తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. అక్టోబరు 4న ఫలితాలు వెలువడగానే హైకోర్టు వాటిని రద్దు చేసింది. అయితే.. కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించి, 4 మార్కులను కలిపి మళ్లీ మూల్యాంకనం చేసిన తర్వాత ఫలితాలను ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టాలని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 30న, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం తుది రాత పరీక్ష జరిగినప్పుడు, కొంతమంది అభ్యర్థులు సుమారు 23 ప్రశ్నలపై అభ్యంతరాలు లేవనెత్తుతూ హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన కోర్టు.. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించకపోగా 57 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని.. ఈ నాలుగింటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని ఆదేశించింది.
అయితే.. ఐదు రోజుల క్రితం అంటే అక్టోబర్ 4న పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుల్ తుది ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో 15,750 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇందులో పురుషులు 12,866 మంది, మహిళా అభ్యర్థులు 2,884 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా, వారి అన్ని స్థానాలకు అభ్యర్థుల జాబితా ఇప్పటికే విడుదలైంది. అయితే తాజాగా హైకోర్టు తీర్పుతో మళ్లీ ఫలితాలు వెల్లడి కావాల్సి వచ్చింది. ఈ నాలుగు మార్కులను కలపడం ద్వారా మరికొంత మంది అభ్యర్థులు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది.
APPSC/TSPSC Sure shot Selection Group
తెలంగాణ కానిస్టేబుల్ నియామకాలకు బ్రేక్
తాజాగా జాబితా రూపొందించి నియామక ప్రక్రియ చేపట్టాలి
సివిల్ కానిస్టేబుల్ పోస్టు లకు నిర్వహించిన రాత పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలంటూ హైకోర్టు ఆదేశించింది. వాటిని తొలగించాక జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి జాబితాను ప్రక టించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత నియామక ప్రక్రి యను కొనసాగించాలంటూ సోమవారం తీర్పును వెలువరించింది. 4,965 సివిల్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి గత ఏడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ జారీచేసింది. అనంతరం రాత పరీక్షలను నిర్వహించింది. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్ష ప్రశ్నపత్రంలో ప్రశ్నలను తెలు గులోకి అనువాదం చేయకపోవడంతోపాటు కొన్ని తప్పుగా ఉన్నాయని, వాటిని తొలగించాలంటూ నియా మక మండలికి వినతిపత్రం సమర్పించినా పట్టించుకోక పోవడంతో పలువురు అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా 6 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పి. మాధవీదేవి. విచారణ చేపట్టారు. పిటిషనర్ల రమేశ్ తదితరులు వాదనలు వినిపిస్తూ ప్రశ్నలకు తెలుగులో అనువాదం ఉన్నప్పటికీ ఇవ్వలేదన్నారు. అభ్యర్థులకు ఆంగ్లం అర్ధం కాక ఆ ప్రశ్న లను వదిలేసే పరిస్థితి ఎదురైందన్నారు. కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయన్నారు. ఒక ప్రశ్నలో పారాదీప్ పోర్టు ఆథారిటీకి బదులు ప్రదీప్ పోర్టు అథారిటీ అని ఇచ్చారున్నారు. ఈమేరకు నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలన్నారు.
TSLPRB కానిస్టేబుల్ తుది ఫలితాలు 2023
4 ప్రశ్నలు తొలగించాలని హైకోర్టు TSLPRBను ఆదేశించింది
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వెలువరిస్తూ ప్రశ్నపత్రంలోని 122, 130, 144 ప్రశ్నలను తొలగించాలని ఆదేశించారు. ‘జత పరుచుము’ అంటూ ఇచ్చిన 122వ ప్రశ్నలో రాళ్లలో రకాలు, అవి ఏర్పడే విధానం గురించి ఇచ్చారని, వాటికి తెలుగులో అనువాదం ఇవ్వలేదని న్యాయమూర్తి – ప్రస్తావించారు. రాళ్ల ఏర్పాటుకు సంబంధించి తెలుగులో ఇవ్వడానికి అవకాశం ఉందని, 130వ ప్రశ్నలో పత్తి నుంచి గింజలు వేరుచేయడం, ఏకడం వంటి తెలుగు పదాలున్నా ఆంగ్లంలో స్పిన్నింగ్, గిన్నింగ్, వీవింగ్, నిట్టింగ్ అని ఇచ్చారని, అనువాదం ఇవ్వకుండా ట్రాన్స్ లిటరేషన్ ఇచ్చారని, 144వ ప్రశ్నలో భావోద్వేగాలు, నైపుణ్యాలకు సంబంధించిన ప్రశ్నలో కూడా తెలుగు అనువాదం లేదని, అలాగే 57వ ప్రశ్నలో అచ్చుతప్పు ఉందని పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ప్రశ్నపత్రం రూపొందించడంలో నియామక మండలి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని తప్పు పట్టింది న్యాయస్థానం.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |