Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Wings India 2022 Aviation Show in...
Top Performing

హైదరాబాద్‌లో వింగ్స్‌ ఇండియా 2022 ఏవియేషన్‌ షో

Wings India 2022 Aviation Show in Hyderabad

 ఆసియా దేశపు అతిపెద్ద ఏవియేషన్‌ షో… పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక దైవార్షిక ప్రదర్శన.. వింగ్స్‌ ఇండియా 2022 నగరంలో కొలువుదీరనుంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ ఆవరణలో మార్చి 24 నుంచి 4 రోజుల పాటు జరుగనున్న ఈ భారీ ఏవియేషన్‌ షో కోసం సర్వం సిద్ధమైంది.

 ఆసియా దేశపు అతిపెద్ద ఏవియేషన్‌ షో… పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక దైవార్షిక ప్రదర్శన.. వింగ్స్‌ ఇండియా 2022 నగరంలో కొలువుదీరనుంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ ఆవరణలో మార్చి 24 నుంచి 4 రోజుల పాటు జరుగనున్న ఈ భారీ ఏవియేషన్‌ షో కోసం సర్వం సిద్ధమైంది.

కరోనా కారణంగా గత మార్చిలో ఈ షోను కేవలం బిజినెస్‌ మీట్‌గా మాత్రమే పరిమితం చేశారు. రెండేళ్ల కోవిడ్‌ కాటు నుంచి కోలుకుంటూ… నగరంలో వింగ్స్‌ ఇండియా పూర్తి స్థాయిలో సందడి చేయనుంది ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో పాటు పలు ప్రభుత్వ విభాగాలు పాలు పంచుకుంటుండగా, నగరానికి చెందిన ఫెడరేషన్‌ ఆఫ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) వింగ్స్‌ ఇండియా నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఈ కార్యక్రమాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభిస్తారు. మరో కేంద్రమంత్రి వికె సింగ్‌లు హాజరుకానున్నారు. చర్చలు.. సదస్సులు.. ఈ కార్యక్రమంలో హెలికాప్టర్‌ పరిశ్రమపై రౌండ్‌ టేబుల్‌ చర్చ జరుగనుంది. అదే విధంగా ఏవియేషన్‌ ఫైనాన్సింగ్‌– లీజింగ్‌ డ్రోన్స్, ఏవియేషన్‌ రివైవల్, ఏరో మాన్యుఫ్యాక్చరింగ్‌ భవిష్యత్తు, నిర్వహణ, మరమ్మతు, కార్యకలాపాలు తదితర అంశాలపై ప్యానెల్‌ చర్చ నిర్వహిస్తారు. సంబంధిత రంగంతో పాటు అనుబంధ రంగాలకు చెందిన పలు సంస్థలకు వింగ్స్‌ ఇండియా పురస్కారాలను మార్చి 25న ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం హోటల్‌ తాజ్‌కృష్ణాలో జరుగుతుంది.

ఈ ఈవెంట్‌లో తొలి 2 రోజులూ వ్యాపార కార్యకలాపాల కోసం పరిమితం చేశారు. చివరి 2 రోజులూ సాధారణ ప్రజలను అనుమతిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించాలనుకునేవారు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే టిక్కెట్స్‌ కొనుగోలు చేయడానికి వీలుంటుంది

 

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Daily Current Affairs in Telugu 22nd March 2022|(డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో) |_240.1

Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking

Sharing is caring!

Wings India 2022 Aviation Show in Hyderabad_4.1