TSPSC Group 1 Exam 2024: The Telangana Public Service Commission (TSPSC) will conduct the preliminary examination on 09th June 2024. Only six Days are left for the TSPSC Group 1 Exam 2024. TSPSC released the Group 1 admit card on 01 June 2024 on its official Website. Everyone is well prepared for the exam. Let’s learn how the candidates who have been prepared so far from the examination point of view can give the final touches to their preparation.
Click Here: TSPSC Group 1 Admit Card 2024
TSPSC గ్రూప్ 1 పరీక్ష 2024: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తుంది, TSPSC గ్రూప్ 1 2024 ప్రిలిమ్స్ పరీక్ష 09 జూన్ 2024న షెడ్యూల్ చేయబడుతుంది. TSPSC గ్రూప్ 1 పరీక్ష 2024కి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. TSPSC గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్‌ను 01 జూన్ 2024న తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అందరూ పరీక్షకు బాగా సిద్ధమయ్యారు. పరీక్షల కోణం నుండి ఇప్పటివరకు ప్రిపేర్ అయిన అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు తుది మెరుగులు దిద్దే విధానాన్ని తెలుసుకుందాం.
Adda247 APP
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష 2024
తెలంగాణ రాష్ట్రం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కఠినత్వ స్థాయి, పరిధి ఎలా ఉంటుంది అనే ఆందోళన సీరియస్ గా సిద్దమైన అభ్యర్థుల్లో కనిపిస్తోంది, ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు గ్రూప్ 1 ప్రీలిమ్స్ పరీక్ష జరిగి, రాదధఊ చేయబడింది. అయితే గతంలో జరిగిన గ్రూప్ 1 ప్రీలిమ్స్ పరీక్ష, జూనియర్ పంచాయతీ ఆఫీసర్స్ గ్రూప్-2 మొదలైన పరీక్షల్ని సర్వీస్ కమిషన్ నిర్వహించింది. ఈ పరీక్షలన్నీ సగటు కఠినత్వ స్థాయితో ఉన్నాయి. అదేవిధంగా అన్ని సబ్జెక్టులనూ తగిన మోతాదులో ఇచ్చారు. అదే ధోరణి పునరావృతం అవుతుందని భావించవచ్చు. కాబట్టి అనవసరమైన కఠినత్వాన్ని ఊహించుకుని ఆందోళనపడటం అశాస్త్రీయం. ఇలాంటి ఆందోళనకు ఈ కొద్దిరోజుల సమయంలో ఏమాత్రం అవకాశం ఇచ్చినా నష్టపోయే ప్రమాదం ఉంది.
ప్రకటించిన పోస్టులు 563 కాబట్టి 150 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. దాదాపుగా సీరియస్ అభ్యర్థులందరూ మెయి న్స్కు అర్హులయ్యే అవకాశం ఉంటుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఒత్తిడీ లేకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరైతే సగం విజయం సాదించినట్లే.
TSPSC గ్రూప్ 1 పరీక్ష సరళి 2024
పరీక్ష వివరాలు :
సబ్జెక్టు | పరీక్షా సమయం (HOURS) | మొత్తం మార్కులు |
ప్రిలిమినరీ టెస్ట్ జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్) 150 ప్రశ్నలు |
2 ½ | 150 |
TSPSC Group 1 Exam 2024 Last Week Preparation | TSPSC గ్రూప్ 1 పరీక్ష చివరి వారం ప్రిపరేషన్
- కొంతమంది అభ్యర్థులు చివరిరోజు వరకు ‘అది చదవాలి. ఇది చదవాలి’ అని ఆందోళనకు గురవుతూనే ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ పరీక్షల్లో..
- అబ్జెక్టివ్ పరీక్షలకు హాజరయ్యేటప్పుడు కనీసం వారం రోజులు ముందు నుంచీ తగినంత నిద్ర ద్వారా మెదడుకు ప్రశాంతతను అందించాలి. తద్వారా అభ్యర్థుల పెర్ఫార్మెన్స్ పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇదే విషయాన్ని అన్వయించుకుని కనీసం 10 గంటల సమయమైనా మెదడుకు విశ్రాంతినివ్వాలి.
- సోషల్ మీడియాలో వచ్చే సమాచారానికి దూరంగా ఉంటూ ప్రశాం తంగా ఉండాలి. ప్రశాంతంగా నిద్రపోవాలి.
- కొత్త కొత్త విషయాలను చదివే ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టాలి. చదివిన పుస్తకాల్లో కూడా కొన్ని సబ్జెక్టులను ఇక చదవాల్సిన అవసరం లేదని నిర్ధారించుకుని వాటిని పక్కన పెట్టేసేయాలి.
- కరెంట్ అఫైర్స్, గణాంకాలు, ఆర్థిక గణాంకాలు మొదలైనవాటి పునశ్చరణ (రివిజన్) కు మాత్రమే ఇప్పటి సమయాన్ని కేటాయించాలి.
- తెలంగాణ విధానాలు, తెలంగాణ భౌగోళిక అంశాలు, చారిత్రక సాంస్కృ తిక అంశాలు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం, ఆర్ధిక వ్యవస్థ మొదలైన విభాగాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీలైతే ఈ కొద్ది రోజుల్లో విహంగ వీక్షణ అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- పరీక్షకు 24 గంటల ముందు ఏదీ చదవకుండా ప్రశాంతంగా ఉండటం మేలు. దీనివల్ల మంచి ఫలితాలను రాబట్టవచ్చు.
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు
Instructions in Examination Hall | పరీక్ష హాలులో సూచనలు
- పరీక్ష పర్యవేక్షణాధికారి ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
- అభ్యర్థులు తమ వివరాలను పర్యవేక్షణాధికారి ఆదేశించిన రీతిలో నమోదు చేసుకోవాలి. హాల్ టికెట్ నంబర్, పరీక్షా పత్రం కోడ్ లాంటివి తప్పులు రాస్తూ చాలా సందర్బాల్లో నష్టపోయిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువే.
- సమాదానాలను గుర్తించే సందర్భంలో మొదట తెలిసిన సమాధానాలు అన్ని గుర్తించుకుంటూ వెళ్లి తర్వాతి రౌండ్లో నమ్మకం ఉన్న సమాధానాన్ని గుర్తించడం మంచిది.
- తెలిసిన సబ్జెక్టు ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయి అనే వెతుకులాట వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. వరుస క్రమంలో సమాధానాలు గుర్తించుకుంటూ వెళ్లటమే మంచిది.
TSPSC గ్రూప్ 1 2024 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి, ఏం తీసుకెళ్లకూడదు?