Telugu govt jobs   »   Article   »   changes in TS DSC (TRT) 2023

What are the new changes in TS DSC (TRT) 2023 Notification? | TS DSC (TRT) 2023 నోటిఫికేషన్‌లో కొత్త మార్పులు ఏమిటి?

తెలంగాణ విద్యాశాఖ  టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం TS DSC 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ DSC TRT నోటిఫికేషన్ 2023 ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ (భాషలు, భాషేతర), లాంగ్వేజ్ పండిట్,  ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET) పోస్టుల కోసం 5089 పోస్ట్‌లను కలిగి ఉంది. అయితే, TS DSC 2023 నోటిఫికేషన్ లో కొన్ని మార్పులు జరిగాయి. ఆగస్టు లో మొత్తం 6500+ ఖాళీలు విడుదల చేస్తాం అని చెప్పిన తెలంగాణ విద్యాశాఖ CWSN కోసం కేటాయించిన 1,528 స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీని నిలిపివేసి, 5089 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అలానే ఇంకా కొన్ని మార్పులు చేసింది. అవి ఏమిటో తెలుస్కోవడానికి ఈ కథనం చదవండి.

స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి బ్రేక్

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా గా ఉన్న CWSN (ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు) కోసం ఉద్దేశించిన 1,528 స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ గురించి అధికారికంగా విడుదల చేసిన TS DSC ఖాళీలలో పేర్కొన్నలేదు. తెలంగాణ  ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన TS TRT నోటిఫికేషన్ లో 5,000 సాధారణ ఉపాధ్యాయ పోస్టుల వివ రాలను మాత్రమే వెల్లడించింది. ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల నియామకాలపై నోటిఫికేషన్ ఇవ్వ లేదు.

పదోన్నతుల కోటా, క్రమబద్దీకరణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TS TRT నోటిఫికేషన్‌ 2023 కింద భర్తీ చేయాలనుకున్న 1,523 ప్రత్యేక విద్యా వృత్తి ఉపాధ్యాయ పోస్టులలో స్కూల్ అసిస్టెంట్లు 1739, సెకండరీ గ్రేడ్ టీచర్ 2575 పోస్టులున్నాయి. నిబంధనల విద్య ప్రకారం స్కూల్ అసిస్టెంట్లు (SA) ఉద్యోగాలన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపడానికి వీల్లేదు. వాటిలో 70% SGTలకు పదోన్నతులిచ్చి  మిగిలనవి భర్తీ చేయాలి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఎడ్యు కేషన్ టీచర్లు 600 మంది వరకు ఉన్నారు. వారు తమకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తు న్నారు.

దానికితోడు ప్రస్తుతం మండలా నికి ఒకటి చొప్పున సమగ్ర శిక్ష అభియాన్(SSA) ఆధ్వర్యంలో నడుస్తున్న భవిత కేంద్రాల్లో 970 మంది ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (IERP)లు కాంట్రాక్టు విధానం ద్వారా పదేళ్లుగా పనిచేస్తున్నారు. అన్ని విద్యార్హతలున్న తమను క్రమబద్ధీరించాలని కోరుతున్నారు.

భారత మండపం అంటే ఏమిటి? న్యూ ఢిల్లీలో G20 సమ్మిట్ వేదిక గురించి పూర్తి వివరాలు_80.1APPSC/TSPSC Sure shot Selection Group

ఆన్లైన్ విధానంలో పరీక్ష

గతంలో జరిగిన TS TRT రాత పరీక్ష ఆఫ్లైన్ మోడ్ అంటే (పెన్ను, పేపర్) పద్దతిలొ నిర్వహించారు. తొలిసారిగా TS TRT DSC పరీక్షను (ఆన్‌లైన్‌ విధానం) కంప్యూటరు బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో నిర్వహించనుంది.

పెరిగిన దరఖాస్తు రసుము

ఈసారి దరఖాస్తు ఫీజును భారీగా పెంచారు. 2017 జులైలో నిర్వహించిన TS TRT పరీక్ష కి దరఖాస్తు రసుము రూ.200 ఉంది. కానీ ఇప్పుడు దరఖాస్తు ఫీజును ఏకాంగ రూ. 1000కి పెంచారు. ఒక్కొక్క పోస్టుకి దరఖాస్తు ప్రాసెసింగ్ మరియు వ్రాత పరీక్ష కొరకు చెల్లించాల్సిన ఫీజు రూ. 1000/-.  ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోదల్చిన అభ్యర్థులు ప్రతి పోస్టు కొరకు వేర్వేరుగా రూ.1000/-లను చెల్లించి, వేర్వేరు దరఖాస్తును దాఖలు చేయవలెను. SC & ST అభ్యర్థులకు కూడా దరఖాస్తు రసుము లో రాయితీ ఇవ్వలేదు.

TS DSC రిక్రూట్మెంట్ ప్రక్రియ లో జరిగిన మార్పులలో ముఖ్యాంశాలు

TS DSC దరఖాస్తు తేదీలు, ఎంపిక విధానం, విద్యార్హతలు, దరఖాస్తు ఫీజు వంటి వివరాలను ప్రభుత్వం 7 సెప్టెంబర్ 2023 న  షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.  అందులో పేర్కొన్న ముఖ్యాంశాలు.

  • సాధారణ ఉపాధ్యాయ పోస్టులకు స్పెషల్ D.ED, స్పెషల్ B.ED పూర్తి చేసి, టెట్ అర్హత సాధించిన వారికి అవకాశమిచ్చారు. అయితే, సాధారణ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన తర్వాత వారు ఆరు నెలలు ప్రత్యేక కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • SGT పోస్టులకు D.ED పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు.
  • పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరగనుంది, ప్రశ్నలు తెలుగు-ఆంగ్లం, ఉర్దూ-ఆంగ్లంలో ఉంటాయి. 160 ప్రశ్నలు, 80 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • TS DSC పరీక్షలో సాధించిన మార్కులకు 80% వెయిటేజీ మరియు  TS TETలో సాధించిన మార్కులకు 20% వెయిటేజీ ఇచ్చారు. రెండింటినీ కలిపి తుది ర్యాంకు నిర్ణయిస్తారు.
  • TS DSC (TRT) పరీక్ష నవంబర్ 20 నుండి 30 వరకు రోజుకు రెండు షిఫ్ట్ లలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. ముందుగా SGT అభ్యర్థులకు పరీక్షలు ఉంటాయి.
  • ఈసారి 1-7 తరగతుల విద్యాభ్యాసం ఆధారంగా స్థానిక, స్థానికేతర అభ్యర్థిగా నిర్ణయిస్తారు. 95% ఖాళీలను స్థానికులతో, 5 శాతాన్ని స్థానికేతరులతో భర్తీ చేస్తారు.
  • TS DSC (TRT) ఫలితాల అనంతరం ధ్రువపత్రాల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తారు.
  • ఎవరైనా అభ్యర్థి SGT, SA రెండిటికి ఎంపికైతే, ఎందులో చేరతారు  ముందే నిర్ణయించుకొని చెప్పాలి. వారి నుంచి హామీపత్రం తీసుకుంటారు.
  • అభ్యర్థి వదులుకున్న పోస్టులో తర్వాతి అభ్యర్థికి అవకాశమి స్తారు. ఇద్దరు అభ్యర్ధులకు సమానంగా మార్కులు వస్తే TS TRT + TS TET కలిపి) వారిలో వయసు ఎక్కువున్న వారికి ర్యాంకులో ప్రాధాన్యం ఇస్తారు. అది కూడా సమానంగా ఉంటే అమ్మాయిలకి ప్రాధాన్యం ఇస్తారు. అదీ కూడా సమానంగా ఉంటే SC, ఆ తర్వాత ST, BC, OCలకు ర్యాంకులు కేటాయిస్తారు. అదీ కూడా టై అయితే వారి చదువులో సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు.

 

TS DSC Related Articles: 
TS DSC నోటిఫికేషన్ 2023
TS TRT DSC సిలబస్
TS DSC ఖాళీలు 2023
TS TRT DSC మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
TS DSC 2023 అర్హత ప్రమాణాలు
TS TRT DSC పరీక్ష CBRT మోడ్‌లో మాత్రమే నిర్వహించబడుతుంది.
TS DSC పరీక్షా విధానం 2023

Telugu EMRS JSA Live and Recorded Batch | Online Live Classes by Adda 247

 

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

టీఎస్ డీఎస్సీకి ఎన్ని మార్కులు ఉంటాయి?

80% మార్కులు రాత పరీక్ష నుండి తీసుకోబడతాయి మరియు 20% మార్కులు TET పేపర్ 1 నుండి తీసుకోబడతాయి = మొత్తం 100% మార్కులు ఎంపిక ప్రక్రియ కోసం పరిగణించబడతాయి..

TS TRTకి వయోపరిమితి ఎంత?

అభ్యర్థులు 18-44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

టీఎస్ TRT నోటిఫికేషన్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

TS TRT నోటిఫికేషన్ 2023లో 5809 ఖాళీలు ఉన్నాయి..