Telugu govt jobs   »   Article   »   TSPSC Exam Paper Leak
Top Performing

TSPSC Exam Paper Leak, Know More Details | TSPSC పరీక్ష పేపర్ లీక్ అయ్యింది

TSPSC Exam Paper Leak

TSPSC Exam Paper Leak: The Telangana State Public Service Commission (TSPSC) Postponed the TSPSC TPBO and TSPSC Veterinary Assistant Surgeon exams on suspicion of exam paper hacking.  TSPSC has announced the postponement of the TSPSC TPBO (Town Planning Building Overseer) written exam scheduled on March 12, 2023, and the TSPSC Veterinary Assistant Surgeon written exam scheduled on March 15 and 16. It has been clarified that the new dates of the postponed exams will be announced soon.

TSPSC Exam Paper Leak 2023

ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీక్‌లో అంతర్గత వ్యక్తి పాత్రపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. TSPSC సెక్రటరీకి పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నిందితుడు ప్రవీణ్ కుమార్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న తన మహిళా స్నేహితురాలికి సహాయం చేసేందుకు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (TPBO) రాత పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు.

TBPO Paper Leak

TSPSC ఉద్యోగి ప్రవీణ్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్‌, పేపర్‌ లీకేజీ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడితో సహా ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంజినీర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న ప్రవీణ్ ప్రధాన నిందితుడు. అతడితో కలిసి మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ కలిసి ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. కంప్యూటర్లలోని ప్రశ్నాపత్రాలను ప్రవీణ్ తన పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకున్నాడు. రేణుక అనే మహిళ ద్వారా ఇద్దరు అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. దీని కోసం వారి నుంచి రూ.13.5 లక్షలు తీసుకున్నారు.” అని పోలీసులు వివరించారు.

Telangana State GK MCQs Questions And Answers in Telugu |_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్నపత్రాలను కమిషన్ ఇటీవల సిద్ధం చేసింది. ఇవన్నీ డిజిటల్ ఫార్మాట్లో కమిషన్ కార్యాలయంలోని ఒకరిద్దరు అధికారుల కంప్యూటర్లలో ఉంటాయి. వాటికి USER ID, పాస్వర్డులు ఉంటాయిు. ఇతరులు తెరిచే అవకాశం లేదు. కానీ, కార్యదర్శి PA కావడంతో ప్రవీణ్ కు వీటి గురించి కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది. కార్యాలయం లో ఇటీవల కంప్యూటర్లు అన్ని అప్ గ్రేడ్  చేశారు. ఆ సమయంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ USER ID, పాస్వర్డ్ ను  TSPSCలో పనిచేస్తున్న ఒక  ఉద్యోగి ఒకర దొంగిలించినట్లు అనుమానిస్తున్నారు. TS ఉద్యోగి, సిస్టమ్ అనలిస్టు రాజశేఖర్ సాయంతో కార్యదర్శి సెక్షన్ ని కంప్యూటర్ ద్వారా లాగిన్ అయిన ప్రవీణ్ ప్రశ్నపత్రాల్లోని సమాచారాన్ని సేకరించి.. వాట్సప్ ద్వారా ఉపాధ్యాయినికి చేరవేశాడు. తాజాగా అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష కూడా లీకైందని పోలీసులు తేల్చడంతో టీఎస్ పీఎస్సీ పరీక్షల వ్యవహారంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

తాజాగా పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్ష ప్రశ్నపత్రాలు మాత్రమే కాకుండా మార్చి 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ క్వశ్చన్‌ పేపర్‌ కూడా లీకైనట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు దర్యాప్తులో బయటపడింది. దీంతో అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షను TSPSC రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
యువతి కోసం TSPSC ఉద్యోగి ప్రవీణ్ పేపర్ లీక్‌ చేస్తే.. ఆమె మాత్రం బయట క్వశ్చన్‌ పేపర్‌లను బేరానికి పెట్టింది. ఒక్కొక్కరికి రూ.14 లక్షల చొప్పున ముగ్గురికి ప్రశ్నాపత్రాలను అమ్మినట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన ముగ్గురు అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరో వైపు యువతి తమ్ముడు తన కోసమే ఇదంతా చేసిందని చెబుతుంది. పోలీసులు TSPSC పరీక్ష పేపర్ లీక్ ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు.

TSPSC TPBO Exams Postponed

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC ) పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అవ్వడం రాష్ట్రంలో సంచలనం అయిన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీకి సంబంధించిన సర్వర్ హ్యాక్ అవ్వడం వల్లే ఇలా జరిగిందని, పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయించారు. మార్చి 12, 2023న జరగాల్సిన TSPSC TPBO (టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్) రాత‌ ప‌రీక్ష మరియు మార్చి  15, 16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ రాత‌ ప‌రీక్షను వాయిదా వేస్తున్నట్లుగా TSPSC ప్రకటించింది. ఈ మేరకు కమిషన్‌ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. వాయిదా పడ్డ పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

UPSC EPFO Complete Foundation Batch (2023-24) Enforcement Officer Target Batch By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

TSPSC Exam Paper Leak, Know More Details_5.1

FAQs

when will conduct TSPSC TPBO exam 2023?

The TSPSC postponed the TSPSC Town Planning Building Overseer (TPBO) exam. New exam dates will be Updated Soon