ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్ 12°41′ మరియు 19.07°N అక్షాంశం మరియు 77° మరియు 84°40’E రేఖాంశంల మధ్య ఉంది. వాయివ్యన తెలంగాణా మరియు ఛత్తీస్‌గఢ్, ఉత్తరాన ఒరిస్సా, తూర్పున బంగాళాఖాతం దక్షిణాన తమిళనాడు మరియు నైరుతిన కర్ణాటక ,సరిహద్దులుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 974 కి.మీ తీరప్రాంతం ఉంది, ఇది దేశంలో రెండవ పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. పుదుచ్చేరిలోని యానాం జిల్లా 12 చదరపు మైళ్ళు (30 కిమీ²) ఒక చిన్న ఎన్‌క్లేవ్, రాష్ట్రానికి ఈశాన్యంలో గోదావరి డెల్టాలో ఉంది.
APPSC/TSPSC Sure shot Selection Group
Andhra Pradesh neighbouring states | ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు | |
తూర్పు | బంగాళాఖాతం |
దక్షిణం | తమిళనాడు |
ఉత్తరం | ఒడిశా, తెలంగాణా మరియు ఛత్తీస్‌గఢ్ |
పడమర | కర్ణాటక |
Andhra Pradesh border districts with other states
ఇతర రాష్ట్రాలతో సరిహద్దు జిల్లాలు
- ఒడిశా: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారాంరాజు
- తెలంగాణ: ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అల్లూరి సీతారాంరాజు
- కర్ణాటక: కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి
- తమిళనాడు: చిత్తూరు, తిరుపతి
- ఛత్తీస్‌గఢ్: అల్లూరి సీతారామ రాజు
- తెలంగాణ రాష్ట్రం విడిపోవడం వల్ల మహారాష్ట్రతో సరిహద్దును ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది.
- కడప జిల్లాను మినహాయించి ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన అన్ని జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి.
- ఏ రాష్ట్రంతో సరిహద్దులు లేని కడప జిల్లాను భూపరివేష్టిత జిల్లాగా పేర్కొంటారు.
- అల్లూరి సీతారాంరాజు జిల్లా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మరియు తెలంగాణ అనే మూడు రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది
- ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతం జిల్లాలు : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి
Andhra Pradesh can be divided into Three regions in terms of physical, social and economic status.
భౌతిక, సాంఘిక, ఆర్థిక స్థితి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ను మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది: ఉత్తరాంధ్ర, కోస్తాాంధ్ర మరియు రాయలసీమ. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.
North Andhra | ఉత్తరాంధ్ర
- శ్రీకాకుళం
- విజయనగరం
- పార్వతీపురం మన్యం
- అల్లూరి సీతారామరాజు
- విశాఖపట్నం
- అనకాపల్లి జిల్లాలు
Coastal Region | కోస్తా ప్రాంతం
ఈ ప్రాంతంలో 9 (ఉమ్మడి) జిల్లాలు ఉన్నాయి.
- కాకినాడ
- డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ
- తూర్పు గోదావరి
- పశ్చిమ గోదావరి
- ఏలూరు
- కృష్ణా
- ఎన్టీఆర్
- గుంటూరు
- పల్నాడు
- బాపట్ల
- ప్రకాశం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
- కోస్తా ఆంధ్ర ప్రాంతం వైశాల్యం 92,900 చ.కి.మీ. ఈ ప్రాంతంలో నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులు ఏర్పరచిన సారవంతమైన డెబ్టామైదానాలున్నాయి. రాష్ట్రంలో పండుతున్నఆహార, వాణిజ్య పంటలు అత్యధికంగా ఈ ప్రాంతంలోనే పండుతున్నాయి. అందుకే కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని దక్షిణ భారత దేశ ధాన్యాగారం (గ్రానరి ఆఫ్ ది సౌత్ ఇండియా)గా పిలుస్తారు.
- ఈ ప్రాంతం వాణిజ్య, రవాణా, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాయలసీమ ప్రాంతం కంటే అభివృద్ధి చెందింది.
Rayalaseema area | రాయలసీమ ప్రాంతం
రాయలసీమలో జిల్లాలు ఉన్నాయి. అవి:
1. చిత్తూరు
2. కడప
3. అనంతపురం
4. కర్నూలు
- రాయలసీమ వైశాల్యం 67,400 చఃకి.మీ.
- పూర్వం నుంచి కరవు కాటకాలకు ప్రసిద్ది చెందింది. జనసాంద్రత కూడా అల్పమే.
- శిలామయమైన నిస్సార మృత్తికలు, నిలకడలేని వర్షపాతం ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.
- ఆంధ్రప్రదేశ్ 972 కి.మీ. (605 మైళ్ల)తో తూర్పు తీరంలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం.
- పొడవైన తీర రేఖ కలిగిన జిల్లా – శ్రీకాకుళం
also read: AP Geography -AndhraPradesh Physical Geography PDF In Telugu
Which state share the maximum border with Andhra Pradesh
తెలంగాణ రాష్ట్రం- ఆంధ్ర ప్రదేశ్ తో గరిష్ట సరిహద్దును పంచుకుంటుంది.
Which state share the minimum border with Andhra Pradesh
చత్తీస్‌గఢ్ రాష్ట్రం- ఆంధ్ర ప్రదేశ్ తో కనిష్ట సరిహద్దును పంచుకుంటుంది.
Andhra Pradesh neighbouring states PDF
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |