Telugu govt jobs   »   State GK   »   Violations of Telangana conservation between 1956-69
Top Performing

Telangana Movement- Violations of Telangana conservation between 1956-69, Download PDF |1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు

Telangana Movement & State Formation, 1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు

1956 మరియు 1969 మధ్య కాలంలో తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించి అనేక రకాల ఉల్లంఘనలు జరిగాయి. ఆర్థిక, రాజకీయ అసమానతలు, వనరుల కేటాయింపులో వివక్ష, ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురవడం తెలంగాణ ప్రజల ప్రధాన బాధలు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కుదిరిన అనధికారిక అవగాహన పెద్దమనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఒక ముఖ్య సమస్య, ఇది తెలంగాణ ప్రజలకు విద్య మరియు ఉపాధి అవకాశాల పరంగా భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చింది. అయితే, ఈ వాగ్దానాలు తరచుగా పూర్తిగా అమలు కాకపోవడంతో తెలంగాణ ప్రజల్లో నైరాశ్యం, అసంతృప్తి నెలకొంది.

 1. ప్రాంతీయ మండలి విషయంలో ఉల్లంఘనలు

  • పార్లమెంట్ లో ‘నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్’ను ప్రవేశపెట్టే సమయానికి తెలంగాణ ప్రాంతీయ మండలికి బదులు తెలంగాణ ప్రాంతీయ కమిటీని ప్రతిపాదించారు.
  • ఈ కమిటీ కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలదు. అది కూడా ఆర్థిక భారం లేని సూచనలు మాత్రమే చేయాలని కమిటీ అధికారాలను పరిమితం చేశారు.
  • కమిటీకి ముల్కీ నిబంధనల అమలు, పర్యవేక్షణాధికారాన్ని కాని, ఉన్నత విద్యా వ్యవస్థను పర్యవేక్షించే అధికారం కాని లేవు.
  • ఆ విధంగా పెద్దమనుషుల ఒప్పందంలో ప్రతిపాదించిన ప్రాంతీయ మండలిని బలహీనపరిచి, ప్రాంతీయ కమిటీని మాత్రమే ఏర్పాటు చేశారు.

2. రాజకీయ రంగంలో ఉల్లంఘనలు

తెలంగాణకు ముఖ్యమంత్రి (లేదా) ఉపముఖ్యమంత్రి పదవి 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి.
  • నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉపముఖ్యమంత్రి పదవి “చేతికి ఆరో వేలు వంటిదని” పేర్కొని ఆ పదవిని ఎవరికీ ఇవ్వలేదు.
  • దామోదర్ సంజీవయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉపముఖ్యమంత్రి పదవి తెలంగాణ నాయకుడైన కె.వి. రంగారెడ్డికి ఇచ్చాడు.

హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ

  •  తెలంగాణకు కల్పించిన రక్షణల ప్రకారం “హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ”ని కొనసాగించాలి. 
  • తెలంగాణలో రాజకీయ నాయకత్వం ఎదగకుండా చేయడం కోసం ఆంధ్ర నాయకులు దీనిని రద్దు చేశారు.
  • ఆంధ్ర నాయకులు ఉల్లంఘించిన తెలంగాణ రక్షణలలో అతి ముఖ్యమైన రక్షణ ఇది.

కొత్త రాష్ట్రం పేరు ఆంధ్ర-తెలంగాణగా పెట్టడం

  •  కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్ర-తెలంగాణ అని పేరు పెట్టుటకు అందరూ అంగీకరించారు. 
  • కానీ “ రాష్ట్రాల పునర్విభజనల బిల్లు-1956”లో ఈ పేరు చూపలేదు.
  • పార్లమెంటులో రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదించినపుడు ఈ పేరును ఆంధ్రప్రదేశ్ గా మార్చడం జరిగింది.

3. వ్యవసాయ రంగంలో ఉల్లంఘనలు

  • హైదరాబాద్ కౌలుదారీ మరియు వ్యవసాయ భూముల చట్టం – 1950 ప్రకారం స్థానికేతరులు తెలంగాణ వ్యవసాయ భూములను కొనడం చట్టవిరుద్ధం.
  • కానీ 1968 వ సం||లో హైదరాబాద్ కౌలుదారీ మరియు వ్యవసాయ భూముల చట్టంను సవరించి దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతంలోని పెద్దమొత్తంలో మాగాణి భూమిని తక్కువ ధరకే ఆంధ్రులు కొనుగోలు చేయడం జరిగింది.

4. ఉద్యోగ రంగంలో ఉల్లంఘనలు

1957 ప్రభుత్వ ఉద్యోగాల నివాస అర్హత చట్టం సెక్షన్-3

  • పార్లమెంట్ 1957లో ప్రభుత్వ ఉద్యోగాల (నివాస అర్హత) చట్టాన్ని ఆమోదించింది.
  • ఈ చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల (నివాస అర్హత) నిబంధనలను 1959లో జారీ చేసింది.
  • ఈ నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి, తెలంగాణ ప్రాంతంలోని స్థానిక సంస్థల్లో ఉద్యోగానికై 12సం||రాల స్థిర నివాసాన్ని ఒక అర్హతగా గుర్తించాయి.
  • అదేవిధంగా సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోను ప్రతి మూడు ఉద్యోగాలలో రెండవ ఉద్యోగానికి విధిగా నివాస అర్హతను పాటించాలి.
  • అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో నివాస అర్హతకు మినహాయింపు ఇవ్వవచ్చు.

మినహాయింపు పేరుతో ఉల్లంఘనలు 

  • మే 1968 నాటికి 1,730 సందర్భాలలో మినహాయింపును ఇచ్చినట్లు ప్రభుత్వ రికార్డులు చెపుతున్నాయి.
  • స్థానికంగా అర్హులైన అభ్యర్థులు లేరన్న నెపంతో చాలామందిని స్థానికేతరులను నియమించారు.
  • భార్యభర్తలను ఇద్దరిని ఒకేదగ్గర పోస్టింగ్ చేయాలనే కారణంతో అనేక మంది స్థానికేతరులను నియమించారు.
  • ఆంధ్రలో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారనీ ముల్కీ నియమానికి విరుద్ధంగా వారిని తెలంగాణకు కేటాయించారు.

కొత్తగూడెం థర్మల్ స్టేషన్లో అన్యాయాలు

  • 1961లో పాల్వంచలో థర్మల్ పవర్ స్టేషన్ స్థాపించబడింది. 
  • పాల్వంచలోని పవర్ స్టేషన్ తెలంగాణ మిగులు నిధులతో నిర్మించబడినది కనుక దీనిలోని ఉద్యోగాలలో మిగతా ప్రాంతాల వారికి అవకాశం లేదు. కానీ పెద్ద సంఖ్యలో స్థానికేతరులను నియమించారు.
  • 1968 జూలై 30న పాల్వంచ ఎన్జీవోల సమావేశం కేటీపీఎస్ క్లబ్ లో రామసుధాకర రాజు అధ్యక్షతన జరిగింది.
  • 1968లో తెలంగాణ హక్కుల రక్షణ ఉద్యమం ప్రారంభమై 1968 జూలై 10న తెలంగాణ రక్షణల దినంను పాటించడం జరిగింది.
  • 1968లో కొలిశెట్టి రామదాసు ఖమ్మం జిల్లాలోని ఇల్లెందులో తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేశాడు.
  • అర్హులైన తెలంగాణ స్థానికులు లభించని యెడల ఆ ఖాళీలను అలాగే ఉంచాలని 1968 ఏప్రిల్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
  • ఈ థర్మల్ పవర్ స్టేషన్ ఉద్యోగాలలో తెలంగాణ ప్రాంతీయులని నియమించవలసి ఉన్న ప్రభుత్వం మరియు బోర్డు ఉత్తర్వులను ఖాతరు చేయక 1969 మే 1న కె.సుబ్బారావు (పశ్చిమగోదావరి), ఆజం అలీ (కృష్ణా), ఎ. పెరుమాళ్ (మద్రాస్) వారిని పవర్ స్టేషన్లో నిర్మించడం జరిగింది.
  • దీంతో తెలంగాణ నాయకులలో ప్రముఖుడైన న్యాయవేత్త గులాం పంజాతన్ “పరిస్థితి చేయిదాటక ముందే మేల్కొనండి” అనే శీర్షికతో 1959 డిశంబర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞాపన పత్రం ఇచ్చాడు.

శాసనసభలో ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ప్రకటన

  • తెలంగాణకు జరుగుతున్న నష్టాలపై కె. అచ్చుతరెడ్డి గారు దామోదరం సంజీవయ్యను విమర్శిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశాడు.

అచ్యుతరెడ్డి ఆరోపణలకు స్పందించి శాసనసభలో సంజీవయ్య ఇచ్చిన హామీలు :

  • తెలంగాణ మిగులు నిధులతో పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం
  • కొత్తగూడెంలో ఎరువుల కర్మాగార నిర్మాణం.
  • ఆంధ్రప్రాంతానికి ఖర్చు చేసిన తెలంగాణ మిగులు నిధులను తెలంగాణకు ఖర్చు పెడతామని పేర్కొన్నాడు
  • ముఖ్యమంత్రి ప్రకటన పర్యవసనంగా ప్రభుత్వం 1961లో శ్వేతపత్రం విడుదల చేసింది.

శ్వేతపత్రం లోని ముఖ్యాంశాలు

  • నిజాం సెక్యూరిటీలకు సంబంధించిన రూ.13 కోట్లు తెలంగాణకు ఖర్చు పెట్టడం జరుగుతుంది
  • ఆంధ్రప్రాంతంలో ఖర్చు పెట్టిన తెలంగాణ మిగులు నిధులను తృతీయ ప్రణాళికలో తెలంగాణలో ఖర్చు పెడతారు.
  • దీనికి అదనంగా తెలంగాణలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం రూ. 12 కోట్లు ఖర్చు పెట్టగలదు.

తెలంగాణ అన్యాయాలపై లోకసభ, రాజ్యసభలలో చర్చ 

  • 1961లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు హరిశ్చంద్ర హేడా లోక్ సభలో మాట్లాడుతూ ప్రభుత్వం పెద్దమనుషుల ఒప్పందంలోని మౌలిక విషయాలను ఉల్లంఘించిందని పేర్కొన్నాడు.
  • రాజ్యసభ సమావేశాలలో వి.కె.ధగే మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టకపోతే తెలంగాణలో మహోపద్రవాన్ని ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నాడు.

1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు PDF

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్స్ 

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు  తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర తెలంగాణ ఉద్యమం- తెలంగాణ భావజాల వ్యాప్తి.
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – 1969 ఉద్యమానికి కారణాలు తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు | తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవనం
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956 తెలంగాణ ఉద్యమం – వివిధ నిరసన కార్యక్రమాలు
1948 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం యొక్క సంక్షిప్త చరిత్ర తెలంగాణ ఉద్యమం & రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ గుర్తింపుకై ఆరాటం 
తెలంగాణ ఉద్యమం & రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ భావజాల వ్యాప్తిలో వివిధ సభలు తెలంగాణ ఉద్యమం: తెలంగాణ భావజాల వ్యాప్తిలో ప్రజా సంఘాలు, వేదికల పాత్ర

Telangana Movement - Desire for Telangana identity, Download PDF_80.1

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Telangana Movement- Violations of Telangana conservation between 1956-69, Download PDF_4.1

FAQs

What were the major violations of Telangana conservation during 1956-69?

The major grievances of the people of Telangana included economic and political disparities, discrimination in the allocation of resources, and a sense of neglect by the government.

What was the Gentleman's Agreement?

The Gentleman's Agreement was an informal understanding during the reorganization of states in 1956. It aimed to provide safeguards for the people of Telangana, assuring them certain rights and privileges in education and employment.