TGPSC గ్రూప్-1 పరీక్షల కీపై అభ్యంతరాలను పరిశీలించి, వాటిని నిపుణుల కమిటీకి పంపి వారి ఆమోదం పొందిన తర్వాతే ఫలితాలు విడుదల చేశామని, త్వరలో మెయిన్స్ పరీక్షలు జరుగనున్నందున కోర్టు జోక్యం అవసరం లేదని, ఇది అభ్యర్థులకు ప్రతికూలంగా మారుతుందని టీజీపీఎస్సీ హైకోర్టుకు అక్టోబర్ 3న వివరించింది.
2022లో విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరొక నోటిఫికేషన్ ఇవ్వడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులు ఉన్నాయని పలు అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన జస్టిస్ పుల్లా కార్తీక్, పిటిషనర్ల వాదనలు వినిపించారు.
Adda247 APP
కీపై అభ్యంతరాలు స్వీకరణ
ప్రిలిమ్స్ కీపై మొత్తం 3 లక్షల మంది పరీక్ష రాసిన అభ్యర్థుల నుండి 721 భౌతిక అభ్యంతరాలు, 6,470 ఆన్‌లైన్ అభ్యంతరాలు వచ్చినట్లు టీజీపీఎస్సీ తరఫున న్యాయవాదులు తెలిపారు. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రెండు ప్రశ్నలను తొలగించి కీని సవరించామని వివరించారు.
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 27, 2024 వరకు ఏడు రోజుల పాటు జరగనుంది. అయితే TSPSC గ్రూప్ 1 పై కోర్టు కేసు లు ఉన్నందుకు TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరిగేనా, వాయిదా పడుతున్న అన్న ఆందోళనలో అభ్యర్థులు ఉన్నారు.
కోర్టు జోక్యం అవసరం లేదని టీజీపీఎస్సీ వాదన:
కీలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, మిగతా అభ్యర్థులు ఎటువంటి అభ్యంతరాలు తెలియజేయకుండానే కోర్టుకు వెళ్లారని టీజీపీఎస్సీ తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. కీపై పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురిలో ముగ్గురు ఇప్పటికే మైన్స్‌కు అర్హత పొందారని కూడా వారు వెల్లడించారు. వాదనలు ఇంకా పూర్తి కాకపోవడంతో తదుపరి విచారణ అక్టోబర్ 4కి వాయిదా పడింది.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |