TS DSC (TRT) పుస్తకాల జాబితా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి TS TRT DSC నోటిఫికేషన్ 2024 ను ప్రకటించింది. TS DSC నోటిఫికేషన్ 2024లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి 11062 ఖాళీలను విడుదల చేసింది. TS DSC (TRT) నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు ఇది మంచి అవకాశం. అభ్యర్ధులు ఇప్పటి నుండే తమ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ప్రిపరేషన్ లో ముఖ్యమైన భాగం మంచి పుస్తకాలను ఎంచుకోవడం. TS DSC పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులు కోసం ఇక్కడ మేము TS DSC (TRT) పుస్తకాల జాబితాను వివరించాము.
Adda247 APP
TS DSC అవలోకనం
తెలంగాణ ప్రభుత్వం TRT DSC నోటిఫికేషన్ 2024లో 11062 ఖాళీలను విడుదల అయ్యాయి TS TRT DSC అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TS DSC అవలోకనం | |
సంస్థ | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పరీక్ష పేరు | TS TRT | TS DSC |
పోస్ట్స్ | స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ |
TS DSC నోటిఫికేషన్ | 29 ఫిబ్రవరి 2024 |
TS DSC పరీక్ష తేదీ | జులై 17 నుంచి 31, 2024 |
ఖాళీలు | 11062 |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | https://tspsc.gov.in |
TS DSC పుస్తకాలను ఎలా ఎంచుకోవాలి?
TS DSC వ్రాత పరీక్ష కోసం అభ్యర్థులు తప్పనిసరిగా అత్యుత్తమ పుస్తకాలను ఎంచుకోవాలి. రిక్రూట్‌మెంట్ కి ఎంపిక కావడానికి TS DSC పుస్తకాలు & స్టడీ మెటీరియల్ నుండి బాగా అధ్యయనం చేయాలి. TS DSC పరీక్ష యొక్క సిలబస్‌లో సూచించిన అన్ని అంశాలను కవర్ చేసే పుస్తకాలను సూచించాలి.
- TS DSC SGT పుస్తకాలను మీ సమీపంలోని స్థానిక బుక్‌షాప్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు లేదా ప్రామాణికమైన వెబ్‌సైట్‌ల నుండి PDF వెర్షన్‌లలో ఆన్‌లైన్‌లో సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- వ్రాత పరీక్షలో కావలసిన మార్కులు సాధించడానికి అభ్యర్థులు TS DSC సిలబస్‌లో అన్ని అంశాలను కవర్ చేయాలి.
- TS DSC బుక్స్‌తో పాటు, అభ్యర్థులు తమ పనితీరు స్థాయిని పెంచుకోవడానికి మునుపటి సంవత్సరం పేపర్‌లు మరియు మోడల్ పేపర్‌లను తప్పనిసరిగా పరిష్కరించాలి.
TS DSC పుస్తకాల జాబితా
TS DSC TRT పరీక్ష 2024 వివిధ పోస్టుల కోసం CBT మోడ్‌లో ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. మార్కింగ్ విధానం, మార్కుల వెయిటేజీ మరియు సబ్జెక్టుల సంఖ్య పోస్టుల ఆధారంగా మారుతూ ఉంటాయి. TS DSC పుస్తకాల జాబితాను దిగువ పట్టికలో అందించాము.
సబ్జెక్ట్ | పుస్తకం పేరు |
తెలుగు C & M | విశ్వ వాణి |
గణితం |
|
జనరల్ నాలెడ్జ్ | వార్తా పత్రికలు |
ఇంగ్లీష్ |
|
విద్యా దృక్పథాలు | తెలుగు అకాడమీ బుక్స్ |
సైన్స్ అండ్ సోషల్ | ADDA 247 తెలుగు వెబ్సైట్ |
TS DSC ప్రిపరేషన్ చిట్కాలు
- సిలబస్ ని అవగాహన చేసుకోవడం: TS DSC సిలబస్ ను ముందుగా అవగాహన చేసుకోండి తరువాత సిలబస్ ప్రకారం ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ప్రణాళికలో అంశాలను రెండు వర్గాలుగా విభజించుకోండి: ప్రధాన అంశాలు మరియు వెనుకబడిన అంశాలు. ప్రధాన అంశాలలో మునుపటి ప్రశ్న పత్రాలు లేదా వెయిటేజ్ ఉన్న అంశాలను పొందుపరచుకోండి వీటిపై దృష్టి కేంద్రీకరించండి.
- రెగ్యులర్ ప్రాక్టీస్ మరియు రివిజన్: మీ రోజువారీ అధ్యయన షెడ్యూల్ తర్వాత, రివిజన్ కోసం సమయాన్ని కేటాయించండి. రివైజ్ చేస్తున్నప్పుడు, త్వరిత రివిజన్ కోసం కీలక పాయింట్లు మరియు అంశాలను హైలైట్ చేసుకోండి.
- కొన్ని సరళి మనం ఎంత బాగా చదివినా పరీక్ష సమయం లో ఏదో తెలియని భయం ఉంటుంది. ఈ భయాన్నిఎదుర్కొనేందుకు మాక్ టెస్ట్లు లేదా ప్రాక్టీస్ పాపర్లు చేయండి.