Telugu govt jobs   »   TSPSC Group 4   »   TSPSC గ్రూప్ 4 చివరి 10 రోజులు...
Top Performing

TSPSC గ్రూప్ 4 చివరి 10 రోజులు ప్రిపరేషన్ వ్యూహం, పరీక్ష హాలులో పాటించవలసిన సూచనలు

TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC గ్రూప్ 4 పరీక్షను నిర్వహిస్తుంది. TSPSC గ్రూప్ 4 2022 ప్రిలిమ్స్ పరీక్ష 1 జూలై 2023న షెడ్యూల్ చేయబడింది, TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023కి కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. TSPSC గ్రూప్ 4 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు TSPSC గ్రూప్ 4 పరీక్ష ప్రిపరేషన్ ను ఇప్పటికే మొదలు పెట్టి ఉంటారు, అయితే ఈ చివరి 10 రోజులు TSPSC గ్రూప్ 4 పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ అంశాలు చదవాలి అనే విషయంలో గందరగోళంగా ఉండి ఉంటారు. TSPSC గ్రూప్ 4 అడ్మిట్ కార్డ్‌ను పరీక్ష కి వారం ముందు తన అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.in లో విడుదల చేస్తుంది. ఇప్పటివరకు ప్రిపేర్ అయిన అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు తుది మెరుగులు దిద్దే విధానాన్ని తెలుసుకుందాం.

TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023

TSPSC ఇప్పటివరకు నిర్వహించిన  గ్రూప్-1 ప్రిలిమ్స్, AEE, అగ్రికల్చర్ ఆఫీసర్, డ్రగ్ ఇన్స్పెక్టర్.. మొదలైన పరీక్షలను గమనిస్తే ప్రశ్నల చాలా కష్టంగా ఉన్నాయి, TSPSC గ్రూప్ 4 పరీక్షలో ప్రశ్నల రకాలు ఎలా ఉంటుంది అనే ఆందోళన అభ్యర్థులందరిలో కనిపిస్తోంది. ఇప్పటివరుకు జరిగిన అన్ని TSPSC పరీక్షలో అన్ని సబ్జెక్టులనూ తగిన మోతాదులో ఇచ్చారు. అదే ధోరణి పునరావృతం అవుతుందని భావించవచ్చు. ఇలాంటి ఆందోళనకు ఈ కొద్దిరోజుల సమయంలో ఏమాత్రం అవకాశం ఇచ్చినా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఒత్తిడీ లేకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరైతే సగం విజయం సాదించినట్లే.

Attempt TSPSC Group 4 Free Mock test For Paper 1 and Paper 2

TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 ప్రిపరేషన్ చిట్కాలు

TSPSC గ్రూప్ 4 పరీక్ష కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ప్రశ్న ప్రతి అభ్యర్థికి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు భారీ సంఖ్యలో ఉన్నారు. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి చాలా నిబద్ధత మరియు ఏకాగ్రత అవసరం. కాబట్టి, మీరు అంకితభావంతో సిద్ధమవుతున్నట్లయితే మరియు TSPSC గ్రూప్ 4 పరీక్ష కి ఎలా ప్రిపేర్ కావాలో తెలుసుకోవడానికి ఈ క్రింది చిట్కాలను చదవండి.

  • ముందుగా, TSPSC గ్రూప్ 4 పరీక్షా సరళిని అర్థం చేసుకోండి: గ్రూప్ 4 పరీక్ష TSPSCకి ఎలా ప్రిపేర్ కావాలో తెలుసుకోవడంలో ప్రధానమైన దశ పరీక్షా సరళిని పూర్తిగా అర్థం చేసుకోవడం. TSPSC గ్రూప్ 4కి  కేవలం రాత పరీక్ష ద్వారానే ఎంపిక చేస్తారు. TSPSC గ్రూప్ 4 లో రెండు పేపర్లలో ఒక్కొక్కటి 150 మార్కులకు ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా రెండు పేపర్లో ఉత్తీర్ణత సాదించాలి.
  • TSPSC గ్రూప్ 4 సిలబస్‌ని తనిఖీ చేయండి: మీ ప్రిపరేషన్ ను ప్రారంభించే ముందు మీరు TSPSC గ్రూప్ 4 పరీక్ష కోసం సిలబస్‌ను పూర్తిగా తనిఖీ చేయడం ముఖ్యం. ఇది కఠినమైన అంశాలను మరియు సులువైన అంశాలను సరిగ్గా గుర్తించడంలో మీకు సహాయం చేస్తుంది. ఆ తర్వాత అంశాలలో ఏవి క్లిష్టంగా ఉన్నాయో నోట్ చేసుకోండి.
  • సరైన TSPSC గ్రూప్ 4 పరీక్షా అధ్యయన ప్రణాళికను సిద్ధం చేయండి: మీరు TSPSC గ్రూప్ 4 పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనుకుంటే తప్పనిసరిగా  అధ్యయన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. మీరు మీ రోజువారీ పనులకు తగిన షెడ్యూల్‌ని రూపొందించుకోవాలి.
  • ఉత్తమమైన TSPSC గ్రూప్ 4 మోక్ టెస్ట్ లు ఎక్కువగా ప్రయతించండి: మీరు ఇప్పటివరకు చదువిన అన్ని అంశాల మీద మోక్ టెస్ట్ లు, క్విజ్ లు రాయండి.

TSPSC GROUP-4 Paper-1 and Paper-2 Grand Tests 2023 in English and Telugu by Adda247

TSPSC గ్రూప్ 4 పరీక్ష చివరి 10 రోజులు చిట్కాలు

ప్రతి అభ్యర్థికి చివరి 10 రోజులలో ప్రిపరేషన్ చాలా కీలకం. అభ్యర్థులకు సహాయం చేయడానికి, మేము చివరి 10 రోజులలో TSPSC గ్రూప్ 4 పరీక్ష ప్రిపరేషన్ చిట్కాలను అందించాము.

  • కొంతమంది అభ్యర్థులు చివరిరోజు వరకు ‘అది చదవాలి. ఇది చదవాలి’ అని ఆందోళనకు గురవుతూనే ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు.
  • కొత్త కొత్త విషయాలను చదివే ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టాలి, కొత్త అంశాలు ఏవీ చదవవద్దు.
  • ఇప్పటివరకు మీ ప్రేపరషన్ లో భాగంగా తాయారు చేసుకున్న రన్నింగ్ నోట్స్ మరియు హైలైట్ చేసిన పాయింట్లను రివైజ్ చేయండి
  • ముఖ్యమైన తేదీలు, రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ అంశాలు, జనాభా గణాంకాలు, కరెంటు అఫైర్స్ మరియు స్టాటిక్ GK వంటి అంశాలను రివైజ్ చేయండి
  • తెలంగాణ విధానాలు, తెలంగాణ భౌగోళిక అంశాలు, చారిత్రక సాంస్కృ తిక అంశాలు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం, ఆర్ధిక వ్యవస్థ మొదలైన విభాగాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీలైతే ఈ కొద్ది రోజుల్లో విహంగ వీక్షణ అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • మునుపటి పేపర్లలో పునరావృతమయ్యే అంశాలు/ప్రశ్నలను తెలుసుకోండి
  • తెలంగాణా రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా పేపర్ లికేజి వ్యవహారం మీద చాలా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి, అవి అని పట్టించుకోకండి, సోషల్ మీడియాలో వచ్చే సమాచారానికి దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉండాలి
  • పరీక్షలకు హాజరయ్యేటప్పుడు కనీసం వారం రోజులు ముందు నుంచీ తగినంత నిద్ర తగినంత నిద్ర, మంచి ఆహారం తెసుకోవడం ద్వారా మెదడు ప్రశాంతగా ఉండి, పరీక్షా సమయంలో అన్ని అంశాలు గుర్తుకువస్తాయి.

Attempt Free Mock Test For TSPSC Group 4 Paper 1 & 2_40.1APPSC/TSPSC Sure shot Selection Group

పరీక్ష హాలులో పాటించవలసిన సూచనలు

  • పరీక్ష పర్యవేక్షణాధికారి ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
  • అభ్యర్థులు తమ వివరాలను పర్యవేక్షణాధికారి ఆదేశించిన రీతిలో నమోదు చేసుకోవాలి. హాల్ టికెట్ నంబర్, పరీక్షా పత్రం కోడ్ లాంటివి OMR షీట్ మీద రాసే ముందు చాలా జాగ్రతగా, ఏకాగ్రత ఉండాలి. ఒకసారి తప్పు గ రాస్తే, మీ OMR షీట్ లెక్కించబడదు.
  • సమాదానాలను గుర్తించే సందర్భంలో మొదట తెలిసిన సమాధానాలు అన్ని గుర్తించుకుంటూ వెళ్లి తర్వాతి రౌండ్లో నమ్మకం ఉన్న సమాధానాన్ని గుర్తించడం మంచిది.
  • తెలిసిన సబ్జెక్టు ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయి అనే వెతుకులాట వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. వరుస క్రమంలో సమాధానాలు గుర్తించుకుంటూ వెళ్లటమే మంచిది.

TSPSC గ్రూప్ 4 పరీక్షలో జంబ్లింగ్

ప్రభుత్వ పోటీపరీక్షలకు నిర్ణీత ప్రశ్నలను జంబ్లింగ్ చేసి ఇప్పటివరకు A, B, C, D సిరీస్ ల పేరిట నాలుగు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. నాలుగుకు మించి వీలైనన్ని బహుళ సిరీస్ లు వచ్చేలా ప్రశ్నపత్రాలను కమిషన్ సిద్ధం చేసింది. ఎంపిక చేసిన ప్రశ్నలకు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ తో సాధ్యమైనన్ని దఫాలుగా జంబ్లింగ్ చేసి, ఎక్కువ సంఖ్యలో సిరీస్ ల ప్రశ్నపత్రాలను ముద్రించింది. ఈ మేరకు A, B, C, D సిరీస్ ల స్థానంలో ఆరంకెల ప్రశ్న పత్రం నంబరుతో ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు ఇవ్వనుంది. అభ్యర్థులు ఆరంకెల సిరీస్ తో కూడిన ప్రశ్నపత్రం కోడ్ ను OMR షీట్ లో నమోదు చేసి, ఆ మేరకు వృత్తాల్ని బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో బబ్లింగ్ చేయాలని కమిషన్ తెలిపింది. ప్రశ్నపత్రం బుక్ లెట్ సిరీస్ నంబరు OMRలో రాసి, వృత్తాల్ని సరిగా బబ్లింగ్ చేయకున్నా, వృత్తాల్ని సరిగా నింపి బుక్లెట్ సిరీస్ నంబరు రాయకున్నా.. ఒక్క అంకెను తప్పించినా ఆ OMR ను మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకోబోమని వెల్లడించింది.

కమిషన్ OMR షీట్ బబ్లింగ్ చేస్తున్నప్పుడు జరిగే సాధారణ తప్పులకు సంబంధించిన సూచనలు నమూనా OMRషీట్‌ను తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చింది. అభ్యర్థులు OMR షీట్ ను తనిఖీ చేయవచ్చు.

 

Attempt Free Mock Test For TSPSC Group 4 Paper 1 & 2_60.1

 Adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

TSPSC గ్రూప్ 4 చివరి 10 రోజులు ప్రిపరేషన్ వ్యూహం, సూచనలు_6.1

FAQs

TSPSC గ్రూప్ 4 ఎంపిక ప్రక్రియ ఏమిటి?

TSPSC గ్రూప్ 4 ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.

TSPSC గ్రూప్ 4 పరీక్ష తేదీ ఏమిటి?

TSPSC గ్రూప్ 4 పరీక్ష 1 జూలై 2023న జరగనుంది