తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా వికాస్‌రాజ్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వికాస్‌రాజ్ ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రంలో ఎలాంటి ఇతర పోస్టుల్లో కొనసాగరాదని, అదనపు బాధ్యతల్లో సైతం ఉండరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వికాస్‌రాజ్ గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |