Telugu govt jobs   »   Current Affairs   »   Vishwakarma Jayanthi has been declared as...

Vishwakarma Jayanthi has been declared as the state festival of AP by the government | విశ్వకర్మ జయంతిని ఏపీ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది

Vishwakarma Jayanthi has been declared as the state festival of AP by the government | విశ్వకర్మ జయంతిని ఏపీ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన జరుపుకునే విశ్వకర్మ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 24తో కూడిన నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము సెప్టెంబర్ 14 న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, విశ్వక ర్మ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంపై సెప్టెంబర్ 14 న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిని పలువురు విశ్వబ్రాహ్మణులు కలిసి సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ‘శ్రీ విశ్వకర్మ జయంతి’ని ఘనంగా నిర్వహించుకోవాలని చేతివృత్తిదారులందరినీ కోరుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ప్రకటించారు.

AP and TS Mega Pack (Validity 12 Months)

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

విశ్వకర్మ దినోత్సవం చరిత్ర ఏమిటి?

పవిత్ర హిందూ సంప్రదాయం ప్రకారం, విశ్వకర్మను ప్రపంచంలోని డివైన్ ఇంజనీర్ అని పిలుస్తారు. ప్రతి ఇతర దేవుడిలాగే, విశ్వకర్మకు అతని పుట్టినరోజు లేదా జయంతి అంటే విశ్వకర్మ జయంతి అని కేటాయించబడుతుంది. విశ్వకర్మ అన్ని హస్తకళాకారులు మరియు వాస్తుశిల్పులకు అధిష్టానం.