Telugu govt jobs   »   Current Affairs   »   తెలంగాణలో కొత్తగా  రెండు మండలాలు ఏర్పాటు కానున్నాయి

తెలంగాణలో కొత్తగా  రెండు మండలాలు ఏర్పాటు కానున్నాయి

తెలంగాణలో కొత్తగా  రెండు మండలాలు ఏర్పాటు కానున్నాయి

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ జూన్ 28 న ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కొత్తగా ఇర్విన్‌ మండలాన్ని ఏర్పాటు చేసింది. మాడ్గుల్‌ మండలం నుంచి 9 గ్రామాలు ఇర్విన్‌, బ్రాహ్మణపల్లి, అర్కపల్లి, అండుగుల, అన్నెబోయినపల్లి, సుద్దపల్లి, గోరికొత్తపల్లి, కలకొండ, రమనపల్లిని వేరు చేస్తూ కొత్త మండలంలో కలిపింది. అదేవిధంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోనూ భూపాలపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కొత్తపల్లిగోరి మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసింది. రేగొండ మండలంలోని 7 గ్రామాలు కొత్తపల్లిగోరి, చెన్నాపూర్‌, చిన్నకోడెపాక, జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్‌, జంషెడ్‌బేగ్‌పేట, కొనారావుపేటను ఇందులో కలిపింది. ఈ మండలాల ఏర్పాటుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వినతులకు 15 రోజుల గడువు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెవెన్యూశాఖ.

రెండు మండలాలు ఇవే:

  • రంగారెడ్డి జిల్లాలో ఇర్విన్ మండలం
  • జయశంకర్ జిల్లాలో కొత్తపల్లి గోరి మండలం

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

మండల్ అంటే ఏమిటి?

మండలం అనేది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో తహసీల్ మాదిరిగానే స్థానిక ప్రభుత్వ ప్రాంతం.