Table of Contents
Toggleతెలంగాణ రాష్ట్రంలోని 563 TSPSC గ్రూప్-1 పోస్టుల నియామకానికి సంబంధించి TGPSC ఫిబ్రవరి 2025 నెలలో మెయిన్స్ పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. UPSC తరహాలో ఉద్యోగ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయడం కోసం 2025 ఫిబ్రవరి 19 నాటికి తుది ఫలితాలు ప్రకటించాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
TSPSC గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ప్రక్రియ, మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనను 1:2 నిష్పత్తిలో పూర్తి చేయడానికి కనీసం మూడు నెలల సమయం అవసరం అవుతుందని TGPSC భావిస్తోంది.
ప్రిలిమినరీ పరీక్ష నుంచి తుది ఫలితాల దిశగా:
- ప్రకటన: 2024 ఫిబ్రవరి 19న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
- పరీక్ష దశలు: 4,03,645 దరఖాస్తుల నుంచి, జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో 31,382 మంది మెయిన్స్ పరీక్షలకు ఎంపికయ్యారు.
- మెయిన్స్ పరీక్షలు: 2024 అక్టోబర్ 21 నుండి 27 వరకు 7 పేపర్లతో జరిగిన పరీక్షల్లో 21,093 మంది హాజరయ్యారు.
- జవాబు పత్రాల మూల్యాంకనం: నవంబరు రెండో వారంలో ప్రారంభమై, ఒక్కో పేపర్‌ను రెండుసార్లు మూల్యాంకనం చేస్తున్నారు.
- తేడా ఉంటే మూడో దశ: మొదటి, రెండో దశల మూల్యాంకనాల్లో మార్కుల వ్యత్యాసం ఉంటే, మూడో దశకు వెళ్ళి ఖరారు చేయడం జరుగుతుంది. అంటే ఒక అభ్యర్థి జవాబుపత్రం తొలిదశ మూల్యాంకనం లో వచ్చిన మార్కులకు.. రెండోదశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్దగా వ్యత్యాసం లేకుంటే ముందుకు వెళ్తారు. తేడా ఎక్కువగా ఉంటే మూడో దశ మూల్యాంకనం నిర్వహించి మార్కులు ఖరారు చేస్తారు
- తుది మెరిట్ జాబితా: మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను TGPSC రూపొందించనుంది.
Adda247 APP
TGPSC అవరోహణ విధానం: బ్యాక్‌లాగ్ నివారణకు కీలక మార్పులు
తదుపరి పోస్టులపై ప్రాధాన్యం:
గ్రూప్-1 నియామక ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే గ్రూప్-2, 3 ఫలితాలను విడుదల చేయాలనే ఆలోచనలో TGPSC ఉంది. గత నియామకాల్లో ఒక్క అభ్యర్థి రెండు లేదా మూడు పోస్టులకు ఎంపికవ్వడంతో, కిందిస్థాయి పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మిగిలాయి. దీనివల్ల గురుకులాల్లో దాదాపు 2,000 పోస్టులు భర్తీ చేయబడలేదు.
రీలింక్విష్‌మెంట్ విధానం:
భవిష్యత్తులో ఇలాంటి బ్యాక్‌లాగ్ సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు TGPSC అవరోహణ విధానాన్ని అమలు చేయాలన్న దిశగా సమాలోచనలు చేస్తోంది.
గ్రూప్-2, 3 పరీక్షలు:
- గ్రూప్-3 రాతపరీక్షలు ఇప్పటికే పూర్తయినాయి.
- 15, 16 డిసెంబరు 2024 న గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి.
- ఫిబ్రవరిలో గ్రూప్-1 ఫలితాల విడుదల అనంతరం గ్రూప్-2, 3 ఫలితాలు ప్రకటించడం ద్వారా బ్యాక్‌లాగ్ నివారణ సాధ్యమవుతుందని TGPSC భావిస్తోంది.
ఈ విధానంతో అన్ని గ్రూప్ పోస్టులకు సమాన న్యాయం చేయడం కమిషన్ మెయిన్స్ లక్ష్యంగా పని చేస్తోంది.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |
Sharing is caring!