TSPSC గ్రూప్ 2 ఎంపిక విధానం
TSPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ: TSPSC గ్రూప్ 2 పరీక్షా డిసెంబర్ 15 మరియు 6, 2024 తేదీలలో జరగనుంది. రాబోయే TSPSC గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ఎగ్జామ్ 2023-24కి హాజరు కావడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దాని ఎంపిక ప్రక్రియలో బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి. పోస్టులకు నియామకం కోసం అభ్యర్థుల ఎంపిక వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) OMR ఆధారంగా చేయబడుతుంది మరియు వ్రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా పోస్టులకు ఎంపిక చేయబడుతుంది. ఈ కథనంలో, మేము TSPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ 2023-24ని వివరంగా అందిస్తున్నాము.
Adda247 APP
TSPSC గ్రూప్ 2 ఎంపిక విధానం అవలోకనం
TSPSC గ్రూప్ 2 ఎంపిక విధానం: TSPSC అనేక పోస్టుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్లను నిర్వహిస్తుంది మరియు అభ్యర్థులు వ్రాత పరీక్ష ప్రక్రియ ద్వారా దశలవారీగా అర్హత సాధించాలి.
TSPSC గ్రూప్ 2 ఎంపిక విధానం | |
సంస్థ పేరు | TSPSC (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) |
పోస్టు పేరు | గ్రూప్ 2 |
పోస్టుల సంఖ్య | 783 |
రాష్ట్రం | తెలంగాణ |
వర్గం | ఎంపిక పక్రియ |
ఎంపిక విధానం | వ్రాత పరీక్ష ఆధారంగా |
పరీక్ష తేదీ | డిసెంబర్ 15 మరియు 6, 2024 |
అధికారిక వెబ్సైట్ | http://tspsc.gov.in |
TSPSC గ్రూప్ 2 ఎంపిక విధానం 2023-24
TSPSC గ్రూప్ II సిలబస్లో పేపర్ I, పేపర్ II, పేపర్ III మరియు పేపర్ IV అనే నాలుగు పేపర్లు ఉంటాయి. సబ్జెక్టులు జనరల్ నాలెడ్జ్, హిస్టరీ & సొసైటీ, ఎకానమీ డెవలప్మెంట్ మరియు తెలంగాణా ఉద్యమం & రాష్ట్ర ఏర్పాటుగా సమానంగా పంపిణీ చేయబడ్డాయి. పోస్టులకు నియామకం కోసం అభ్యర్థుల ఎంపిక OMR ఆధారంగా వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ద్వారా చేయబడుతుంది మరియు వ్రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా పోస్టులకు ఎంపిక చేయబడుతుంది.
TSPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ : పరీక్షా సరళి 2023-24
TSPSC గ్రూప్ 2 పరీక్షా సరళి : నోటిఫికేషన్లో TSPSC గ్రూప్ 2 పరీక్షా సరళి, సబ్జెక్ట్ వారీగా మార్కింగ్ స్కీమ్ మరియు పరీక్ష వ్యవధికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి.TSPSC గ్రూప్ 2 పరీక్ష విధానంలో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మరియు పేపర్ 4లో ఒక్కొక్కటి 150 మార్కులు ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, కింది పట్టికను జాగ్రత్తగా పరిశీలించండి.
పరిక్ష వివరాలు :
పేపర్ | సబ్జెక్టు | ప్రశ్నలు
(MULTIPLE CHOICE ) |
పరీక్షా సమయం (HOURS) | మొత్తం
మార్కులు |
పేపర్-1 | జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ | 150 | 2 ½ | 150 |
పేపర్-2 | చరిత్ర, రాజకీయాలు మరియు సమాజం
|
150 (3×50) | 2 ½ | 150 |
పేపర్-3 | ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
|
150 (3×50) | 2 ½ | 150 |
పేపర్-4 | తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు
|
150 (3×50) | 2 ½ | 150 |
మొత్తం | 600 |
TSPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ: కనీస అర్హత మార్కులు
మెరిట్ క్రమంలో వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను అవసరమైన విధంగా అందుబాటులో ఉన్న ఖాళీల కోసం కమ్యూనిటీ మరియు కేటగిరీల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థుల ఎంపిక కోసం అర్హత మార్కులు క్రింద ఇవ్వబడ్డాయి.
వర్గం | కనీస అర్హత మార్కులు |
OC/EWS/sportsmen | 40% |
BC | 35% |
SC/ST/PH | 30% |