Telugu govt jobs   »   Union Budget 2023-24   »   Union Budget 2023-24
Top Performing

Union budget 2023-24 Highlights, Download PDF | కేంద్ర బడ్జెట్ 2023-24 ముఖ్యమైన అంశాలు

Table of Contents

Union Budget 2023 |కేంద్ర బడ్జెట్ 2023

కేంద్ర బడ్జెట్ 2023 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023ని వరుసగా 5వ సారి సమర్పిస్తున్నారు. ఆమె 2023-24 ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు) ఆర్థిక నివేదికలు మరియు పన్ను ప్రతిపాదనలను లోక్సభలో ప్రస్తావించనున్నారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ”ప్రపంచం భారతదేశాన్ని ప్రకాశవంతమైన నక్షత్రంగా గుర్తించింది(The world Recognized India As A Bright Star)” అని పునరుద్ఘాటించారు. అలాగే ప్రస్తుత సంవత్సరంలో భారత వృద్ధి అంచనా 7%గా ఉంటుందని అంచనా వేసారు.

ఆర్థిక సర్వే 2022-23ని 31 జనవరి 2023న భారతదేశ ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ విడుదల చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY24) భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

 Download Union Budget 2023 in Telugu

Union Budget and Constitutional Provisions | బడ్జెట్ మరియు రాజ్యాంగ నిబంధనలు

  • కేంద్ర బడ్జెట్ అనేది స్థిరమైన వృద్ధి మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరించాల్సిన భవిష్యత్తు విధానాలను వివరించడానికి సమర్పించిన ఆదాయం మరియు వ్యయాలను అంచనా వేసే వార్షిక ఆర్థిక నివేదిక.
  • భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం, ఒక సంవత్సరపు కేంద్ర బడ్జెట్‌ను వార్షిక ఆర్థిక ప్రకటన (AFS)గా సూచిస్తారు.
  • ఇది ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అంచనా వేసిన వసూళ్లు మరియు ఖర్చుల ప్రకటన (ఇది ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై తదుపరి సంవత్సరం మార్చి 31న ముగుస్తుంది).
  • ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ యొక్క బడ్జెట్ విభాగం బడ్జెట్‌ను తయారు చేయడానికి నోడల్ బాడీగా వ్యవహరిస్తుంది.
  • 1947లో స్వతంత్ర భారత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

 ఆర్ధిక సర్వే 2022 PDF తెలుగులో

Union Budget 2023 Key Features | కేంద్ర బడ్జెట్ 2023-24 లోని ప్రధాన అంశాల విశ్లేషణ

సాధారణ బడ్జెట్‌లో పార్ట్-వన్‌ను ముగిస్తూ శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, రుణాలు మినహా మొత్తం రసీదులు మరియు మొత్తం ఖర్చులు వరుసగా రూ. 27.2 లక్షల కోట్లు మరియు రూ. 45 లక్షల కోట్లుగా అంచనా వేయబడ్డాయి. నికర పన్ను వసూళ్లు రూ.23.3 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది.

Vision For Amrit kaal | “అమ్రిత్ కాల్” లక్ష్యంగా

“అమ్రిత్ కాల్” లక్ష్యంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ యొక్క ప్రసంగం సాగినది. దీని యొక్క ప్రధాన లక్ష్యాలు

  • యువత లక్ష్యంగా దేశ పౌరులకు అవకాశాల కల్పన.
  • వృద్ది మరియు ఉద్యోగాల కల్పన.
  • బలమైన మరియు స్థిరమైన స్థూల ఆర్ధిక వాతావరణం.
  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పిస్తూ, దేశం 7శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
  • సీతారామన్ ‘సప్తర్షి’ లేదా బడ్జెట్‌లోని ఏడు ప్రాధాన్యతలను జాబితా చేశారు అవి:
  • సమ్మిళిత అభివృద్ధి,
  • చివరి మైలుకు చేరుకోవడం,
  • మౌలిక సదుపాయాల అభివృద్ధి,
  • సామార్ధ్యాన్ని వెలికితీయడం,
  • హరిత వృద్ధి,
  • యువశక్తి మరియు
  • ఆర్థిక రంగం
  • అనే అంశాల ప్రతిపదికన బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని వ్యక్తీకరించారు.
  • భారతదేశం యొక్క మిషన్ “అమ్రిత్ కాల్(Amrit Kaal)” అనేది కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) మరియు జ్ఞానం ఆధారితంగా భారతదేశం యొక్క ఆర్ధికవృద్ది ఆధారపడి ఉంటుంది.

Union Budget Agriculture and Cooperatives | కేంద్ర బడ్జెట్ వ్యవసాయం మరియు సహకార వ్యవస్థ

ముఖ్య లక్ష్యాలు:

  • ప్రజా సాంకేతిక మౌళిక సదుపాయాల నిర్మాణం:  రైతులకు సమ్మిళిత, సమాచార, చేరికతో కూడిన పరిష్కారాన్ని నిర్మించడం.
  • వ్యవసాయ వృద్ది నిధి ఏర్పాటు.
  • ఉద్యానవన శుద్ధి మొక్కల కార్యక్రమం యొక్క ప్రారంభం, దీని ద్వారా అధిక విలువ కలిగిన ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచడం.
  • పాలు, పశుపోషణ, మత్స్య రంగాలలో  20 లక్షల కోట్ల నిధి సముపార్జన లక్ష్యం.
  • ప్రపంచానికి దేశాన్ని తృణ ధాన్యాల హబ్ గా చేయడం మరియు దీని కొరకు హైదరాబాద్ లోని IIMR కు పరిశోధన అనుమతి ఇవ్వబడుతుంది.
  • ధాన్యాల నిల్వ కొరకు విస్తృతమైన ఏర్పాటు.
  • 2022 లో వ్యవసాయ రుణాలు 18.6 లక్షల కోట్లుగా ఉంది. అలాగే ఆహారధాన్యాల ఉత్పత్తి 2022 లో 310 మిలియన్ టన్నులుగా ఉన్నది.

Union Budget Health and Education| కేంద్ర బడ్జెట్ వైద్య & విద్యా రంగాలు

  • 157 నూతన నర్సింగ్ కాలేజీల నిర్మాణం
  • సికిల్ సెల్ ఎనీమియా పారదోలడం లక్ష్యంగా మిషన్ ప్రారంభం.
  • వైద్య మందుల విషయంలో పరిశోధనను ప్రోత్సహించడానికి కొత్త కార్యక్రమం ప్రారంభం.
  • వైద్య పరిశోధనకు ఎంపిక చేయబడిన ICMR ల్యాబ్ లతో ప్రభుత్వ మరియు ప్రైవేటు విధానంలో పరిశోధన.
  • జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థల ద్వారా “Revamped Teacher Training
  • పిల్లలు మరియు పెద్దలకు “నేషనల్ డిజిటల్ లైబ్రరీ” ఏర్పాటు.
  • పంచాయతీలు మరియు వార్డ్ స్థాయిలో లైబ్రరీలు ఏర్పాటు చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహించడం.
  • 20219లో విద్య మరియు వైద్యం పై చేసే ఖర్చు GDP లో వరుసగా 2.8 మరియు 1. 4 శాతం ఉండగా అది 2023 నాటికి వరుసగా 2.9 మరియు 2. 1 కి పెరిగింది.

Union Budget-Inclusive Development Achievements | సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు

  • గ్రామాలలో 9 కోట్ల త్రాగునీటి కుళాయి కనెక్షన్లు
  • PM-KISAN పధకం క్రింద రూ. 2.2 లక్షల కోట్ల డబ్బు 11.4 కోట్ల రైతుల ఖాతాలలోనికి జమ.
  • 44.6 కోట్ల మంది ప్రజలకు PMSBY మరియు PMJJY పధకాల క్రింద భీమా వెసులుబాటు.
  • 47.8 కోట్ల PM జన్ ధన్ బ్యాంకు ఖాతాలు.
  • 102 కోట్ల మందికి 220 కోట్ల కోవిడ్ టీకాల పంపిణి.
  • ఉజ్వల పధకం క్రింద 9.6 కోట్ల LPG కనెక్షన్లు.
  • స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా 11.7 కోట్ల ఇంటి మరుగుదొడ్ల నిర్మాణం.

భారతదేశంలో 2020 నుండి ఇప్పటి వరకు వృద్ది మరియు పట్టణ నిరుద్యోగ వివరాలు ఇలా ఉన్నాయి:

Union budget 2023-24 Key Highlights, Download PDF_3.1

Union Budget 2023-Reaching the Last Mile | కేంద్ర బడ్జెట్ 2023-చివరి మైలును చేరుకోవడం

  • ప్రధానమంత్రి PVTG(Particularly Vulnerable Tribal Groups) అభివృద్ధి పధకం ప్రారంభించనున్నారు.
  • కర్ణాటకలోని కరువు పీడిత ప్రాంతాలలో సుస్థిర సూక్ష్మ నీటి పారుదల కొరకు ఆర్ధిక సహాయం అందించడం.
  • 740 ఏకలవ్య  మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలలో కొత్త టీచర్ల నియామకం.
  • పురాతన శాశనాలను డిజిటలైజేషన్ చేయడానికి భారత్ శ్రీ(SHRI-Shared Repository of Inscriptions) ప్రారంభం.

Download Union Budget 2023 Key Highlights 

Union Budget 2023 Infrastructure and Investment | కేంద్ర బడ్జెట్ 2023 మౌళిక సదుపాయాలు మరియు పెట్టుబడులు

  • మౌళిక సదుపాయాలు మరియు ఉత్పత్తి సామర్ధ్యాల పై పెట్టుబడులకు ఊతం ఇవ్వడం కోసం ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వృద్ది మరియు ఉద్యోగాలు పెరుగుతాయి.
  • దీని కొరకు మూలధన పెట్టుబడి కేటాయింపు రూ. 10 లక్షల కోట్లతో  33.4% పెంచారు.
  • రాష్ట్రాలకు మౌళిక సదుపాయాలపై పెట్టుబడులను ప్రోత్సహించేందుకు 50 సంవత్సరాల పాటు వడ్డీ రహిత రుణాల పధకాన్ని పొందిగించనున్నారు.
  •  రైల్వేలకు ఇదివరకెన్నడు లేని విధంగా రూ.2.4 లక్షల కోట్ల మూలధన పెట్టుబడి కేటాయింపు.
  • పోర్టులు, బొగ్గు, స్టీల్, క్రిమి సంహారకాల ఇరువైపులా రవాణా మరియు అనుసంధానాన్ని మెరుగుపరచడం కోసం 100 రవాణా మౌళిక సదుపాయాల ప్రాజెక్టుల గుర్తింపు.
  • UIDF(Urban Infrastructure Development Fund) స్థాపించడం ద్వారా టైర్-2 మరియు టైర్-3 పట్టణాలలో పట్టణ మౌళిక సదుపాయాల కల్పన.

 పర్యాటకం

  • 50 పర్యాటక గమ్యస్థానాలను పూర్తిగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు తీసుకువచ్చారు, ఇది దేశీయ పర్యాటకాన్ని పెంచడంతో పాటు ఇప్పటికే ఉన్న పర్యాటక ప్రదేశాలలో పర్యాటకుల మితిమీరిన తాకిడిని తగ్గిస్తుంది.  రోడ్లు మరియు మౌళిక సదుపాయాలు అభివృద్ధి చేయడం, టూరిస్ట్ గైడ్‌లకు నైపుణ్యం పెంచడం ద్వారా ఈ విధానం ఆ గమ్యస్థానాలలో పర్యాటకానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
  • “పర్యాటక ప్రదేశాలు లేదా రాజధాని నగరాల్లోని “యూనిటీ మాల్స్” స్థానిక క్రాఫ్ట్ మరియు కళను ప్రోత్సహించడానికి ఒక కొత్త విధానం. ఇది స్థానికంగా ఉపాధిని పెంచుతుంది.

మహిళా సమ్మాన్ బచత్ పాత్ర

మహిళల కోసం కొత్త చిన్న పొదుపు పథకం  ప్రకటించారు. మహిళా సమ్మాన్ బచత్  పత్ర అని పిలుస్తారు. ఇది మార్చి 2025 వరకు 2 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. స్త్రీ/అమ్మాయి పేరు మీద రూ. 2 లక్షల డిపాజిట్ సౌకర్యం 7.5 శాతం వడ్డీతో అందించబడుతుంది. పాక్షిక ఉపసంహరణ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ పథకం సహేతుకమైన రాబడిని అందిస్తుంది మరియు మహిళల ఆర్థిక పొదుపులను ప్రోత్సహిస్తుంది.

7 లక్షలకు పైన ఆదాయం ఉంటేనే పన్ను చెల్లింపు

  • నూతన బడ్జెట్ లో ఆదాయ పన్ను స్లాబులను 7 నుండి 5 కి తగ్గించారు.
  • 7 లక్షల లోపు ఆదాయం కలవారు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. 7-9 లక్షల లోపు ఆదాయం కలవారు 5% పన్ను చెల్లించాలి.
  • అత్యధికంగా 15 లక్షల పైన ఆదాయం కలవారు 30 శాతం పన్ను చెల్లించాలి.
  • 9 లక్షలలోపు వ్యక్తిగత ఆదాయం కలిగిన వ్యక్తీ రూ.45,000 లను పన్నుగా చెల్లిస్తే సరిపోతుంది.

Union Budget 2023 Important Points | కేంద్ర బడ్జెట్ 2023 ముఖ్యమైన అంశాలు

  • 2023 ఆర్ధిక సంవత్సరం అంతా ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణి చేయనున్నారు. దీనికి గాను అయ్యే మొత్తం ఖర్చు రూ. 2,00,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం భరించనున్నది.
  • వార్షిక ఆదాయం గత 9 సంవత్సరాలలో రెండింతలు అయ్యి రూ. 1.97 లక్షలుగా ఉన్నది అని పేర్కొన్నారు.

Union budget 2023-24 Highlights, Download PDF

pdpCourseImg

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Union budget 2023-24 Key Highlights, Download PDF_5.1

FAQs

When did Union Budget 2023-24 presented in Parliament?

Union Budget 2023-24 has been presented on 1st Feburary 2023 by Finance Minister Nirmala seetharaman in Lok sabha.

Which Article deals with Annual Financial Statement(Budget) in India?

Article 112 Deals with Annual Financial Statement. Which is presented first only in Lok Sabha by the Finance Minister.