Telugu govt jobs   »   Union Budget 2024-25, Special Focus on...

Union Budget 2024-25, Special Focus on Andhra Pradesh | కేంద్ర బడ్జెట్ 2024: ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి

కేంద్ర బడ్జెట్ 2024 (ఆంధ్ర ప్రదేశ్ పై దృష్టి):  ఐదేళ్ల తర్వాత కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు, ఇండస్ట్రియల్ కారిడార్లు తదితరాల కోసం ప్రకటించిన ‘కట్టుబాట్లను’ పేర్కొంటూ ‘ప్రత్యేక కేటాయింపులు’ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి రూ.15,000 కోట్లు, పోలవరం (ప్రాజెక్ట్) లైఫ్‌లైన్‌కు అదనపు నిధులు, ఈ ఏడాది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు నిధులు, ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు’’ అందిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తన 2024-25 బడ్జెట్ లో చేసిన కేటాయింపుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన కేటాయింపులు

  • లోక్‌సభలో 2024-25 బడ్జెట్‌ను సమర్పిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని హామీలను నెరవేర్చేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేసిందని అన్నారు.
  • కేంద్ర ప్రభుత్వం బహుపాక్షిక ఏజెన్సీల ద్వారా “ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని” సులభతరం చేస్తుందని సీతారామన్ చెప్పారు. “రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తిస్తూ, బహుపాక్షిక అభివృద్ధి సంస్థ ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తాం అని తెలియజేసారు.
  • నిధుల పరిమాణం లేదా సమయాన్ని పేర్కొనకుండా, పోలవరం ప్రాజెక్టుకు ఆర్థికసాయం మరియు త్వరగా పూర్తి చేయడానికి కేంద్రం “పూర్తిగా కట్టుబడి ఉంది” అని ఆర్థిక మంత్రి గమనించారు మరియు దీనిని ఆంధ్రప్రదేశ్ మరియు దాని రైతుల జీవనాధారంగా పేర్కొన్నారు.

Economic Survey 2023-24 Key Highlights In Telugu

  • రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం దక్షిణాది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లోని కొప్పర్తి నోడ్‌లో విద్యుత్, నీరు మరియు రైల్వే వంటి అవసరమైన మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు.
  • హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని ఓర్వకల్ నోడ్‌కు కూడా ఇదే విధమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని సీతారామన్ చెప్పారు.
  • ఇంకా, ప్రత్యేకతలను ప్రస్తావించకుండా, ఆర్థిక వృద్ధికి మూలధన పెట్టుబడికి ఈ సంవత్సరం అదనపు కేటాయింపులు అందించబడతాయని ఆమె నొక్కిచెప్పారు.
  • రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పేర్కొన్న విధంగా నిధులు మంజూరు చేస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు.

కేంద్రం రూపొందించిన EPFO పధకాలు

రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు

  • రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్ను అభివృద్ధి చేయబోతోందని చెప్పారు.
  • ఈ మార్గంలో కృష్ణా నదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నందున ప్రాజెక్టు వ్యయం ఇంత భారీ స్థాయిలో ఉందని చెప్పారు. లైన్ ఎర్రుపాలెం నుంచి ప్రారంభమై కృష్ణా నది మీదుగా అమరావతి స్టేషన్ నుంచి సంబూరు వరకు వెళ్తుందని మంత్రి వివరించారు.
  •  ప్రస్తుతం ఏపీలో రూ.73,743 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అమరావతి రైల్వే లైనుకు సంబంధించిన డీపీఆర్కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఇటీవల నీతిఆయోగ్ ఆమోదముద్ర వేసింది.

కేంద్ర బడ్జెట్ 2024-25 ముఖ్యమైన అంశాలు

APPSC Group 2 Mains Success Pack I Preparation & Revision Complete Live + Recorded Batch By Adda247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!