Telugu govt jobs   »   TS మెగా DSC నోటిఫికేషన్ 2024
Top Performing

TS మెగా DSC రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదల, 11,062 ఖాళీలకు నోటిఫికేషన్ PDF

TS మెగా DSC నోటిఫికేషన్ 2024: తెలంగాణ విద్యాశాఖ  టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం TS మెగా DSC 2024 నోటిఫికేషన్ ను 29 ఫిబ్రవరి 2024 న విడుదల అయ్యింది. గతంలో విడుదల చేసిన 5089 ఖాళీల నోటిఫికేషన్ ను రద్దు చేసి 11,062 కొత్త పోస్టులతో TS మెగా DSC 2024 నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ఆయన నివాసంలో విడుదల చేశారు. తెలంగాణ DSC TRT నోటిఫికేషన్ 2024 లో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, PGTలు 182, SGTలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, SGTలు 796 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ మెగా DSC కోసం పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త DSC కి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. TS DSC కి సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ 4 మార్చి 2024 నుండి అధికారిక వెబ్ సైట్లో (https://schooledu.telangana.gov.in/ISMS/) అందుబాటులో ఉంటుంది. తెలంగాణ DSC నోటిఫికేషన్ 2024 కోసం సిద్ధమవుతున్న ప్రభుత్వ ఉద్యోగార్ధులందరికీ ఇది మంచి అవకాశం. ఇక్కడ మేము ఈ కథనంలో TS DSC నోటిఫికేషన్ 2024 వివరాలను మరియు నోటిఫికేషన్ PDFను అందిస్తున్నాము.

TS DSC 2024 నోటిఫికేషన్

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల ననుసరించి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటి ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల ఉద్యోగాలలో నియామకం కొరకు వెబ్సైట్ (https://schooledu.telangana.gov.in) నందు  TS మెగా DSC 2024 నోటిఫికేషన్ ను తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. మే లేదా జూన్‌ నెలలో 10 రోజులపాటు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. B.Ed, DED, BPEDలో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా TS DSC  పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టెట్‌ పరీక్షలోనూ అర్హత సాధించి ఉండాలి. మరిన్ని వివరాలు ఈ కధనంలో చదవండి.

TSPSC గ్రూప్ 1 ఎంపిక విధానం 2024_30.1

Adda247 APP

TS DSC నోటిఫికేషన్ 2024 అవలోకనం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి TS మెగా DSC నోటిఫికేషన్‌ 2024 ను ప్రకటించింది. టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం లక్షలాది మంది తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు, ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. దిగువ పట్టికలో  TS  నోటిఫికేషన్‌ 2024 కు అవలోకనం దిగువ పట్టికలో తనిఖీ చేయండి

TS DSC నోటిఫికేషన్ 2024 అవలోకనం 
సంస్థ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పరీక్ష పేరు TS TRT | TS DSC
పోస్ట్స్ స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
TS మెగా DSC నోటిఫికేషన్ 29 ఫిబ్రవరి 2024
TS మెగా DSC నోటిఫికేషన్ pdf 4 మార్చి 2024
ఖాళీలు 11,062
దరఖాస్తు విధానం ఆన్ లైన్
ఉద్యోగ ప్రదేశం తెలంగాణ
అధికారిక వెబ్సైట్ https://schooledu.telangana.gov.in

TS TRT DSC నోటిఫికేషన్ 2024 PDF

TS DSC నోటిఫికేషన్ pdf 2024: TS మెగా DSC నోటిఫికేషన్ 2024కు సంబంధించిన ప్రకటన విడుదల చేయబడింది. TS DSC కి సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ PDF అధికారిక వెబ్ సైట్లో https://schooledu.telangana.gov.in/ISMS/ అందుబాటులో ఉంది. అధికారిక నోటిఫికేషన్ వివరాలు మరియు రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రక్రియను కలిగి ఉంటుంది. అధికారిక TS DSC TRT నోటిఫికేషన్‌ 2024 ను డౌన్‌లోడ్ చేయడానికి లింక్ ఇక్కడ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.

TS TRT DSC నోటిఫికేషన్ 2024 PDF 

TS TRT DSC ముఖ్యమైన తేదీలు 2024

TS TRT DSC పరీక్ష తేదీలు 2024: TS DSC TRT ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ ప్రారంభమవుతుంది. అన్ని TS TRT ముఖ్యమైన తేదీలు ఇక్కడ నవీకరించబడతాయి.

TS TRT DSC ముఖ్యమైన తేదీలు 2024
ఈవెంట్స్ తేదీలు 
TS DSC నోటిఫికేషన్  ప్రకటన 29 ఫిబ్రవరి 2024
TS DSC నోటిఫికేషన్ PDF 4 మార్చి 2024
TS DSC 2024 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 4 మార్చి 2024
ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ 3 ఏప్రిల్ 2024
ఆన్‌లైన్ దరఖాస్తుల ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 2 ఏప్రిల్ 2024
TS DSC 2024 పరీక్ష తేదీలు మే లేదా జూన్‌ 2024
TS TRT DSC 2024 హాల్ టికెట్

TS DSC అర్హత ప్రమాణాలు

తాజా TS TRT నోటిఫికేషన్‌ 2024 యొక్క అర్హత ప్రమాణాలు వయస్సు, విద్యార్హత పరంగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు అర్హత సాధించడానికి అభ్యర్థులు కొన్ని నిబంధనలను కలిగి ఉండాలి .అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేని అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నుండి తిరస్కరించబడతారు.

Nationality 

1.అభ్యర్థి భారతీయ జాతీయత కలిగి ఉండాలి.

2. అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి మరియు స్థానిక / స్థానికేతర స్థితిని తెలిసి ఉండాలి.

TS DSC విద్యా అర్హతలు

TS TRT నోటిఫికేషన్‌ 2024 యొక్క అర్హత ప్రమాణాలు (విద్యా అర్హతలు పోస్టుల వారీగా) ఇక్కడ అందించాము.

పోస్ట్  విద్యా అర్హతలు 
1. స్కూల్ అసిస్టెంట్లు అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి B.Edతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
2. సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థి 2-సంవత్సరాల D.Ed కోర్సుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా NCTEచే గుర్తింపు పొందిన దానికి సమానమైన సర్టిఫికేట్ ఉండాలి.
3. భాషా పండితులు అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / కళాశాల నుండి B.Edతో డిగ్రీ (తెలుగు / హిందీ / ఉర్దూ / కన్నడ / ఒరియా / తమిళం / సంస్కృతం) పూర్తి చేసి ఉండాలి.
4. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అభ్యర్థి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి మరియు NCTEచే గుర్తించబడిన ఫిజికల్ ఎడ్యుకేషన్ (U.G.D.P.Ed.)లో గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ మరియు NCTEచే గుర్తించబడిన B.P.Ed లేదా M.P.Ed. పూర్తి చేసి ఉండాలి.

TS DSC వయోపరిమితి

తెలంగాణా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1వ తేదీ నాటికి 18-44 ఏళ్లు ఉండాలి.

  • కనీస వయో పరిమితి:  18 సంవత్సరాలు
  • గరిష్ట వయో పరిమితి:  44 సంవత్సరాలు
 వయో సడలింపు
శారీరక దివ్యాంగులుకు 10 సంవత్సరాలు
SC/ST, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు
మాజీ సైనికోద్యోగులకు 3 సంవత్సరాలు &సాయుధ దళాలలో చేసిన సర్వీస్ కాలం

TS DSC నోటిఫికేషన్ 2024 ఖాళీలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 11062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. DSC TRT నోటిఫికేషన్ 2024 లో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, PGTలు 182, SGTలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, SGTలు 796 పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ TS DSC ద్వారా భర్తీ చేయనున్నారు.

TS DSC నోటిఫికేషన్ 2024 ఖాళీలు
స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629
భాషా పండితులు 727
PGTలు 182
SGTలు 6,508
ప్రత్యేక కేటగిరీలో
స్కూల్‌ అసిస్టెంట్‌ 220
SGTలు 796

TS DSC 2024 దరఖాస్తు రుసుము

TS TRT రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

  • దరఖాస్తు రుసుము- ఒక్కొక్క ఉద్యోగానికి దరఖాస్తు ప్రాసెసింగ్ మరియు వ్రాత పరీక్ష కొరకు చెల్లించాల్సిన ఫీజు రూ. 1000/- ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోదల్చిన అభ్యర్థులు ప్రతి ఉద్యోగం కొరకు వేర్వేరుగా రూ.1000/-లను చెల్లించి, దరఖాస్తు చేసుకుంటున్న ప్రతి ఉద్యోగం కొరకు వేర్వేరు దరఖాస్తును దాఖలు చేయవలెను.
  • ఫీజు చెల్లింపు విధానం వెబ్సైట్ https://schooledu.telangana.gov.in నందు 20.09.2024 నుండి 20.10.2024 వరకు లభించే పేమెంట్ గేట్వే లింక్ ద్వారా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు/నెట్-బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా ఆన్లైన్ చెల్లించి, దరఖాస్తులను 20.09.2024 నుండి 28.10.2024 వరకు దాఖలు చేయవచ్చును.

TS TET / CTET క్వాలిఫైయింగ్ మార్కులు

TET Name Maximum Marks Qualifying Marks
OC BC SC/ST/Differently Abled
AP TET/TS TET 150 90 75 60
CTET 150 90 75 60

TS TRT DSC 2024 సిలబస్

TS TRT DSC 2024 సిలబస్: అభ్యర్థులు ఇక్కడ రిక్రూట్‌మెంట్ టెస్ట్ కోసం సిలబస్‌ని తనిఖీ చేయవచ్చు. పరీక్షను విజయవంతంగా క్లియర్ చేయడానికి అభ్యర్థులు సిలబస్ ద్వారా వెళ్లడం చాలా అవసరం. TS TRT సిలబస్ దీనికి సంబంధించిన అంశాలను కలిగి ఉంటుంది:

  • General Knowledge & Current Affairs
  • Perspective in Education
  • Teaching Methodology

TS TRT DSC Syllabus PDF

TS DSC Related Articles: 
TS DSC సిలబస్
TS DSC DSC మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
TS DSC 2024 అర్హత ప్రమాణాలు
TS DSC పరీక్షా విధానం 2024
TS DSC (TRT) పుస్తకాల జాబితా
TS DSC రిక్రూట్‌మెంట్ కోసం టీచింగ్ మెథడాలజీని ఎలా ప్రిపేర్ అవ్వాలి?
TS DSC రిక్రూట్‌మెంట్ కోసం సోషల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ కావాలి?
TS DSC జీతభత్యాలు 2024

TS TRT (SGT) Exam 2023 Free Test Series | Online Test Series By Adda247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

TS మెగా DSC రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదల, 11,062 ఖాళీలకు నోటిఫికేషన్ PDF_5.1

FAQs

టీఎస్ టీఆర్టీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేశారు?

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11062 పోస్టుల భర్తీకి TS DSC (TRT) రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ విడుదల అయ్యింది

టీఎస్ TRT నోటిఫికేషన్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

TS TRT నోటిఫికేషన్ 2023లో 11062 ఖాళీలు ఉన్నాయి

TS DSC రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ అప్లికేషన్ 2023 ప్రారంభ తేదీ ఏమిటి

TS DSC రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ అప్లికేషన్ 2023 ప్రారంభ తేదీ ఫిబ్రవరి లో ఉంటుంది

TS TRT నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

TS TRT నోటిఫికేషన్ ఈ కధనం నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.