Telugu govt jobs   »   Polity   »   Who is Telangana Governor, List of...

Who is Telangana Governor, List of Telangana Governors | తెలంగాణ గవర్నర్లు పూర్తి సమాచారం, తెలంగాణ ప్రస్తుత గవర్నర్ ఎవరు

Who is the Telangana Governor, List of Telangana Governors :

Dr. Tamilisai Soundararajan took oath as Governor of Telangana on 8th September 2019. Tamilsai Soundarajan is the second Governor of Telangana. She is also the first woman governor of Telangana state. Tamilisai Soundararajan is appointed by President Ram Nath Kovind for a term of 5 years.

తెలంగాణ గవర్నర్లు పూర్తి సమాచారం 

తెలంగాణ లో  అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు పోలీస్ మరియు రెవెన్యూ శాఖలలోనికి చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీలో జనరల్ స్టడీస్ లో ఒక భాగమైన Static GK ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

 TSSPDCL Junior Lineman Notification 2022, TSSPDCL జూనియర్ లైన్ మాన్ నోటిఫికేషన్ 2022APPSC/TSPSC Sure shot Selection Group

తెలంగాణ గవర్నర్ ఎవరు?

తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ కూడా. తమిళనాడుకు చెందిన తమిళిసై.1961 జూన్ 2న కృష్ణకుమారి, కుమార్ అనంతన్ దంపతులకు జన్మించారు.వీరిది కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ ప్రాంతం.ఈమె తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.. ఎంపీగా కూడా పనిచేశారు.

2019 సెప్టెంబర్ 8న తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా భాద్యతలు చేపట్టిన తమిళిసైకి కేంద్రపాలిత రాష్ట్రమైన పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఫిబ్రవరి 2021లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.. ఇక తమిళిసైకి ఇద్దరు పిల్లలున్నారు

తెలంగాణ గవర్నర్ల జాబితా

గణతంత్ర దేశానికి రాష్ట్రపతి అధిపతి అయినట్లే గవర్నర్ రాష్ట్రానికి అధిపతి. రాష్ట్రానికి గవర్నర్ నామమాత్రపు అధిపతి అయితే, ముఖ్యమంత్రి కార్యనిర్వాహక అధిపతి. రాష్ట్ర కార్యనిర్వాహక చర్యలన్నీ గవర్నర్ పేరుతోనే జరుగుతాయి. అయితే, వాస్తవానికి అతను వివిధ కార్యనిర్వాహక చర్యలకు తన సమ్మతిని మాత్రమే ఇస్తాడు. అతను లేదా ఆమె ఎటువంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోలేరు. రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవహారాలలో నిజమైన అధికారాలు ముఖ్యమంత్రి మరియు మంత్రుల మండలిపై ఉంటాయి.

క్ర.సం. పేరు పదవి కాలం
1 E. S. L. నరసింహన్ 2 జూన్ 2014   23 జూలై 2019
2. E. S. L. నరసింహన్ 24 జూలై 2019 7 సెప్టెంబర్ 2019
3. తమిళిసై సౌందరరాజన్ 2019 సెప్టెంబర్ 8 ప్రస్తుతం అధికారంలో ఉన్నారు.

 

గవర్నర్ గురించి

  •  గవర్నర్ రాష్ట్ర ప్రథమ పౌరుడు. 
  • రాష్ట్రానికి అధిపతి
  • రాష్ట్ర పరిపాలన గవర్నర్ పేరు మీద జరుగుతుంది. 
  • గవర్నర్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారుడిగా కొనసాగుతాడు.
  • గవర్నర్ గూర్చి వివరించే నిబంధనలు : 153-162 (6వ భాగం) ) 
  • 153వ నిబంధన ప్రకారం గవర్నర్ పదవి రాష్ట్రంలో ఉంటుంది. 
  • రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటారు. 
  • రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్. 
  • ప్రతి 15 రోజులకు ఒకసారి గవర్నర్ రాష్ట్రంలో గల పరిస్థితులను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపుతారు. 
  • దేశంలో మొదటి మహిళా గవర్నర్ – సరోజిని నాయుడు (ఉత్తరప్రదేశ్)
  • దేశంలో 2వ మహిళా గవర్నర్ – పద్మజా నాయుడు (పశ్చిమబెంగాల్)
  • రాష్ట్ర శాసనశాఖలో అంతరభాగం- గవర్నర్ 
  • తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చే వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా కొనసాగుతారు అని ఏ.పి. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 తెలుపుతుంది.

also read: Telangana History PDF in Telugu 

గవర్నర్ అర్హతలు

  • భారతీయ పౌరుడైవుండాలి.
  • కనీస వయస్సు 35 సంవత్సరాలు నిండివుండాలి.
  • లాభాదాయకమైన పదవి ఉండరాదు.
  • చట్ట సభల్లో సభ్యత్వం ఉండరాదు.

గవర్నర్ నియామకం మరియు పదవి కాలం

  • 155వ నిబంధన ప్రకారం ప్రధాన మంత్రి సూచన మేరకు గవర్నర్‌ను నియమిస్తారు.
  • గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది – హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  • రాష్ట్రపతి ఒకే వ్యక్తిని 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ గా నియమించవచ్చు.
  • గవర్నర్ నియామక పద్దతిని కెనడా నుండి స్వీకరించారు.
  • రాజ్యాంగ ప్రకారం గవర్నర్ పదవికాలం – 5 సంవత్సరాలు
  • వాస్తవంగా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నత వరకే గవర్నర్ పదవిలో కొనసాగుతారు.
  • గవర్నర్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి ఇవ్వాలి. 
  • గవర్నర్ ను పదవి నుండి తొలగించేది రాష్ట్రపతి,
  • ఏ కారణం చేతనైనా గవర్నర్ పదవి ఖాళీ అయితే 7 నెలలలోపు భర్తీ చేయాలి.
  • కొత్త గవర్నర్ వచ్చే వరకు వేరే రాష్ట్ర గవర్నర్ కు అధనపు భాద్యతలను రాష్ట్రపతి కల్పిస్తారు.

గవర్నర్ జీతభత్యాలు

  • గవర్నర్ జీతభత్యాలు నిర్ణయించేది – పార్లమెంట్ 
  • ప్రస్తుతం గవర్నర్ నెలసరి వేతనం – 3,50,000 
  • నార్షిక పెన్షన్ – 6లక్షల 60 వేలు. 
  • రాష్ట్ర సంఘటిత నిధి నుండి జీతభత్యాలను స్వీకరిస్తారు. 
  • భారత సంఘటిత నిధి నుండి పెన్షన్ ను స్వీకరిస్తారు. 
  • ఒకే వ్యక్తి 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసినట్లయితే ఆయా రాష్ట్రాలు గవర్నర్ వేతనాన్ని సమానంగా చెల్లిస్తాయి.
  • గవర్నర్ అధికార నివాసంను – రాజ్ భవన్ గా పిలుస్తారు.
  • రాష్ట్ర రాజధాని నగరంలో రాజ్ భవన్ ఉంటుంది.
  • దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు కూడా గవర్నర్ వేతనం మారదు.
  • రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్య, ఆరోగ్య, రవాణా సౌకర్యాలను కల్పిస్తుంది.

also read: Ramappa Temple Telangana

గవర్నర్ అధికారాలు మరియు విధులు 

రాష్ట్ర గవర్నర్ యొక్క అధికారాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.

శాసన అధికారాలు

  • రాష్ట్ర శాసనశాఖలో అంతరభాగం, 3వ సభగా గవర్నర్.
  • 174వ నిబంధన ప్రకారం గవర్నర్ శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేయడం, నిరవధికంగా సమావేశాలను వాయిదా వేస్తారు.
  • 174వ నిబంధన ప్రకారం గవర్నర్ శాసనసభలో విశ్వాసం కల్గిన ముఖ్యమంత్రి సూచన మేరకు శాసనసభను రద్దు చేస్తారు.
  • 333 నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ ఒక ఆంగ్లో ఇండియన్ ను నియమిస్తారు. శాసనసభకు)
  • 171వ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ విధాన పరిషత్ కు 1/6 వ వంతు సభ్యులను నియమిస్తారు. (కళలు సాహిత్యం , సమాజ సేవ, శాస్త్ర సాంకేతిక ఇతర రంగాల్లో అనుభవం గలవారు)
  • 213 నిబంధన ప్రకారం గవర్నర్ శాసనసభ సమావేశంలో లేనప్పుడు ముఖ్యమంత్రి నాయకత్వాన గల కేబినేట్ మంత్రులు లిఖిత పూర్వకం సిపారసు చేసినట్లయితే ఆర్డినెన్స్ ను జారీ చేస్తారు.
  • ఆర్డినెన్స్ పరిమితి కాలం – 6 నెలలు
  • గరిష్ట కాలపరిమితి – 7 1/2 నెలలు.
  • శాసనసభ సమావేశం ప్రారంభం అయిన రోజు నుండి 6 వారాల లోపు ఆర్డినెన్ను ఆమోదించినట్లయితే చట్టంగా మారుతుంది. లేని యెడల రద్దు అవుతుంది. –
  • రాష్ట్ర గవర్నర్ ప్రసంగ పాఠాన్ని తయారుచేసేది ముఖ్యమంత్రి అధ్యక్షతన గల కేబినెట్ మంత్రులు.
  • రాష్ట్ర శాసనసభ గవర్నర్ ప్రసంగ పాఠానికి ధన్యవాధాలను తెలిపే తీర్మానాన్ని ఆమోదించాలి. లేని యెడల మంత్రిమండలి రద్దవుతుంది.
  • గవర్నర్  ప్రసంగ పాఠానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వం తరుపున అధికార పక్ష సభ్యుడు లేదా మంత్రి శాసనసభలో ప్రవేశపెడతారు.

కార్యనిర్వాహక అధికారాలు

  • రాజ్యాంగ ప్రకారం గవర్నర్ కు నామమాత్రమైన కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి.
  • 164(ఎ) నిబంధన ప్రకారం గవర్నర్ మెజార్టీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు.
  • ముఖ్యమంత్రి సూచన మేరకు క్రింది వారిని నియమిస్తారు
  • 1. రాష్ట్ర మంత్రులు
  • 2. అడ్వకేట్ జనరల్
  • 3. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులు
  • 4. రాష్ట్ర ఎన్నికల కమిషనర్
  • 5. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు
  • 6. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులు
  • 7. రాష్ట్ర లోకాయుక్తా
  • 8.రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ చాన్సులర్స్
  • 9. రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్, సభ్యులు
  • 10. జిల్లా న్యాయమూర్తులు

ఆర్థిక అధికారాలు

  • రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి, ప్రారంభించే అధికారం గవర్నర్ కు ఉంటుంది.
  • రాష్ట్ర ఆర్థిక మంత్రి గవర్నర్ ముందస్తు అనుమతితో బడ్జెట్ ను మొదటగా శాసన సభలో ప్రవేశపెట్టాలి.
  • శాసన సభ ఆమోదించిన బడ్జెట్ ను విధాన పరిషత్ 14 రోజుల లోపు ఆమోదించాలి.
  • రాష్ట్ర శాసనసభ ఆమోదంతోనే బడ్జెట్ అమలులోకి వస్తుంది.
  • రాష్ట్ర గవర్నర్ ప్రతి 5 సంవత్సరం లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
  • రాష్ట్ర ఆర్థిక సంఘంలో చైర్మన్, 4 గురు సభ్యులు ఉంటాయి.
  • రాష్ట్ర ఆర్థిక సంఘం వార్షిక నివేదికను గవర్నర్ కు సమర్పిస్తుంది.
  • గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘం వార్షిక నివేదికను పరిశీలించిన తర్వాత శాసనసభకు పంపుతారు.
  • రాష్ట్ర ఆర్థిక సంఘం గూర్చి వివరించే నిబంధన – 243(I)
  • రాష్ట్ర బడ్జెట్ గూర్చి వివరించే నిబంధన – 202. – 266వ నిబంధన రాష్ట్ర సంఘటిత నిధి
  • 267(1) రాష్ట్ర ఆఘంతక నిధి గూర్చి వివరిస్తుంది.
  • రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు సహాయం చేయలేనప్పుడు గవర్నర్ తన దగ్గర గల అఘంతక నిధి నుండి డబ్బులు ఖర్చు పెడతారు.

న్యాయ అధికారాలు

  • 161వ నిబంధన ప్రకారం గవర్నర్‌కు క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి.
  • ఉరిశిక్ష పైన క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్ కు ఉండదు.
  • ముఖ్యమంత్రి అధ్యక్షతన గల కేబినెట్ మంత్రుల లిఖిత పూర్వక సిఫారసుల మేరకు గవర్నర్ నేరస్తులకు క్షమాభిక్షను పెడతారు. ( శిక్షను తగ్గించడం, శిక్షా స్వభావాన్ని మార్చడం, శిక్ష అమలు కాలాన్ని వాయిదా వేయడం, శిక్షను పూర్తిగా రద్దు చేయడం.)
  • జిల్లా న్యాయమూర్తులను నియమించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.

Download Static GK(ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు) PDF

విచక్షణా అధికారాలు

  • దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నపుడు గవర్నర్ వాస్తవ అధికారాలను నిర్వహిస్తారు.
  • శాసనసభా ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానప్పుడు గవర్నర్ తన విచక్షణా అధికారంతో ముఖ్యమంత్రిని నియమిస్తారు.
  • గవర్నర్ నిర్దేశించిన గడువులోపు ముఖ్యమంత్రి శాసనసభలో బలనిరూపన చేసుకున్నట్లయితే పదవిలో కొనసాగుతారు. లేనియెడల పదవిని కోల్పోతారు.

 

AP and Telangana Test Mate | Unlock Unlimited Tests for APPSC | TSPSC | GROUPs | AP & Telangana Police & Others 2023-2024 | Complete Online Test Series By Adda247

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Who is Telangana Governor, List of Telangana Governors_5.1

FAQs

తెలంగాణ 1వ గవర్నర్ ఎవరు?

E.S.L నరసింహన్ (జననం 1945) ఒక భారతీయ మాజీ సివిల్ సర్వెంట్ మరియు తెలంగాణా మొదటి గవర్నర్‌గా పనిచేసిన రాజకీయ నాయకుడు.

భారతదేశ మొదటి గవర్నర్ ఎవరు?

విలియం బెంటింక్ 1833లో భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ అయ్యాడు

తెలంగాణ ప్రస్తుత గవర్నర్ ఎవరు?

ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్