంకర్ భూపాలపల్లి – ఏటూరి నాగారం
కోలాములు
- కోలాములను వారి భాషలో కొలావర్లు అని వ్యవహరిస్తారు. వీరు ఎక్కువగా ఆదిలాబాద్ లో నివసిస్తారు.
- వీరినే మన్నేర్ వార్లు అని పిలుస్తారు. మన్నేర్ వార్లు అనగా ‘అడవులలో నివసించే ప్రజలు అని అర్థం’.
- కోలాములు పోడు వ్యవసాయం, స్థిర వ్యవసాయం చేస్తారు. వీరు కోలామీ మాండలికంలో మాట్లడుతారు.
- కోలమ్ తెగలో భర్త చనిపోయినప్పుడు భర్త యొక్క సోదరుడిని వివాహము చేసుకునే ఆచారము ఉంది. ఈ ఆచారాన్నే దేవర వివాహం (Levirate) అంటారు.
- కోలామ్లు జొన్నను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు.
నాయక్ పోడ్లు
- తెలంగాణ (తెలంగాణ)లో గోదావరి నది పరివాహక ప్రాంతంలో వీరు జీవనం సాగిస్తుంటారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం (ఖమ్మం) జిల్లాలో వీరి జనాభా సంఖ్య అధికంగా ఉంటుంది.
- ప్రతి మూడు సంవత్సరాలకొకసారి కొర్రాజుల జాతర (పాండవుల జాతర)ను నిర్వహించడం వారి ఆనవాయితీ. కొయ్యతో చేసిన పాండవుల ముఖతొడుగులనే వారు ఆరాధ్య దేవుళ్లుగా పూజిస్తారు.
- ప్రధానం ఆహారం: జొన్న, రాగి
యానాదిలు
- వీరు ఆంధ్రప్రదేశ్ లో అధికంగా ఉన్నారు. అయితే తెలంగాణ సరిహద్దుల్లో కొందరు నివసిస్తారు.
నక్కల
- నక్కల తెగవారు సంచారజాతివారు. వీరు తెలంగాణలో అక్కడక్కడ విస్తరించి ఉన్నారు.
- తెలంగాణలో వీరిని గువ్వలవాళ్లు, పిట్టలోళ్ళు, శికారీలు అని పిలుస్తారు.
- నక్కల వారి ఇలవేల్పు అయిన స్వామిమూట (మెలియ)ను వీరు వారి వారసత్వ ఆస్తిగా భావిస్తారు.
కొండరెడ్లు
- కొండరెడ్లు తెలంగాణలో ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గోదావరి నదికి ఇరువైపులా అడవులలో, పర్వత ప్రాంతాలలో నివసిస్తున్నారు.
- ప్రధాన వృత్తులు: పోడు వ్యవసాయం, ఆహార సేకరణ, పశుపోషణ.
- కొండరెడ్లు నాగలిని ఉపయోగించరు.
ఎరుకలు
- వీరిని కుర్రు అని కూడా పిలుస్తారు.
- ఎరుకల మహిళలు జ్యోతిష్యం చెబుతుంటారు
- గంపలు, బుట్టలు అల్లడం, తీగల అల్లిక, పందుల పెంపకం వీరియొక్క ప్రదానవృత్తి
Telangana Related Articles
Telangana Music |
Telangana Economy |
Telangana Attire |
Telangana Culture |
Telangana Cuisine |
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |