Telugu govt jobs   »   TSPSC Group-1   »   TSPSC Group 1 Prelims Exam Analysis

TSPSC Group 1 Prelims Exam Analysis 2024, Download Question Paper | TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష విశ్లేషణ 2024, ప్రశ్న పత్రాన్ని PDF డౌన్‌లోడ్ చేయండి

TSPSC Group 1 Exam Analysis

TSPSC Group 1 Exam Analysis 2024 Check the Telangana Public Service Commission TSPSC Group 1 Exam Analysis and TSPSC Group 1 prelim question paper after successfully conducting the preliminary examination of TSPSC Group 1 on 09 June 2024. After writing the exam Everyone will be curious to know the difficulty level of the TSPSC Group 1 Exam Analysis. In this article, we are providing TSPSC Group 1 Exam Analysis 2024.

TSPSC గ్రూప్ 1 పరీక్ష విశ్లేషణ 2024: క్వశ్చన్ పేపర్ లీక్ మరియు ఇతరతర కారణాల వలన గతంలో రెండు సార్లు జరిగిన TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన తర్వాత పరీక్ష TSPSC 563 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి, ఈ రోజు (09 జూన్ 2024) TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 895 కేంద్రాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను కమిషన్ నిర్వహించింది. TSPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. TSPSC గ్రూప్ 1 ప్రశ్నాపత్రం 2024తో పాటు TSPSC గ్రూప్ 1 ఆన్సర్ కీ 2024ని కూడా త్వరలో TSPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో విడుదల చేస్తుంది.

పరీక్ష రాసిన తర్వాత ప్రతి ఒక్కరూ TSPSC గ్రూప్ 1 పరీక్ష విశ్లేషణ యొక్క క్లిష్ట స్థాయిని తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ కథనంలో మేము TSPSC గ్రూప్ 1 పరీక్ష విశ్లేషణ 2024ని అందిస్తున్నాము.

గమనిక: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్నది మాత్రమే, క్రింద పేర్కొనబడిన సంఖ్యలు యధాతధం కావు.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

TSPSC Group 1 Prelims Exam Analysis 2024

TSPSC గ్రూప్ 1 పరీక్ష 09 జూన్ 2024 న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించబడింది. TSPSC గ్రూప్ 1 పరీక్షకు అర్హత సాధించడానికి అభ్యర్థులు తమ సామర్థ్యాలను బట్టి పరీక్షకు ప్రయత్నించారు. పరీక్ష ముగిసిన తర్వాత  పరీక్షను విశ్లేషించడం ద్వారా, మేము పరీక్షలో విజయం సాధించే అవకాశాలను అంచనా వేయవచ్చు. తదనుగుణంగా మేము మీకు నేటి ప్రశ్నలు మరియు వాటి క్లిష్ట స్థాయి వివరాలను ఇక్కడ అందించడానికి ప్రయత్నిస్తున్నాము.

TSPSC Group 1 Exam Analysis 2024
Organization TSPSC (Telangana State Public Service Commission)
Posts Name TSPSC Group 1
Vacancies 563
TSPSC Group 1 Exam Date 09 June 2024
TSPSC Group 1 Exam Mode OMR Based
Job Location Telangana State
Official Website https://www.tslprb.in

TSPSC Group 1 Prelims Exam Pattern 2024 | TSPSC గ్రూప్ 1 పరీక్ష సరళి 2024

పరీక్ష వివరాలు :

  • ప్రిలిమ్స్ పరీక్ష మొత్తం మార్కులు 150 కు ఉంటుంది.
  • ప్రిలిమ్స్ పరీక్ష 150 నిమిషాల వ్యవధి.
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
సబ్జెక్టు పరీక్షా సమయం (HOURS) మొత్తం  మార్కులు
ప్రిలిమినరీ టెస్ట్ 
జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్)  150 ప్రశ్నలు
 2 ½ 150

TSPSC Group 1 Exam Analysis 2024: Difficulty Level (క్లిష్టత స్థాయి)

TSPSC Group 1 Exam Analysis 2024 Difficulty Level: ఈ విశ్లేషణ TSPSC Group 1 పరీక్ష మధ్యస్థం నుండి కఠినంగా  ఉంది. అభ్యర్ధులు ప్రశ్నలను సమాధానం చేయడానికి సమయం ఎక్కువ పట్టింది మరియు ప్రశ్నల క్లిష్టత స్థాయి కూడా ఎక్కువగా ఉంది. ఈ విశ్లేషణ పరీక్షా పత్రం యొక్క సమగ్ర అధ్యయనాన్ని అందిస్తుంది. అభ్యర్థులు TSPSC Group 1 పరీక్ష లో తమ ప్రదర్శన న ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

TSPSC Group 1 Exam Analysis 2024 Questions Asked in the Exam

ఈ రోజు జరిగిన TSPSC గ్రూప్ 1 పరీక్షలో అడిగిన కొన్ని ప్రశ్నలు

12Q. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము :

A. బద్దెగేశ్వర దేవాలయము వేములవాడలో నిర్మించబడింది.”

B. ప్రాకృత భాషలో రచింపబడిన ‘కళ్యానకారక’ అను గ్రంథము వైద్యమునకు సంబంధించింది. పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి?

(1) B మాత్రమే

(2) A మరియు B రెండూ కావు

(3) A మాత్రమే

(4) A మరియు B రెండూ

13Q. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము :

A. పంప కవి యొక్క ‘విక్రమార్జునవిజయము’ ముదిగొండ చాళుక్యుల గురించి కొంత తెలుపుతున్నది.

B. క్రివ్వక శాసనము ముదిగొండ చాళుక్యులు మరియు రాష్ట్రకూటల మధ్య సంఘర్షనల గురించి తెలు పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి?

(1) B మాత్రమే

(2) A మరియు B రెండూ కావు

(3) A మాత్రమే

(4) A మరియ B రెండూ

40Q. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP-26 ఏ దేశంలో జరిగింది ?

(1) గ్లాస్గో, యుకె

(2) ఆస్ట్రేలియా

(2) B మరియు D మాత్రమే

(4) A మరియు B మాత్రమే

(4) సౌదీ అరేబియా

 

41Q. అక్టోబర్ 2023 లో భారత ఎన్నికల సంఘం ఓటరు అవగాహనా మరియు విద్య గురించి ఎవరిని జాతీయ స్థాయి పేరు (National Icon) వ్యక్తిగా నియమించింది ?

(1) రాజ్ కుమార్ రావ్

(2) విరాట్ కోహ్లి

(3) పంకజ్ త్రిపాఠి

(4) సోనూ సూద్

 

118. ఒక గడియారం ఉ 7:42 చూపుతున్నప్పుడు దాని గంటల మరియు నిమిషాలు ముల్లుల మధ్య కోణం 1° మరియు సా. 5 సమయాన ఆ రెండు ముళ్ళ మధ్య కోణం y°. x° మరియు y° ల మొత్తం :

(1) 30°

(2) 54°

(3) 72°

(4) 43°

129. క్రింది ప్రవచనాలను పరిగణించండి:

I. అక్షరాస్యత అధికంగా ఉన్న ఒక రాష్ట్రంలో మహళలపై నేరాలు తక్కువగా ఉన్నాయి.

II. అధిక అక్షరాస్యత మెరుగైన ఆర్థిక వ్యవస్థని ఇస్తుంది.

ప్రవచనాలను జాగ్రత్తగా చదివి, క్రిందివాటిలో సరైన ఐచ్చికాన్ని ఎన్నుకోండి.

(1) II కారణం కాగా, దాని మూలంగా I ప్రభావం చూపుతుంది.

(2) ఒకే కారణం చేత I మరియు II లు స్వతంత్ర ప్రభావాలు అవుతాయి.

(3) I కారణం కాగా, దాని మూలంగా II ప్రభావాన్ని చూపుతుంది.

(4) స్వతంత్ర కారణాల మూలంగా I మరియు II లు రెండూ ప్రభావాన్ని చూపుతాయి.

మిగిలిన ప్రశ్నలు గురించిన పూర్తి సమాచారం కొరకు దిగువన ఇవ్వబడిన ప్రశ్న పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు వీలుగా ఉండేందుకు మేము ఈ ప్రశ్న పత్రాన్ని ఇక్కడ పొందుపరిచాము.

Download TSPSC Group 1 Exam Paper PDF -Telugu

Download TSPSC GROUP-1 Prelims Question paper-English

TSPSC Group 1 Exam Analysis 2024 Expected Good Attempts | ఆశించిన మంచి ప్రయత్నాలు

మంచి ప్రయత్నాల సంఖ్య పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి, ఖాళీల సంఖ్య మొదలైన కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ, ఔత్సాహికులు మార్కుల అధిక మరియు తక్కువ ట్రెండ్‌ని తెలుసుకోవడానికి 2024లో ఆశించిన మంచి ప్రయత్నాలను చూడవచ్చు.

Subjects  మంచి సమాధానాలు  పరీక్ష క్లిష్టత స్థాయి  
General Studies 25-35 మధ్యస్థం నుండి కఠినం
Mental Ability 30-40 మధ్యస్థం నుండి కఠినం
Total 55-75 మధ్యస్థం నుండి కఠినం

ఇక్కడ అందించిన మంచి ప్రయత్నాలు మేము వివిధ అభ్యర్ధులని అడిగి తెలుసుకున్నవి మరియు అభ్యర్ధులు ఇంకా ఎక్కువ లేదా తక్కువ సమాధానాలు చేసి ఉండవచ్చు. సరైన సమాధానాలు ఇంకా కట్ ఆఫ్ వివరాలు అధికారికంగా TGPSC విదుల చేసిన వెంటనే మీకు తెలియజేస్తాము.

అభ్యర్ధుల పరీక్ష సన్నద్దత స్థాయిని బట్టి వారి సరైన సమాధానాలు ఎక్కువగా ఉండవచ్చు మరియు పోటీ పరీక్షలలో పరీక్షా ప్రణాళిక ఎంత పకడ్బంధిగా ఉంటే అంత మంచి మార్కులతో ప్రిలిమ్స్ తరహా పరీక్షల్ని సులువుగా ఛేదించవచ్చు.

Telangana Mega Pack

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

TSPSC Group 1 Prelims Exam Analysis 2024, Download Question Paper_5.1