Telugu govt jobs   »   పెరగనున్న TSPSC గ్రూప్ 2 మరియు గ్రూప్...
Top Performing

TSPSC Group 2 and 3 posts will be increased | పెరగనున్న TSPSC గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో TSPSC గ్రూప్ 2 మరియు TSPSC గ్రూప్ 3 ఉద్యోగ ఖాళీల సంఖ్య పెరగనుంది. గతంలో ప్రకటించిన TSPSC గ్రూప్ 2 మరియు TSPSC గ్రూప్ 3 పోస్టులకు అదనంగా మరిన్ని ఖాళీలు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.  రాష్ట్రంలో వివిధ విభాగాల వారీగా ప్రస్తుతం ఉన్న, మరియు వచ్చే ఏడాదిలోగా ఏర్పడనున్న ఖాళీలను గుర్తించాలని సూచించి, ఈ వివరాలను వెంటనే అందించాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు విభాగాధిపతులకు లేఖ రాశారు. దీనితో గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నట్లు అభ్యర్ధులు భావిస్తున్నారు.

2022లో నోటిఫై చేసిన TSPSC గ్రూప్ 2 పోస్టులు ప్రస్తుతం 783 ఉన్నాయి. ఈ పోస్టులకు రాతపరీక్షలు  ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. TSPSC గ్రూప్ 3లో 1388 పోస్టులకు ఈ ఏడాది నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించేందుకు TSPSC షెడ్యూలు ఖరారు చేసింది.

మరోవైపు TSPSC  పరీక్షలు జరిగే వరకు పోస్టుల సంఖ్యలో మార్పులు చేర్పులకు అవకాశాలున్నట్లు కమిషన్ ప్రభుత్వం భావిస్తున్నాయి. ఈక్రమంలో వచ్చే ఏడాదిలోగా ఏర్పడనున్న ఖాళీలతో పాటు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తే వచ్చే అదనంగా వచ్చే పోస్టులపైనా కసరత్తు జరుగుతోంది.

AP DSC SGT 2024 Complete Batch | Video Course by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

TSPSC Group 2 and 3 posts will be increased | పెరగనున్న TSPSC గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పోస్టులు_4.1