Telugu govt jobs   »   Current Affairs   »   TV Nagendra Prasad From Telangana Has...
Top Performing

TV Nagendra Prasad From Telangana Has Been Appointed As Ambassador To Kazakhstan | తెలంగాణకి చెందిన టీ.వీ నాగేంద్రప్రసాద్ కజకిస్థాన్‌లో రాయబారిగా నియమితులయ్యారు

TV Nagendra Prasad From Telangana Has Been Appointed As Ambassador To Kazakhstan | తెలంగాణకి చెందిన టీ.వీ నాగేంద్రప్రసాద్ కజకిస్థాన్‌లో రాయబారిగా నియమితులయ్యారు

తెలంగాణకు చెందిన వ్యక్తిని కజకిస్థాన్‌కు రాయబారిగా నియమించారు. వరంగల్ జిల్లా కొడకండ్ల నుంచి వచ్చిన టీవీ నాగేంద్రప్రసాద్‌ను కజకిస్థాన్‌కు రాయబారిగా కేంద్ర అధికారులు ఎంపిక చేశారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అధికారిక నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. నాగేంద్ర ప్రసాద్ ప్రస్తుతం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్‌గా ఉన్నారు. గత మూడేళ్లుగా ఆయన ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

హైదరాబాద్‌లోని భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఎమ్మెస్సీ చేసిన నాగేంద్రప్రసాద్ 1993లో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసు(IFS)లో చేరారు. టెహ్రాన్‌, లండన్‌, భూటాన్‌, స్విట్జర్లాండ్‌, తుర్క్‌మెనిస్థాన్‌ రాయబారి కార్యాలయం లో పనిచేశారు. ముఖ్యంగా 2018లో విదేశాంగ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. రెండేళ్ల తర్వాత ఆయనను శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్‌ జనరల్‌గా కేంద్రం నియమించింది.

కజకిస్థాన్‌కు రాయబారిగా ఇటీవల నియామకం కావడంతో, నాగేంద్ర ప్రసాద్ సెప్టెంబర్‌లో తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

TV Nagendra Prasad From Telangana Has Been Appointed As Ambassador To Kazakhstan_4.1

FAQs

డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు?

నాగేంద్ర ప్రసాద్ శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, గల్ఫ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న జాయింట్ సెక్రటరీగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేశారు.