TS TRT DSC పరీక్ష
TS TRT DSC నోటిఫికేషన్ 2024 ను 29 ఫిబ్రవరి 2024 న విడుదల చేయబడింది. పాఠశాల విద్యలో 10046 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1016 పోస్టులు విడుదల అయ్యాయి. TS TRT DSC నోటిఫికేషన్ 2024లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి 11062 ఖాళీలను విడుదల చేసింది. అయితే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TRT)ని ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. TS TRT DSC పరీక్ష విధానం కి సంబంధించిన వివరాలు ఇక్కడ అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
TS TRT DSC పరీక్ష విధానం అవలోకనం
TS TRT DSC పరీక్షను (ఆన్‌లైన్ విధానం) కంప్యూటరు బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో నిర్వహించనుంది. TS TRT DSC పరీక్ష విధానం అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TS TRT DSC పరీక్షా విధానం 2024 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పరీక్ష పేరు | TS TRT DSC |
పోస్ట్స్ | స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ |
TS TRT DSC నోటిఫికేషన్ | 29 ఫిబ్రవరి 2024 |
ఖాళీలు | 11062 |
పరీక్షా విధానం | ఆన్ లైన్ (CBRT) |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | https://tspsc.gov.in |
TS TRT DSC పరీక్ష విధానం 2024
TS TRT DSC పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఇటీవలే 11062 ఖాళీల నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మే లేదా జూన్ 2024 లో TS TRT DSC పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రతిసారీ TS TRT DSC పరీక్షా పెన్ను, పేపర్ విధానం (ఆఫ్‌లైన్)లోనే నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు మారిన పరిస్థితుల కారణంగా ఈసారి ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్టు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. TS TRT వచ్చిన మార్కులకు 80 శాతం, టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి జిల్లాలవారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
TS TRT DSC పరీక్ష CBRT విధానంలో ఎందుకు?
ఉన్నత విద్య ప్రవేశాలు మరియు ఉద్యోగ నియామకాల కోసం ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తునారు, ఒక్కో సెషన్‌కు ఒకే ప్రశ్నపత్రంతో ఒకటి లేదా రెండు రోజులు ఉంటాయి. ప్రశ్నాపత్రం కష్టంగా ఉన్నప్పటికీ నార్మలైజేషన్ ప్రక్రియను పాటిస్తుంటారు. TRT వంటి పరీక్షలు జిల్లాస్థాయిలో ఉంటుంది కాబట్టి ఏ జిల్లావారు ఆ జిల్లా పోస్టులకు పోటీపడతారు. దీనివల్ల వివిధ జిల్లాలకు వేర్వేరు రోజుల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ప్రాథమిక పాఠశాల SGT పోస్టుల కోసం, పరీక్ష ఒకే రోజున రెండు దశల్లో జరుగుతుంది, అధిక అభ్యర్థులు ఉంటే, అవసరమైతే మరుసటి రోజు నిర్వహించవచ్చు.
- స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి తెలుగు, ఆంగ్లం, హిందీ, సాంఘికశాస్త్రం తదితర సబ్జెక్టులు ఉన్నందున పూటకు రెండు సబ్జెక్టులు చొప్పున రెండు రోజులు పరీక్షలు నిర్వహించుకోవచ్చు.
- ప్రశ్నపత్రం లీకేజీ లాంటి సమస్యలకు తక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ జరిగినా ఆ జిల్లా వరకు పరీక్షను రద్దుచేసి మరో పూట పెట్టుకోవచ్చు. ప్రశ్నపత్రాల ముద్రణకు ఖర్చు కూడా తప్పుతుంది