Telugu govt jobs   »   TS మెగా DSC నోటిఫికేషన్ 2024   »   TS DSC పరీక్ష తేదీ 2024

TS DSC 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు TS DSC పరీక్ష తేదీలు

TS DSC పరీక్ష 2024

TS DSC పరీక్ష తేదీ 2024: తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష (DSC) తేదీలను విడుదల చేసింది. మొత్తం 11062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి  జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(TRT) పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

TS DSC పరీక్ష తేదీ 2024 అవలోకనం

TS DSC పరీక్ష 2024 తేదీలను అధికారిక వెబ్ సైటు లో విడుదల చేసింది. అభ్యర్ధులకు ఇది మంచి అవకాశంగా తెసుకుని తమ ప్రిపరేషన్ మరింత పెంచాలి. TS DSC పరీక్ష ప్రాథమిక పాఠశాలల్లో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ల(SGT) పోస్టులకు ఏడు రోజు లపాటు పరీక్షలు నిర్వహిస్తారు. ఇక ఉన్నత పాఠశాలల్లో (6-10 తరగతులు) పాఠాలు చెప్పేం దుకు అవసరమైన స్కూల్ అసిస్టెంట్ల(SA) పోస్టులకు మూడు రోజులు జరుపుతారు. PETలకు రెండు రోజులు పరీక్ష ఉంటుంది.

TS DSC పరీక్ష తేదీ 2024 అవలోకనం 
సంస్థ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పరీక్ష పేరు TS TRT | TS DSC
పోస్ట్స్ స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
TS DSC నోటిఫికేషన్ pdf 4 మార్చి 2024
ఖాళీలు 11062
పరీక్ష విధానం ఆన్ లైన్ (CBRT)
TS DSC పరీక్ష తేదీ 2024 జులై 18 నుంచి ఆగస్టు 5, 2024 వరకు
అధికారిక వెబ్సైట్ https://schooledu.telangana.gov.in

TS DSC పరీక్ష తేదీ 2024

TS DSC పరీక్షా కొత్త షెడ్యూల్‌ను తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. TS DSC పరీక్షను తొలిసారిగా ఆన్లైన్ విధానం(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-CBT) కావడంతో రోజుకు రెండు విడతల చొప్పున పరీక్షలు ఉంటాయి. వీటిని ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలకు వరకు నిర్వహిస్తారు. ఈసారి మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోల్చితే దరఖాస్తులకు అదనంగా మరో లక్షమంది కొత్త అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం 11,062 పోస్టులు ఉన్నాయి.

TS మెగా DSC రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదల, 11,062 ఖాళీలకు నోటిఫికేషన్ PDF_30.1

Adda247 APP

TS DSC 2024 పరీక్ష షెడ్యూల్‌

తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (DSC) జులై 18 నుంచి ఆగస్టు 5, 2024 వరకు జరగనుంది. TG DSC 2024 పరీక్ష పూర్తి షెడ్యూల్‌ అధికారిక వెబ్సైటు లో విడుదల అయ్యింది.

  • 18 జులై 2024న మొదటి షిఫ్ట్‌ లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్షను నిర్వహిస్తారు.
  • 19 జులై  నుంచి 22వ తేదీ వరకు వివిధ మాధ్యమాల SGT పరీక్షలు నిర్వహిస్తారు.
  • 20 జులై 2024న SGT, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరుగుతాయి.
  • 22 జులై 2024న స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌
  • 24 జులై 2024న స్కూల్‌ అసిస్టెంట్‌ బయలాజికల్‌ సైన్స్‌
  • 26 జులై 2024న తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు
  • 30 జులై 2024న స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

TG DSC 2024 పరీక్ష విధానం

  • TS DSC పరీక్షను తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) లో నిర్వహిస్తున్నారు. మొత్తం 80 మార్కులకు 160 ప్రశ్నలు ఉంటాయి.
  • రెండు గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది.
  • DSC పరీక్షలో జనరల్ నాల్డెజ్, టీచింగ్ తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్(TS TET) వెయిటేజ్ ఉంటుంది.

TG DSC 2024 పూర్తి పరీక్ష విధానం ఇక్కడ తనిఖీ చేయండి 

pdpCourseImg

TS DSC Related Articles: 
TS DSC నోటిఫికేషన్ 2024 TS DSC DSC మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
TS DSC సిలబస్ TS DSC (TRT) పుస్తకాల జాబితా
TS DSC 2024 అర్హత ప్రమాణాలు TS DSC రిక్రూట్‌మెంట్ కోసం సోషల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ కావాలి?
TS DSC రిక్రూట్‌మెంట్ కోసం టీచింగ్ మెథడాలజీని ఎలా ప్రిపేర్ అవ్వాలి? TS DSC జీతభత్యాలు 2024
TS DSC మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు TS DSC పరీక్ష CBRT మోడ్‌లో మాత్రమే నిర్వహించబడుతుంది.
TS DSC రిక్రూట్‌మెంట్ కోసం సోషల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ కావాలి? TS DSC పరీక్ష కోసం జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి?
TS DSC పరీక్షా విధానం 2024 TS DSC  రిక్రూట్‌మెంట్ కోసం గణితం ఎలా ప్రిపేర్ అవ్వాలి

Sharing is caring!

FAQs

TS DSC పోస్టుల పరీక్ష తేదీలు ఏమిటి?

TS DSC పరీక్ష తేదీలు ఇంకా ప్రకటించలేదు

TS DSC హాల్ టికెట్ 2024ని ఎప్పుడు విడుదల చేస్తారు?

TS DSC కోసం హాల్ టిక్కెట్లు పరీక్ష తేదీకి ఒక వారం ముందు అందుబాటులో ఉంచబడతాయి