TSPSC One Time Registration
TSPSC One Time Registration Login and Edit Process: Telangana State Public Service Commission (TSPSC) is providing the facility to register with the TSPSC official portal www.tspsc.gov.in using TSPSC One Time Registration (OTR) for the aspirants seeking to know the details of Telangana government job notifications, application dates, and other details. Telangana candidates who are eligible to apply for state government jobs and wish to know the time to time updates can register with the TSPSC portal.
TSPSC One Time Registration Login Process & Edit Process | TSPSC OTR రిజిస్ట్రేషన్ ప్రక్రియ
రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా స్థానికత నిర్ధారణ కోసం టీఎస్ పీఎస్సీ ఉద్యోగార్థుల వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో సవరణలు, కొత్త ఉద్యో గార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. సీజీజీ సాఫ్ట్వేలో మార్పులతో నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 28 మార్చి 2022 మధ్యాహ్నం నుంచి అందు బాటులోకి వచ్చింది. ఇది నిరంతరం కొనసాగు తుంది. ఇప్పటికే నమోదైన అభ్యర్థులు టీఎస్పీ ఎస్సీ ఐడీ, పుట్టినతేదీతో లాగిన్ అయ్యేందుకు అవకాశాన్ని కల్పించింది. నియామక ప్రక్రియ పూర్తయ్యేవరకు మొబైల్ నంబరును మార్చకూడ దని స్పష్టం చేసింది.
TSPSC One Time Registration 2023
TSPSC One Time Registration Login Process & Edit Process | |
TSPSC Official web site | Link |
TSPSC New Registration | Link |
TSPSC Edit (OTR) | Link |
TSPSC OTR
దరఖాస్తులో 1 నుంచి 7 తరగతి వరకు విద్యా సంవత్సరంతో పాటు చది విన పాఠశాల పేరు, గ్రామం, మండలం, జిల్లా వివరాలు తీసు కుంటోంది. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పేజీ ఇతర అదనపు అర్హతలవారీగా ఏ ప్రాంతంలో చదువుకున్నారో వివరాలు తప్పనిసరి నమోదు చేయాలని స్పష్టం చేసింది. విద్యార్హతలతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయా లని కోరినప్పటికీ తప్పనిసరి కాదని పేర్కొంది. ఓటీఆర్ వివరాల సవరణ, కొత్తగా నమోదులో అభ్యర్థులకు ఎదురయ్యే సందేహాలు, సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం టీఎస్పీఎస్సీ ప్రత్యేక హె లైన్ ఏర్పాటు చేసింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధారణ సమస్యలకు 040-22445566, సాంకేతిక సమస్య లకు 140-295 12185, 29512187 నంబర్లలో కానీ helpdesk@ tspsc.gov.in కు ఈ-మెయిల్ లో కానీ సంప్రదించాలని సూచించింది.
TSPSC OTR New Registration
TSPSC One Time Password Registration ను మొదలు పెట్టింది. దీనికి గాను ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకొని అభ్యర్ధులు అంటే నూతన అభ్యర్ధులు TSPSC అధికారిక వెబ్ సైట్ tspsc.gov.in నందు OTR New Registration ట్యాబ్ మీద క్లిక్ చెయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్ధులు Phone number నమోదు చేసిన తరువాత, వారి యొక్క వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు తదితర వివరాలు పేర్కొని మొబైల్ నెంబర్ కు పంపబడిన OTP నమోదు చేయడం ద్వారా నమోదు ప్రక్రియ ముగుస్తుంది. అభ్యర్ధులు ఒకసారి OTP నమోదు చేసిన తరువాత వారికి OTR నంబరు(TSPSC ID) వారి మొబైల్ మరియు ఈ-మెయిల్ కు పంపబడుతుంది. భవిష్యత్తు లో దరఖాస్తు చేసుకొనే సమయంలో ఈ నంబరు మరియు పాస్ వర్డ్ నమోదు చేయడం ద్వారా మీ దరఖాస్తు విండో కు తరలించబడతారు.
Click here to register for TSPSC OTR NEW REGISTRATION
TSPSC Edit OTR (Candidate Login)
దీని ద్వారా అభ్యర్ధులు ముందుగానే నమోదు చేసుకున్న OTR నమోదు పత్రాన్ని ఆన్లైన్ లో సవరించుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని కొరకు అభ్యర్ధులు మునుపు పొందిన TSPSC ID ని నమోదు చేయవలసి ఉంటుంది. తరువాత అభ్యర్ధులు వారి వివరాలను సవరించుకొని “Final submit” బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా TSPSC edit OTR పూర్తి అవుతుంది. OTR edit విధానం క్రింద పూర్తిగా వివరించడం జరిగింది.
Click here to edit TSPSC Edit OTR(Candidate Login)
How to update mobile number in OTR
అభ్యర్ధులు ఇంతకు మునుపు OTR నమోదు చేసుకొని, ఇప్పుడే మొబైల్ నెంబర్ మార్చుకోవాలి అనుకుంటే, TSPSC అధికారిక వెబ్ సైట్ నందు update mobile number in OTR ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత మీ యొక్క TSPSC ID , Date of birth, New mobile number మరియు Old Mobile number నమోదు చేసి, Generate OTP ఫై క్లిక్ చేసి, నూతన మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP నమోదు చేయడం ద్వారా మీ మొబైల్ నెంబర్ మార్చుకొనవచ్చు.
Click here to change mobile number in OTR
How to Edit TSPSC One Time Registration?
టీఎస్‌పీఎస్సీ వద్ద వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) కింద నమోదైన అభ్యర్థుల వ్యక్తిగత వివరాల సవరణకు కమిషన్ అనుమతిచ్చింది. కొత్త అభ్యర్థులు కూడా నూతన ఓటీఆర్ కింద వివరాలు నమోదు చేసుకునేందుకు వీలు కల్పించింది. మార్చి 28న మధ్యాహ్నం 2 గంటల నుంచి సవరణ ఓటీఆర్ ఫారం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే నమోదైన అభ్యర్థులు ఎడిట్ ఓటీఆర్ ద్వారా, కొత్త అభ్యర్థులు తాజా రిజిస్ట్రేషన్ కింద వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ మేరకు కమిషన్ వెబ్‌సైట్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం పూర్వ పది జిల్లాలు 33గా మారాయి. రెండు జోన్లు ఏడుగా, ఒక మల్టీజోన్ రెండు అయ్యాయి. అభ్యర్థుల స్థానికత ఈ ఉత్తర్వుల ప్రకారమే నిర్ణయమవుతుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద ఓటీఆర్ కింద నమోదైన 25 లక్షల మంది అభ్యర్థుల స్థానికతలోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. అభ్యర్థులు తమ స్థానికత వివరాలను సవరించుకోవాల్సి ఉంటుంది. టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ, 1 – 7వ తరగతి వరకు వివరాలు ప్రస్తుత 33 జిల్లాలకు అనుగుణంగా నమోదు చేయాలి. వీటితో పాటు తాజా విద్యార్హతలూ పేర్కొనవచ్చు.
TSPSC OTR Required Documents
ఆధార్ వివరాలు:
- ఆధార్ UID నంబరు.
- కార్డు పై పేరు.
ప్రాథమిక వివరాలు:
వ్యక్తిగత వివరాలు:
- పేరు,
- పుట్టిన తేదీ,
- లింగం,
- పుట్టిన స్థలం,
- కమ్యూనిటీ
- తండ్రి పేరు, తల్లి పేరు,
- మతం,
- మాతృభాష మొదలైనవి.
Address :
- కరస్పాండెన్స్ & శాశ్వత చిరునామా.
Educational Qualifications :
- అధ్యయనం రకం.
- 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు పాఠశాల పేరు & జిల్లా.
- 10 వ తరగతి వివరాలు: జిల్లా, బోర్డ్ ఆఫ్ ఉత్తీర్ణత, హాల్ టికెట్ నంబర్, శాతం, ఉత్తీర్ణత తేదీ, నెల, సంవత్సరం.
- 10+2 వివరాలు.
- గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్/ Ph.D/ M.Phil వివరాలు.
Steps to Login for TSPSC OTR
- పరీక్షా పోర్టల్‌లోకి లాగిన్ అవుతోంది
- TSPSC వన్ టైమ్ రిజిస్ట్రేషన్ లింక్‌ని ఎంచుకోండి
- TSPSC ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించండి
- సంబంధిత బాక్స్‌లలో చిరునామాను పూరించండి
- మీ చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి
- మీ విద్యా వివరాలను నమోదు చేయండి
- అదనపు అర్హత వివరాలు
- డిజిటల్ పాస్‌పోర్ట్ సైజు చిత్రం మరియు సంతకాన్ని అప్‌లోడ్ చేయండి
- TSPSC ఫారమ్ యొక్క తుది సమర్పణ
Steps to Edit TSPSC One Time Registration
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ TSPSCని ఎడిట్ చేయాలనుకునే పోటీదారులు దిగువ పేర్కొన్న సూచనలను అనుసరించాల్సి ఉంటుంది.
- TSPSC వెబ్ పేజీకి వెళ్లండి – tspsc.gov.in
- హోమ్‌పేజీ మధ్యలో, “వన్ టైమ్ – రిజిస్ట్రేషన్” తర్వాత ఇవ్వబడిన “Edit” ట్యాబ్‌పై నొక్కండి.
- ఇలా చేయడం వల్ల కొన్ని వివరాలు అడుగుతున్న కొత్త పేజీ కనిపిస్తుంది.
- ఇప్పుడు, TSPSC Id, పుట్టిన తేదీని నమోదు చేసి, “GET OTP ” ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- మీరు OTPని స్వీకరించిన తర్వాత, తగిన లాగిన్ ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయండి.
- ఆపై మీ TSPSC దరఖాస్తు ఫారమ్‌ను సవరించండి మరియు “Final Submit” ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
********************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |