విజయానికి ప్రతీకగా నిలిచే పండుగ విజయదశమి
దసరా పండుగ
దసరా అనేది ప్రతీ సంవత్సరం ఆశ్వయుజ శుక్ల పాడ్యమితో ప్రారంభమైన నవమి నాడు అనగా తొమ్మిది రోజులు నవరాత్రి సంబరాల తర్వాత విజయదశమి నాడు ముగుస్తుంది. దసరా నాడు వివిధ ప్రాంతాలలో వివిధ పురాణ ప్రాముఖ్యత ఉంది వాటిలో ఒకటి, కృతయుగమున సుకేతనుడు అనే రాజు శాపం వలన రాజ్యభ్రష్టుడై భార్యతో పాటు అడవుల వెంబడి తిరుగుతూ కష్టాలను అనుభవిస్తాడు. ఒకనాడు అంగీరసుడు అనే ఋషి దయవల్ల అతనికి నవరాత్రి గురించి తెలుస్తుంది. ఆతర్వాత అతను మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి తన ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. ఈ ఇతివృత్తం వలన ప్రజలు ఆ అమ్మవారుని వివిధ రూపాలలో దుర్గ, లక్ష్మి, సరస్వతిలా కొలిచి పూజించడం మొదలు పెట్టారు. ఒక్కవదేవతకు మూడేసి రోజులు చొప్పున తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ తొమ్మిది రోజులు ఆ దేవతలను పూజించడం కూడరాకపోయిన ఆఖరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకాలను పెట్టి దేవీత్రయమును కల్పవిధిప్రకారము పూజిస్తారు. ఆ చివరి రోజున మహానవమి అని ఆ రోజున పూజించడం వలన సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అని ప్రజల నమ్మకం. తొమ్మిది రోజుల తర్వాత దశమి తిథివల్ల విజయదశమి అని పేరు వచ్చింది.
మహిషాసురుడు, శక్తివంతమైన రాక్షసుడు. బ్రహ్మదేవుడి వలన మరణం లేని వరం పొంది దేవతలను ఓడించి ఇంద్రుడి సింహాసనాన్ని అధిష్టించాడు. మహిషాసురుని చేష్టల వలన దేవతలు కలత చెందారు అప్పుడు వారు త్రిమూర్తులను అనగా బ్రహ్మ, విష్ణు మరియు శివుడులను సహాయం కోరారు. మహిషాసురుడిని ఓడించడానికి త్రిమూర్తులు తమ శక్తులతో ఒక దేవతను సృష్టించారు. మహిషాసురమర్దినిగా పేరుగాంచిన ఈ అమ్మవారు శివుని తేజస్సుతో ముఖముగాను, విష్ణువు తేజస్సును బాహువులుగాను, బ్రహ్మ తేజస్సును పాదములుగాను ధరించి మంగళమూర్తిగా అవతరించింది. ఆమెకు 18 చేతులు ఉన్నాయి మరియు అన్ని దేవతల ఆయుధాలను కలిగి ఉంది. మహిషాసురమర్దిని మహిషాసురుని సైన్యంతో భీకర యుద్ధం చేసి మహిషాసురుని తరపున పోరాడుతున్న రాక్షసులందరినీ సంహరించింది. చివరకు మహిషాసురుడిని స్వయంగా ఎదుర్కొని భీకర యుద్దంలో ఆమె తన త్రిశూలంతో మహిషాసురుడిని సంహరించింది.
మహిషాసురుని మరణానికి దేవతలు, ప్రజలు సంతోషించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయన మరణించిన రోజును దసరాగా జరుపుకున్నారు. దసరా భారతదేశం అంతటా జరుపుకునే పండుగ. ఇది చెడుపై విజయం సాధించే మంచి శక్తిని గుర్తు చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఎప్పుడూ ఆశను వదులుకోకూడదని కూడా ఇది గుర్తు చేస్తుంది.
నవరాత్రి అవతారాలు
నవరాత్రి ఉత్సవాల లో ఆ శక్తి మాతను ఒక్కోరోజున ఒక్కో దేవి అలంకారంలో అలంకరించి పూజిస్తారు ఈ అలంకారాలు ఒక్కోప్రాంతంలో ఒక్కోలాగా ఉంటాయి.
- మొదటి రోజు శైల పుత్రి
- రెండవ రోజున బ్రహ్మచారిణి
- మూడవ నాడు చంద్రఘంట
- నాల్గవ రోజున కూష్మాండ
- అయిదవ రోజున స్కంధమాత
- ఆరవ రోజున కాత్యాయినీ
- ఏడవరోజున కాళరాత్రి
- ఎనిమిదవ రోజున మహాగౌరి
- తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవి
ఈ నవరాత్రి అవతారాలలో చివరి రోజున అమ్మవారిని కొన్ని ప్రాంతాలలో మహాలక్ష్మి, పార్వతి, కనకదుర్గ, గాయత్రి, మహిషాసుర మర్ధిని, అన్నపూర్ణ ఇలా వివిధ అవతారాలలో కొలుస్తారు.
దసరా – ఉత్సవాలలో పదవ రోజు
చరిత్ర లో దసరా పండుగ
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |