TS DSC ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ ఎంపిక
తెలంగాణ విద్యాశాఖ టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం TS DSC 2023 నోటిఫికేషన్ లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ (భాషలు, భాషేతర), లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET),సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం 5089 ఖాళీలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే అక్టోబర్ 28 తేదీన ఆన్ లైన్ దరఖాస్తు గడువు ముగిసింది. తెలంగాణ విద్యాశాఖ అభ్యర్ధులు దరఖస్తు చేసుకున్నప్పుడు ఏమైనా తప్పులు చేస్తే సవరించుకోవడానికి మరొక అవకాశం ఇచ్చింది. తెలంగాణలో డీఎస్సీ(టీఆర్‌టీ)-2023కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు వారు సమర్పించిన వివరాల్లో తప్పులుంటే సవరించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. TS DSC ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ పక్రియ 01 నవంబర్ 2023 నుండి 05 నవంబర్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. TS DSC ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ లింక్ ఇక్కడ అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
TS DSC ఆన్లైన్ దరఖాస్తు సవరణ ఎంపిక అవలోకనం
TS DSC ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ పక్రియ 05 నవంబర్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. TS DSC ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ ఎంపిక అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TS TRT DSC ఆన్లైన్ దరఖాస్తు సవరణ ఎంపిక 2023 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పరీక్ష పేరు | TS TRT | TS DSC |
పోస్ట్స్ | స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ |
TS DSC ఆన్ లైన్ దరఖాస్తు సవరణ ఎంపిక ప్రారంభ తేదీ | 01 నవంబర్ 2023 |
TS DSC ఆన్ లైన్ దరఖాస్తు సవరణ ఎంపిక చివరి తేదీ | 05 నవంబర్ 2023 |
ఖాళీలు | 5,089 |
దరఖాస్తు సవరణ విధానం | ఆన్ లైన్ |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | https://schooledu.telangana.gov.in |
TS DSC ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ ఎంపిక లింక్
తెలంగాణలో DSC 2023కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు వారు సమర్పించిన వివరాల్లో తప్పులుంటే సవరించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు TS DSC ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ ఎంపిక అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తెలిపారు. TS DSC ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ ఎంపిక ప్రారంభమైనది. TS DSC ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ ఎంపిక లింక్ దిగువన అందించాము.
TS DSC ఆన్లైన్ దరఖాస్తు సవరణ ఎంపిక లింక్
TS DSC కి మొత్తం 1,76,527 దరఖాస్తులు
TS DSC మొత్తం 1,76,527 దరఖాస్తులు అందాయి. TS DSC నోటిఫికేషన్ దరఖాస్తు గడువు అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్‌జీటీ), పీఈటీ, భాషా పండితులు, పలు మాధ్యమాల్లో మొత్తం 43 విభాగాల్లో 5,089 కొలువుల భర్తీకి విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించింది. అత్యధికంగా ఎస్‌జీటీ తెలుగు మాధ్యమం కోసం 60,190 దరఖాస్తులు అందాయి.
“నవంబర్ 30, 2023న జరగనున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, 2023 నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన DSC (టీచర్ రిక్రూట్‌మెంట్) పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. తదుపరి పరీక్ష తేదీలు గడువులోగా ప్రకటించబడతాయి. వచ్చే ఫిబ్రవరిలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |